
ముంబై: దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 50వేల మార్కును దాటింది. ఆదివారం రోజున కొత్తగా 3,041 పాజిటివ్ కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 50,231కి చేరుకుంది. అయితే కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 58 మంది మరణించగా.. ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,635గా ఉంది.
కాగా మహారాష్ట్రలో మొత్తం 33,988 యాక్టివ్ కేసులు ఉండగా.. 14,600 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ విలయం మరింతగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ముంబైలో 28,717 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 949 మంది మరణించారు. చదవండి: కోవిడ్ -19 : రోజు గడిచేదెట్టా!
Comments
Please login to add a commentAdd a comment