స్పాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు
స్పా పేరుతో నడుపుతున్న సెక్స్ రాకెట్‌ను రాజస్థాన్ పోలీసులు బట్టబయలు చేశారు.
కోటా: స్పా పేరుతో నడుపుతున్న సెక్స్ రాకెట్‌ను రాజస్థాన్ పోలీసులు బట్టబయలు చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిది మంది మహిళలు సహా 18 మందిని కోటా పోలీసులు అరెస్ట్ చేశారు. బుండి ప్రాంతానికి చెందిన దంపతులు గత కొంతకాలంగా రెండు ప్రాంతాల్లో స్పాలు నడుపుతోంది. అయితే వాటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం కోటా నగరం గుమాన్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ స్వ్వేర్ మాల్‌పై పోలీసులు దాడి చేశారు.
ఈ సందర్భంగా నలుగురు విటులతో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు, నాగాలాండ్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా డిస్ట్రిక్ సెంటర్‌లో నడుపుతున్న స్పాపై దాడి చేసి నలుగురు థాయ్ మహిళలతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.