దినకరన్‌కు చుక్కెదురు!
చెన్నై: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను కలిసేందుకు వెళ్లిన అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌కు చుక్కెదురైంది. గురువారం శశికళను కలవడానికి దినకరన్ వెళ్లగా ఆయన కారును జైలు ప్రాంగణంలో రెండవ నిఘా కేంద్రం వద్ద నిలిపివేశారు. దీంతో ఆయన దాదాపు రెండు గంటలపాటు అక్కడే వేచి ఉన్నా శశికళను కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో నిరాశ చెందారు.
జైలులో శశికళను విచారిస్తుండటంతో అనుమతి లభించడం లేదని తెలుసుకున్న దినకరన్ గురువారం అక్కడే ఉన్నారు. శుక్రవారం రోజు మరోసారి ఆమెను కలిసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో చెన్నైకి తిరిగి వచ్చేశారు. అయితే ఈ నెల 24న దినకరన్ మరోసారి పరప్పన అగ్రహార జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. వీఐపీ ట్రీట్‌మెంట్ కోసం శశికళ రూ.2 కోట్లు ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలను దినకరన్ కొట్టిపారేశారు. ముడుపుల వ్యవహారం ఆరోపణలపై చర్చించేందుకు శశికళను కలవడానికి దినకరన్ వెళ్లినట్లు ప్రచారంలో జరుగుతోంది.