‘దంగల్‌’ జైరాకు బాలీవుడ్‌ మద్దతు | Zaira Wasim: Bollywood celebs come out in support of Dangal girl | Sakshi
Sakshi News home page

‘దంగల్‌’ జైరాకు బాలీవుడ్‌ మద్దతు

Published Wed, Jan 18 2017 3:50 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

‘దంగల్‌’ జైరాకు బాలీవుడ్‌ మద్దతు - Sakshi

‘దంగల్‌’ జైరాకు బాలీవుడ్‌ మద్దతు

ముంబై: వేర్పాటువాదంతో కశ్మీర్‌ అట్టుడుకుతున్నవేళ ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీని ‘దంగల్‌’ ఫేమ్, బాలీవుడ్‌ నటి జైరా వసీమ్‌(16) కలవడం, వేర్పాటువాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, వెంటనే జైరా క్షమాపణల నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్‌ ప్రముఖులు బాసటగా నిలిచారు. దంగల్‌ సినిమాలో రెజ్లర్‌ ‘గీత ఫొగట్‌’ చిన్ననాటి పాత్రలో అద్భుతంగా నటించిన కశ్మీర్‌ అమ్మాయి జైరా.. ‘కశ్మీర్‌ యువతకు రోల్‌మోడల్‌’ అనే వార్తలు మీడియాలో విస్తృతమవడం, వేర్పాటువాదుల అభ్యంతరంతో జైరా ఫేస్‌బుక్, ట్విటర్‌లో క్షమాపణలు చెప్పింది. ‘నన్ను ఎవరూ(కశ్మీర్‌యువత) ఆదర్శంగా తీసుకోవద్దు’ అని వ్యాఖ్యానించింది.

దీనిపై బాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. ‘జైరా నాకు రోల్‌మోడల్‌’ అని బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ అన్నారు. ‘జీవితంలో ఎంతో ఎదగాల్సిన 16ఏళ్ల అమ్మాయిని తన మానాన తనను వదిలేయండి. వివాదాల్లోకి లాగకండి. ఆమెకు మనందరం అండగా ఉందాం’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. అనుపమ్‌ఖేర్, శ్రద్ధకపూర్, జావేద్‌ అక్తర్, ప్రీతిజింటా, సోనూ నిగమ్‌ తదతరులు జైరాకు మద్దతుప్రకటించారు. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ఆమెకు బాసటగా నిలిచారు. జైరా విషయంలో ఉదారవాదులు ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement