ఆకాశమంత అవకాశవాదం
2004 ఎన్నికల ప్రచారంలో దేశం వెలిగిపోతోందని బీజేపీ చేసిన ప్రచారంలో డొల్లతనం ఎంత ఉందో ఇప్పుడు మోడీ, చంద్రబాబు తమ హయాం లలో జరిగినట్లు చెబుతున్న అభివృద్ధి మాటల్లోనూ అంతే డొల్లతనం కనిపిస్తుంది.
ఈనాటి రాజకీ య రంగంలో నీతి నియమాలూ, రాజ నీతిజ్ఞత, సూత్రబ ద్ధత, వ్యక్తిత్వం లాంటి విషయాల కోసం చూడటం వృధా ప్రయాసే. సామాన్య ప్రజల అభిప్రాయం కూడా ఇదే. ఇవన్నీ తెలుగుదేశం అధినేత చంద్ర బాబులోనే కనిపిస్తాయి. సూత్రబద్ధ రాజకీ యాలకు, ప్రజాహిత నిర్ణయాలకు ఆయన వ్యతిరేకం. బాబు కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. అప్పుడే రాజకీయ పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావును, పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా ఎద్దేవా చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భ వించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నెమ్మ దిగా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ అయ్యారు.
పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిని మాత్రమే నని మొదట చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి తెలుగుదేశం చక్రం తిప్పుతు న్నారు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దింపే శారు. వ్యవసాయాన్ని విస్మరించి, రాష్ట్రానికి సీఈఓగా ప్రకటించుకున్నారు. ఐటీ జపం అందుకుని, సగం మంది గ్రామీణ ప్రజలు పట్టణాలకు, నగరాలకు చేరుకోవాలని పిలు పిచ్చారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందనీ, వాళ్ల మెదళ్లు కలుషితమయ్యాయనీ వ్యాఖ్యా నించారు. ఇటీవల రాష్ట్ర విభజనకు సంబం ధించి పదే పదే మాటలు మార్చడం, రాబో యే ఎన్నికల్లో పొత్తు కోసం మళ్లీ బీజేపీని కౌగిలించుకోవడానికి సిద్ధమవుతుండటం- ఎక్కడా సూత్రబద్ధత కనిపించదు.
ఎన్టీఆర్ చేసిందేముంది, 2 రూపాయ లకు కిలోబియ్యం, మద్యనిషేధం తప్ప అంటూ చులకన చేసి బాబు మాట్లా డారు. ప్రభుత్వానికి చెందిన ఎన్నో విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి సొంత ప్రయోజనం పొందారు. ఆనాడు తాను అను సరించిన రైతు వ్యతిరేక విధానాల మూలంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నా పట్టించుకోని వ్యక్తి, ఇప్పుడు అన్నదా తకు పట్టెడన్నం పెట్టలేరా అని మాట్లాడుతు న్నాడు. ఆనాడు సబ్సిడీల్లో కోత, పన్నులు, కరెంట్ ఛార్జీల వాతపెట్టిన వ్యక్తి ఇప్పుడు అల విమాలిన పథకాలన్నీ ప్రకటించడమేమిటి? ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని బాబు విస్మరించడమే కాదు సర్వనాశనం చేశారని అనేక విశ్లేషణలు ఘోషిస్తున్నాయి. ఐటీ అభివృద్ధి అంటూ ఇతర రంగాలను విస్మ రించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ సామాజిక రంగాలన్నీ కలుషితమైపోతున్నా రాష్ట్ర ఆదాయం కోసం వెంపర్లాడే బాబు మద్యనిషేధం ఎత్తివేయలేదా?
నేషనల్ ఫ్రంట్‌కు రాత్రికి రాత్రే గుడ్‌బై చెప్పి ఆనాడు బీజేపీతో జతకట్టిన వ్యక్తి, రేపు అవసరమైతే గతంలో వ్యాఖ్యానించినట్లుగానే జీవితంలో మళ్లీ బీజేపీతో కలవబోనని ప్రక టించి జనాన్ని వెర్రివాళ్లను చేయడన్న గ్యారెం టీ ఏది? సూత్రబద్ధమైన విధానాలు అనుస రించే విద్యార్థి సంఘాలు, కులాల ప్రభావం గల విద్యార్థి సంఘాలుగా మారిపోయినది బాబు పాలనలోనే. ఇదే దశలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మంత్రాలను పాల కులు అందిపుచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు జరిగిన ఆందోళనలో బీజేపీ పాల్గొంది. ఆ తర్వాత 1989లో బోఫోర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్య మంలో భాగస్వామి అయినప్పటికీ, తన నాయకత్వంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్‌లో బీజేపీని ఎన్టీఆర్ చేర్చుకోలేదు. ఆయన ఒక సూత్రబద్ధ వైఖరినే అనుసరించారు.
పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి డబ్బు వసూ లు చేసుకున్నట్టుగానీ, కుంభకోణాలకు పాల్ప డినట్లు గానీ ఎన్టీఆర్‌పై ఆరోపణలు రాలేదు. చంద్రబాబు విషయం అలాకాదు. అధికారం కోసం మతతత్వ రాజకీయాలు అనుసరించే బీజేపీతో చేతులు కలపడానికి, తెలంగాణలో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని తానే విమర్శించిన టీఆర్‌ఎస్ నేత చంద్రశేఖర రావుతోనూ ఎన్నికల ప్రయోజనం కోసం చేతులు కలపడానికి కూడా చంద్రబాబు వెను కాడలేదు.
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని 2001లో విశాఖపట్నం మహా నాడులో తీర్మానం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, వెనుకబాటుతనం ముసుగులో కేసీఆర్ దుష్ట రాజకీయం చేస్తున్నారని 2005 లో అసెంబ్లీలోనే చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. 2008 నాటికి ఈ వైఖరి మారిపో యింది. తెలంగాణకు జై అన్నారు. తెలంగాణ విషయంలో 2008లో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను ఇటీవల వచ్చిన లేఖలో ఉటంకించారే గానీ స్పష్టంగా ప్రత్యేక రాష్ట్రానికి అనుకూ లమన్న మాట పేర్కొనలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగాక కోస్తాంధ్రలో రాజ ధాని ఏర్పాటుకు రూ.5 లక్షల కోట్లు కావాలని ప్రకటించిన ఆయన, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో మాత్రం మౌనం వహించారు. ఆ తర్వాత బస్సు యాత్రలో సమన్యాయం అన్నారు.
ఢిల్లీ, భోపాల్‌లో నరేంద్రమోడీతో కలిసి సభలలో పాల్గొనడం, గంటల తరబడి ఏకాం తంగా మంతనాలు జరపటం, మోడీ హైదరా బాద్ వచ్చినప్పుడు బాలకృష్ణ కలవడం లాం టి పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలకు తావిస్తున్నాయి. 2002 నాటి గుజరాత్ ఊచ కోత మోడీ పాలనలోనే జరిగింది. అదో మాయని మచ్చగా వాజపేయి పేర్కొన్న తర్వాత గానీ చంద్రబాబు నోరు మెదపలేదు. పది మంది కోసం 90 మందిని బలిపెట్టడం, సమాజాన్ని మరింత దిగజార్చే మత రాజ కీ యాలు మన రాజ్యాంగం నిర్దేశించిన సూత్రా లకు విరుద్ధమైనవని బాబుకు తెలియదా?
సమ్మిళిత అభివృద్ధి జపం చేస్తున్న కాం గ్రెస్ పాలనలోనూ, తమదే అభివృద్ధి అని ఊదరగొడుతున్న మోడీ పాలనలో ‘సంపన్న వర్గాల’కే మేలు జరిగింది. 2004 ఎన్నికల ప్రచారంలో దేశం వెలిగిపోతోందని బీజేపీ చేసిన ప్రచారంలో డొల్లతనం ఎంత ఉందో ఇప్పుడు మోడీ, చంద్రబాబు తమ హయాం లలో జరిగినట్లు చెబుతున్న అభివృద్ధి మాట ల్లోనూ అంతే డొల్లతనం కనిపిస్తుంది. ఒక నాడు వెన్నుపోటుతో దారుణంగా అవమానిం చిన ఎన్టీఆర్‌ను ఇప్పుడు చంద్రబాబు స్తుతిం చడం అధికారం కోసం కాదా? ఇప్పటికైనా సమాజ హితం కోసం ఆలోచిస్తే భావితరాలు గుర్తుంచుకుంటాయి.