నివాళి
వ్యాపారానికి మానవీయ విలువలు జోడించడమే ఆయన విశిష్టత. ప్రగతి సంస్థ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగడానికి ఇదే కారణం. జీవితాన్ని ఎలా జీవించాలో, దాంతో ఎలా పోరాడాలో తెలుసుకోవాలంటే ఆయన ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
ఈ రోజు ప్రగతి ప్రింటర్స్ అంటే తెలియని వారు ఉండ రేమో! ఆనాడు కేవలం 12 వేల రూపాయల పెట్టుబడితో పరుచూరి హనుమంతరావు పునాదులు వేసిన ‘ప్రగతి’ ఇవాళ రూ.200 కోట్ల టర్నో వర్‌తో ప్రగతిపథంలో దూసు కెళుతోంది. కేవలం పుస్తకం అచ్చువేయడంలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించ డమే కాకుండా... ఆయన జీవితంలో కూడా వాటిని ఆచరించారు. అవే ఆయనను ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాల్ని మరచి పోని మనిషి ఆయన. అప్పుడు ఎలా ఉన్నారో.. చనిపో యేంత వరకూ అలానే ఉన్నారు. ఓ పుస్తక ప్రచురణ సంస్థ అధినేతగా ప్రముఖుడైన ‘ప్రగతి’ హనుమంత రావు అంతకుమించిన మనిషి. ఆయనతో గడిపిన ప్రతీ సన్నివేశం నా మదిలో కదలాడుతూనే ఉంది.
కృష్ణాజిల్లా చల్లపల్లి హైస్కూల్లో ఇద్దరం కలసి చదు వుకున్నాం. ఆయన మాటలు విని ఉత్తేజితుణ్ణి అయ్యా. ఆయన పాటలు విని పులకించా. ఆయన జీవితంలో ఎన్నో ముఖ్యఘట్టాలలో నేను పాత్ర వహించా. ఆయన స్కూలు రోజుల్లోనే ఉద్యమాల బాట పట్టారు. చల్లపల్లి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఆయన నినాదాలకు మేం జై కొట్టేవాళ్లం. అలా ఆయన నాయకత్వం వహించిన ఉద్యమాల్లో నేనూ పాల్గొన్నా. నినాదాలిచ్చా.. ఇప్పటికీ అవి నా చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి.
మలుపు తిప్పిన జైలు జీవితం
1948లో బందర్‌లో ఆయన ఇంటర్ చదువుతున్నప్పు డు తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగా ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆ జైలు జీవితంలోనే ఆయనకు కమ్యూ నిస్టు భావాలు మొగ్గతొడిగాయి. ఎ.కె.గోపాలన్, తరి మెల నాగిరెడ్డి లాంటి గొప్ప వ్యక్తులతో ఆయనకు సన్ని హిత సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఆయన టీనేజ్ దశే ఆయన జీవితానికి గొప్ప నాంది పలికింది అప్పుడే. నాయకుడిగా, నటుడిగా, ప్రజానాట్యమం డలి సభ్యుడిగా ఆయన గురించి చెప్పాలం టే ఒక పుస్తకమే. మద్రాసు, బొంబాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో ఏకకాలంలో సభ్యత్వం ఉన్న వ్యక్తి ఈయనే. కమ్యూనిస్టు అగ్రనాయకు లందరినీ రాజస్థాన్ జైలుకు తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా హనుమంతరావు గారు ఏకంగా నెలరోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
పాత్రికేయ వృత్తిలోకి..
మా పాత్రికేయ ప్రయాణం ఒకేసారి ప్రారంభమైంది. ఆయన ‘విశాలాంధ్ర’ దినపత్రికలో సినిమా విలేకరిగా చేరారు. నేను ‘జ్వాల’ పత్రికలో పనిచేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచే మా ఇద్దరి మధ్య మా బంధం ఇంకా బలపడింది. సోవియట్ యూనియన్ నేత కృశ్చేవ్ వంటి ప్రముఖులను కూడా ఆయన ఇంటర్వ్యూ చేశారు. పాత్రికేయుడిగా ఉన్నప్పుడే తన ప్రయాణాన్ని సినీ రం గం వైపు మళ్లించారు. సారథీ స్టూడియోస్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరారు. ‘ఎత్తుకు పైఎత్తు’, ‘కలిసి ఉంటే కలదు సుఖం’ వంటి చిత్రాలకు పనిచేశారు. మద్రాసు నుంచి హైదరాబాద్ తరలివచ్చిన తొలితరం సినీ ఉద్యో గి కూడా ఈయనే. కానీ నెగటివ్ కొరతవల్ల చిత్ర నిర్మా ణం కుంటుపడటంతో ఆయన ఆ రంగం నుంచి నిష్ర్క మించారు.
దేవుడిచ్చిన చెల్లెలు
ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, సావిత్రి వంటి ప్రముఖు లతో ఆయనకు ఆత్మీయ అనుబంధం ఉండేది. ఓసారి షూటింగ్ సమయంలో సావిత్రి ఓ బాధాకరమైన సన్నివేశంలో నటిస్తున్నారు. ఆ షాట్ అయిపోగానే సావి త్రి ‘‘అన్నయ్యా అంటూ హనుమంతరావుని పట్టుకుని ఏడ్చేశారు. ఆ మహానటి నాకు దేవుడిచ్చిన చెల్లెలని ఆయన ఓ సందర్భంలో నాతో అన్నారు.
కార్మికుల ఆకలి తీరాలి!
ఓ అర్ధరాత్రి నేను, హనుమంతరావుగారు హైదరాబాద్ లోని ఓ హోటల్‌కు వెళ్లాం. ఆయనప్పుడు సారథీ స్టూడి యోస్‌లో పనిచేస్తున్నారు. ‘‘ఏంటండీ ఇప్పటిదాకా తిన లేదు, మీరు కావాలనుకుంటే ముందే భోజనం చేయొ చ్చుకదా.. ఎందుకిలా?’’ అని అడిగాను. అప్పుడు ఆయన ‘‘నా కింద పనిచేసే వాళ్ల కడుపు నిండితేనే నేనూ తింటాను, ఎప్పుడైనా సరే వాళ్లు తిన్న తరువాతే తిం టాను’’ అని సమాధానమిచ్చారు. ఆయన మంచితనం అలాంటిది. విశిష్ట గుణం ఏమిటంటే వ్యాపారానికి మానవీయ విలువలు జోడించారు. కుమారులు నరేంద్ర, మహేంద్రలకు అవే భావాలను నూరి పోశారు. ‘ప్రగతి ’సంస్థ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగడానికి ఇదే కారణం. ప్రపంచంలో ప్రింటింగ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను దృష్టి లో పెట్టుకొని సంస్థను ఇంకా అభివృద్ధి లోకి తీసుకొచ్చారు. చండ్ర రాజేశ్వరరావు రచించిన ‘గమ్యం-గమనం’ పుస్తకాన్ని ఉచితంగా ప్రచురించారు.
నేను పాత్రికేయ వృత్తి నుంచి రిటైర యినప్పుడు నా జీవితానికి ఓ భరోసా కల్పించింది ఆయనే. ప్రగతి ప్రచురణ సంస్థను నా విశ్వవిద్యాల యంగా భావిస్తాను. ఎందుకంటే నేను జీవితంలో ఎద గడానికి, ఈ రంగంలో నేనంటూ ఒకడిని ఉన్నాను అని తెలిసింది ఆయన వల్లే. జీవితాన్ని ఎలా జీవించాలో, దాంతో ఎలా పోరాడాలో తెలుసుకోవాలంటే ఆయన ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
జీవిత చరిత్ర చూడకుండానే...
ఆయన జీవితంలో ప్రతి కీలక ఘట్టంలో నేనున్నా..! నా దగ్గర ఆయన తన హృదయాన్నంతా ఆవిష్కరించారు. ఆయన జీవితం గురించి ఆమూలాగ్రం తెలిసిన వాడిని కనుక అది రాయడానికి నాకే సాధికారికత ఉందనిపించి ఆయన జీవిత చరిత్ర రచనకు శ్రీకారం చుట్టా. కానీ హనుమంతరావుగారు మొదట నా పుస్తకం ‘సినిమాగా సినిమా’కు ప్రాధాన్యం ఇచ్చారు. నా పుస్తకం పూర్తయ్యా క ఆయన జీవిత చరిత్ర రాయడం మొదలుపెట్టా. అది పూర్తి చేసి ఆయనకు నా మొహం చూపించాలని నిర్ణ యించుకున్నా. పూర్తయింది. కానీ విధి వక్రించింది. అది చూడకుండానే వెళ్లిపోయారు. గత నెల 27న వాళ్ల అబ్బా యి నరేంద్రను కలిశా. అప్పుడు నరేంద్ర ఆయన గురిం చి ఒకే మాట అన్నారు. ‘‘నాన్న పులిలా బతికారు’’ అని! అది నిజమే! ఆయన పులి లాగా బతికారు. పులి లాగే వెళ్లిపోయారు.
(నాదెళ్ల నందగోపాల్, వ్యాసకర్త సీనియర్ సినీ పాత్రికేయులు)
ఫోన్: 9948689354, 040-23410736