రాయదుర్గంలో మొలిచిన జానెడు మొలక
కడపలో పెరిగిన మహా మద్ది చెట్టు
ఇంగ్లిష్ బ్రౌనుకు తెలుగు ఆత్మ
మొండిగోడల ఇసుక నుంచి
మహాసౌధ తైలం పిండిన బలశాలి
అంటుసొంటుల సమాజంలో పుట్టి
మడులు దడులు పొడగిట్టని మనస్వి
మనిషే కాదు మనసూ తెలుపే
మనిషి కనిపిస్తే చాలు
మల్లెపువ్వై వికసిస్తాడు
వారసులు లేని పుస్తకాలకు
అనాథాశ్రమ నిర్మాత
కొత్తపాతల మేలుకలయిక
రోజుకొక పుటైనా రాయందే
నిద్రపట్టని అక్షర మాంత్రికుడు
జ్ఞాపకాల పుట్ట చారిత్రక కవిలెకట్ట
(నేడు కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు హనుమచ్చాస్త్రి తొలి వర్ధంతి)
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
(కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)