నచ్చిన పది పుస్తకాలు | | Sakshi
Sakshi News home page

నచ్చిన పది పుస్తకాలు

Published Sat, May 30 2015 11:08 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

నచ్చిన పది పుస్తకాలు

నచ్చిన పది పుస్తకాలు

దీన్ని ‘నాకు నచ్చిన పది పుస్తకాల జాబితా’ అనే కన్నా ‘నాకు నచ్చిన పదిమంది రచయితల పుస్తకాల జాబితా’ అనాలి. తెలుగు నుంచి ఐదుగురూ, ఇంగ్లీషు నుంచి ఐదుగురూ ఉండేలా ఈ ఎంపిక చేశాను.
 
త్రిపుర ‘కథలు’: పాఠకుణ్ని ఇంత చేరువగా తీసుకుని కథలు చెప్పిన రచయిత తెలుగులో మరెవరూ నాకు తగల్లేదు. ఎంత చేరువగా అంటే, పాఠకునితో తనకు ఒక ఇంటిమేట్ షేర్డ్ పాస్ట్ ఉన్నట్టు భుజం మీద చెయ్యేసి, కాబట్టి అన్నీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు గుసగుసగా గొణుగుతూ చెప్పే కథలవి. సోకాల్డ్ మహారచయితలెందరో రచనా సర్వస్వాలే రాసి సంపాదించుకోలేని గొంతు త్రిపుర ఈ కొన్ని కథల్లో సాధించుకున్నారు. కథల్లో నాకు బాగా నచ్చినవి ఈ క్రమంలో: ‘చీకటి గదులు’, ‘జర్కన్’, ‘ప్రయాణికులు’, ‘గొలుసులు -చాపం- విడుదల భావం’. పెద్దగా నచ్చని, త్రిపురతనం లేవని అనిపించే కథలు: ‘వలసపక్షుల గానం’ (సగం కథ కాఫ్కా అనువాదం), ‘హోటల్లో’, ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో త్రిపుర చెప్పిందాన్ని బట్టి కాఫ్కాని నేనెందుకు ఇష్టపడతానో అందుకే ఇష్టపడిన మనిషి ఆయనే అనిపిస్తుంది. ఆయన ఆమోదముద్ర చూసింతర్వాతనే ఇ్ఛజ్ఛీ, ఓ్ఛటౌఠ్చఛి లాంటి రచయితల్ని పరిచయం చేసుకున్నాను. వీలుండీ ఆయన్ని కలవలేకపోవటం ఒక పెద్ద లిటరరీ రిగ్రెట్.
 
చలం ‘అమీనా’: చలం కథకునిగా కన్నా కూడా వ్యక్తిగా ఎక్కువ ఇష్టం. అయితే, చలంలోని కథకుడు నాకు బాగా నచ్చిన చోటు మాత్రం ‘అమీనా’నే. పైన ‘పాఠకుణ్ని చేరువగా తీసుకుని కథ చెప్పడం’ అన్నానుగా- అది చలం ఈ రచనలో చేసినట్టు ఎక్కడా చేయలేదు. ఇక్కడ చలం మొపాసా కాదు, డీహెచ్ లారెన్సు కాదు, ఠాగూరూ కాదు; ఇక్కడ చలం చలమే! ఈ పుస్తకం గురించి బ్లాగులో రాశాను.http://loveforletters.blogspot.in/2011/05/blog-post_06.html.
 
 శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’:

 I like it for its poetry, music & language. నాకాయన అభిప్రాయాలూ అవీ పెద్దగా ఏం పట్టలేదు. ఇందులో కనపడిన జీవితం నచ్చింది. ఆ జీవితాన్ని చెప్పటంలో ఆయన భాష నచ్చింది. కామా తర్వాత కామాకి ఒక్కో పైసంగతి వేస్తూ ఆయన వాక్యాన్ని సంగీతమయంగా సాగించే పద్ధతి బాగుంటుంది.
 
 తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’: ఈ పుస్తకం పట్ల నాకున్నది సెంటిమెంటల్ వాల్యూ అని చెప్పాలేమో. అమ్మకి ఏదో ఊరు బదిలీ అయినప్పుడు ఈ పుస్తకాన్ని లైబ్రరీ డిపాజిట్ వదిలేసి దగ్గర ఉంచేసుకుంది. నాకు ఊహ తెలిసినప్పణ్నించీ ఇంట్లోనే ఉంది. చాలాసార్లు చదివాను. ‘సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్’ అని అరుస్తూ, కత్తి ఒర (మొలతాడు) లోంచి తాతయ్య పడక్కుర్చీ కర్ర బయటకు లాగి, పోలోమంటూ వెళ్లి ఏ బియ్యంబస్తా మీదో, కొబ్బరిమాను మీదో పడి కత్తిపోట్లు పొడవటం లాంటి ఎన్నో హీరోయిక్ డీడ్స్‌కి కావాల్సిన ఇమేజినేషన్ని మెదడులో నింపిందీ పుస్తకం.
 
 నామిని ‘నా కుశల నా మనేద’: The whole of Namini is the perfect sum of his writings. అంతగా సాహిత్యానికి తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ఈ ‘నా కుశల నా మనేద’ అనేది వైకుంఠం గీసిన ముఖచిత్రంతో ఇటీవల వెలువడిన ఎడిషన్‌లో కొత్తగా చేర్చిన రచన. ఐ్ట’ట ్చ ౌజ ఝఠటజీజ ౌఠ్ఛిట ఛ్ఛ్చ్టీజి. మిగతా నామిని రచనలన్నీ చిన్న నిడివిగల ప్రదర్శనలు (నవలల్ని మినహాయించి). కానీ దాదాపు యాభై పేజీల ఈ రచన మాత్రం ఒక శాక్సాఫోన్ ఆర్టిస్టు ఒకే ఎమోషనల్ కంటెంటును ఎక్కడా తడబాటు లేకుండా, ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా పలికించిన పాటలాగా భలే సాగుతుంది.
 
 ఓ్చజజ్చు ఈజ్చీటజ్ఛీట: నేనీ పుస్తకాన్ని దొబ్బుకొచ్చాను, కానీ ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ప్రపంచపు ప్రాణమయ సారాంశానికి మన జీవితాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో చెప్పిన పుస్తకం; సాహిత్యాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో కూడా చెప్పిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వరుసగా చదవక్కర్లేదు. పూర్తిగా కూడా చదవక్కర్లేదు. మనలో కాఫ్కా అంశ ఏదైనా ఉంటే అదే ఖాళీల్ని పూరించుకుంటుంది, మిగతాది తనకు తానే రాసుకుంటుంది.
 
 Flaubert 'Sentimental Education': ‘‘నా తరం మనుషుల మోరల్ హిస్టరీ రాయాలనుకున్నాను’ అని చెప్పుకున్నాడు ఫ్లాబె ఈ రచన గురించి. నా వరకూ ఇది నా ఆత్మ తాలూకు రొమాంటిక్ హిస్టరీ అనిపిస్తుంది. ‘దీవిలో ఒంటరిగా చిక్కుబడిపోతే దగ్గరుండాలనుకునే పుస్తకాల జాబితా’ అంటారు కదా, అలా రెండే పుస్తకాలు పట్టుకెళ్లే వీలుంటే ‘కాఫ్కా డైరీ’లతో పాటూ ఈ పుస్తకాన్నీ తీసుకువెళ్తాను. ఎందుకంటే, ఫ్లాబె ఈ పుస్తకాన్ని ఎలాగో జీవితమంత సంక్లిష్టంగానూ నిర్మించగలిగాడు. పుస్తకంలో ఎన్నో మూలల్ని అలా చదివి వదిలేయక పట్టి ఊహించుకుంటే ఇంకెన్నో కథలు ఆవిష్కృతమవుతాయి.
 
 Borges 'Selected Nonfiction': జీవితమనేది కాఫ్కాకి రాయటం కోసం ఒక సాకు ఐతే, బోర్హెస్‌కు చదవటం కో ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్‌గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. ఆయన కాల్పనిక రచనలు కూడా పఠనాజీవితం మధ్యలో పఠనం ఆధారంగానే ఆడుకున్న ఆటల్లాంటివి.
 
 Dostoevsky 'Brothers Karamazov': For the sheer feverish absorption it induces in the reader. దేవుడు చచ్చిపోయాడని టెంకిజెల్ల కొట్టినట్టు చెప్పి జీవితపు ఎసెన్సిషయల్ ఏకాకితనానికీ, ఏడ్చే మూలలేనితనానికీ సంసిద్ధపరచిన పుస్తకమిది. ఇవాన్ కరమజవ్‌ని మనలో గుర్తించటం, లేదా అతన్ని మనమీదకు ఆవహింపజేసుకోవటమూ ఒక శాపం.
 
 Salinger 'Franny And Zooey': అమాయకత్వం చేయి వదిలి, కాపట్యపు రద్దీ మధ్య దారి తప్పి దిక్కుతోచక, తిరిగి జ్ఞానరాహిత్యపు సాంత్వన కోసం అంగలార్చే శరణార్థి రచనలు శాలింజర్‌వి. అలాగే ఆయన వచనాన్ని చదవటం అంటే చెక్కిన వజ్రాన్ని వేళ్ల మధ్య ఎత్తిపట్టుకుని లోపలి ప్రతిఫలిత వర్ణకేళిని చూడటం లాంటిది. ఆయనలోని ఈ రెండు అంశాల పక్వదశ ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
 
 
ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్‌గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్.
 
 
 మెహెర్ రచయిత
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement