పెరుమాళ్ మురుగన్ అనే తమిళ రచయిత తనపై అమలవుతున్న కనబడని ఆంక్షలకు నిరసనగా తన రచనలను తానే వాపస్ తీసుకోవల సివచ్చింది.
పెరుమాళ్ మురుగన్ అనే తమిళ రచయిత తనపై అమలవుతున్న కనబడని ఆంక్షలకు నిరసనగా తన రచనలను తానే వాపస్ తీసుకోవల సివచ్చింది. ఇలాంటి పరిస్థితిని ఏకకంఠంతో ఖండించాలి. ప్రజలవైపు నిలిచిన సాహిత్యం, కళలను తొక్కేయడానికి ప్రతికాలంలో ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు రాజ్యమే కాదు.
దాని తాబేదారులు సైతం మునుపెన్నడూ లేనివిధంగా అక్షరాలపై ఆంక్షలు విధిస్తున్నారు. మతం, కులం, ధనం, ప్రాంతం పెత్తనాల మధ్య అక్షరం గజగజలాడింది. ఈ నేపథ్యంలో అంతటా అనైక్యత, అక్షరాల మధ్య విడబాటు సరికాదని ఐక్య కార్యాచరణ నేటి అవసరంగా గుర్తించాలని విన్నవిస్తున్నాం. అం దుకే ‘ఎరుక’ సాహిత్య సామాజిక సాంస్కృతిక వేదిక తన వంతు బాధ్య తగా తన తొలి కార్యక్రమంగా ‘అక్షరాలను అడ్డగించొద్దు’ అనే సభను ఏర్పాటు చేస్తోంది. అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తోంది.
(నేడు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సాయంత్రం 5 గంటలకు ఎరుక సభ)
దాసోజు కృష్ణమాచారి కన్వీనర్, ‘ఎరుక’ మొబైల్: 9542869968