ఉత్తరాంధ్ర తెలుగుతేజం యు.ఎ. నర్సింహమూర్తి | ua narsimha murthy | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర తెలుగుతేజం యు.ఎ. నర్సింహమూర్తి

Published Tue, Apr 28 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

నివాళి

నివాళి

ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి యు.ఎ. నర్సింహమూర్తిగా ఉత్త రాంధ్ర గర్వించదగ్గ సాహి త్య కృషి చేసిన నిరంతర సాహిత్య చైతన్యశీలి. తెలు గు భాషా విషయమై ప్ర ముఖ పత్రికలలో పలు వ్యాసాలు రాసిన ఈ భా షా ప్రేమికులు 27.04.2015 సాయంత్రం అయిదు గంటలకు, విజయనగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలుగు విమర్శ రం గంలో సైతం ఎనలేని కృషిచేసిన యు.ఎ నరసింహ మూర్తి 1944 డిసెంబర్ 10న విజయనగరం జిల్లా లింగాలవలసలో జన్మించారు. విద్యాభ్యాసం, పట్ట భద్రత, అనంతర ఉద్యోగ జీవితం (మహారాజా కళాశాలలో తెలుగు విభాగాధ్యక్షులుగా పదవీ విర మణ) యావత్తు విజయనగరంలోనే గడిచాయి. పిం గళి సూరన ఔచిత్య ప్రస్థానంపై ఆచార్య యస్వీ జోగారావు గారి పర్యవేక్షణలో పీహెచ్‌డీ పట్టాను పొందారు. కథాశిల్పి చాసో, శ్రీరంగం నారాయణ బాబు కవితా వైశిష్ట్యం, యశోధర వారి దీర్ఘ కవితల వలన యుజీసీ ప్రాజెక్టుల కమిటీ దృష్టికి నరసింహమూర్తి గారి ప్రతిభ గోచరమైంది. మన ఆధునిక తెలుగు సాహిత్యం గర్వపడేలా ‘కన్యాశు ల్కం-పందొమ్మిదో శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు’ పేరిట దేశ మంతటా నాటక విషయంపై పర్య టించి, భారతీయ భాషా నాటకా లలో 19వ శతాబ్దపు కన్యాశుల్కం నాటకపు విశిష్టతను తులనాత్మక పరిశీలన చేశారు.
 
 ఇరుగు పొరుగు సాహిత్యం నుంచి జయంత మహపత్ర రచనలు, కవిత్వం అనువాదం చేసి, భాషల సాన్నిహిత్యం పెంపొందించారు. ‘తెలుగు వచన శైలి’ పేరిట ఒక విశ్లేషణను బృహత్తర రచనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణగా వెలువరించి, నరసింహమూర్తి గారిని గౌరవించింది.
 
 నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల పుర స్కార ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురణ చేశారు. ‘విశ్వనాథ సౌందర్య దర్శనం’, గిడుగు రామ్మూర్తి రచనలను సరళ భాషలో తిరిగి రాశారు. నరసింహ మూర్తి గారు రచించిన ‘నన్నెచో డుడి కుమార సంభవం’ ఉత్తమ విమర్శకునిగా గుర్తింపు తెచ్చింది. గురజాడ 150వ జయంతి రాష్ట్ర వ్యాప్త ఉత్సవాల్లో భాగంగా గుర జాడ పురస్కారం పేరిట లక్ష రూపా యల నగదు పురస్కారం పొందా రు. అజో-విభో సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించి, మాస్టారి సేవలను సమున్నతంగా గౌర వించింది. విజయభావన ‘అధ్యయన భారతి’ బిరుదాన్ని సమర్పించి సత్కరించింది.
 
 గత కొంతకాలంగా యు.ఎ.నర్సింహమూర్తి ‘పరిణత భారతి’ పేరిట 1958 ముందరి విజయ నగరం పండితుల, సాహిత్యవేత్తల వ్యాసాలను సంకలనం తీసుకువచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. టాగూర్ ఫెలోషిప్‌ను పొందిన మొదటి తెలుగు సాహిత్యవేత్త యు.ఎ.ఎన్. అయితే ఇందుకు సంబం ధించిన కృషి పూర్తిగా జరుగకుండానే వారు కన్ను మూయడం, తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆయన డెబ్బయ్యో జన్మదినోత్సవాలు ఘనంగా జర గాల్సి ఉండగా, అనారోగ్యం వల్ల వాయిదా పడ్డా యి గత సంవత్సరం విశాఖలో సప్ధర్ హష్మీ కవితల సంపుటి (రామతీర్థ, జగద్ధాత్రిల అనువాదం) బుక్ ఫెస్ట్‌లో ఆవిష్కరించి, తెలుగు సాహిత్యం గురించి ఏప్రిల్ 17న ఇచ్చిన ప్రసంగం, హైదరాబాద్‌లో ఏప్రిల్ 23న శ్రీపాద వారి సమగ్ర రచనల ఆవిష్క రణ సభలో పాల్గొనడం వారు కడసారిగా సభలలో కనిపించిన సందర్భాలు. తన జీవితకాలం యావ త్తూ అభ్యుదయ సాహిత్య స్ఫూర్తితో, నిష్కర్ష అయిన అక్షర సంపన్నతతో, ప్రగతిశీల శక్తులకు చేదోడుగా నిలిచిన ఉత్తమ శ్రేణి సాహిత్య వేత్తను, ఇవాళ తెలుగు సాహిత్యం కోల్పోయింది. వారు వదిలి వెళ్లిన సాహిత్య రాశి, ఆ జిజ్ఞాస గొప్పవి. అవి ముందు తరాల వారికి ఆదర్శం కావాలి.
 రామతీర్థ, వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత
 మొబైల్: 98492 00385
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement