రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహనరెడ్డి చేస్తున్న'సమైక్య దీక్ష'కు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. మూడో రోజు సోమవారం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు.
వైఎస్ జగన్మోహన రెడ్డికి సోమవారం వైద్యపరీక్షలు చేస్తున్న ఉస్మానియా ఆస్పత్రి వైద్య బృందం
హైదరాబాద్లో తన క్యాంపు కార్యాలయం ఎదుట జగన్ చేపట్టిన ఆమరణదీక్ష మూడవ రోజుకు చేరింది. రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు శిబిరం వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.