మరో ఘనతకు చేరువలో విరాట్..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేలో కోహ్లీ ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేలో అత్యధిక పరుగులు చేయటం. కోహ్లీ ఈ క్యాలెండర్ ఇయర్‌లో 769 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లిసెస్ 814 పరుగులతో మొదటి స్థానంలో, ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 785 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ డు ప్లిసెస్‌కు 45 పరుగుల దూరంలోను, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రూట్‌కు 16 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదటి వన్డేలో కోహ్లీ 82 పరుగులు చేయటం వల్ల మూడో స్థానంలో ఉన్న మోర్గాన్‌ను అధిగమించాడు. ఇదే జోరును రెండో వన్డేలో కొనసాగిస్తే కోహ్లీ వారిద్దరి రికార్డులను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు. శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి వన్డేలో విజయం సాధించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్, కోహ్లీల భాగస్వామ్యం మొదటి వన్డేలో 197 పరుగులు సాధించింది.