వార్నర్ పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట! | Umar Akmal congratulates Warner for PSL title | Sakshi
Sakshi News home page

వార్నర్ పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట!

Published Mon, May 30 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

వార్నర్  పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట!

వార్నర్ పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట!

ముంబై: తమ క్రికెటర్లు పెద్దగా విద్యావంతులు కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)చైర్మన్ షహర్యార్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిజమని నిరూపించాడు ఆ దేశ క్రికెటర్ ఉమర్ అక్మల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను అభినందించే క్రమంలో అక్మల్ తప్పులో కాలేశాడు.

 

పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)టైటిల్ గెలిచిన కెప్టెన్ వార్నర్కు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ పీఎస్ఎల్లో ఆడని వార్నర్ టైటిల్ గెలవడం ఏమిటని ట్విట్టర్లో విమర్శలు పోటెత్తడంతో ఉమర్ అక్మల్ ముక్కన వేలేసుకున్నాడు. అతను చేసిన తప్పును గ్రహించి వెంటనే మరో ట్వీట్ ను పోస్ట్ చేశాడు. ఇది పొరపాటున జరిగిందంటూ ఉమర్ సర్దుకునే యత్నం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement