ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: లాక్‌డౌన్ కారణంగా కుమారుడి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు సాంకేతికత సహాయంతో ఫోన్‌లోనే కళ్యాణాన్ని వీక్షించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎవరూ ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు. ఈ సమయంతో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా కొడూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ జాయిస్, జయలక్ష్మీ దంపతుల కుమారుడు శివచంద్ర సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి బెంగళూరుకు చెందిన కావ్యశ్రీతో మే13న పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఘనంగా పెళ్లి జరిపించేందుకు ఫంక్షన్ హాల్ కూడా బుక్‌చేశారు.
లాక్‌డౌన్ కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో ముందుగా అనుకున్న ముహూర్తానికే వధువు ఇంటి వద్ద నిరాడంబరంగా పెళ్లి జరిపించారు. శివమొగ్గ జిల్లాలో ఉన్న శివచంద్ర తల్లిదండ్రులు పెళ్లికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. తాళి కట్టిన సమయంలో ఫోన్ స్క్రీన్ మీద అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి వెళ్లలేని బంధువుల కోసం లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారని లక్ష్మీనారాయణ తెలిపారు. (టిక్‌టాక్.. ఎంత పని చేసింది?)
Comments
Please login to add a commentAdd a comment