వేలూరు: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా వేలూరులో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టరాదని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ మాజీ కౌన్సిలర్ ముత్తు ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. వేలూరు జిల్లాలోని ఆర్కాడు, తిరుపత్తూరు వంటి ప్రాంతాల్లోను ఆ పార్టీ కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా బుధవారం ఉదయం నుంచి నినాదాలు చేయడంతో పాటు ఆమె దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు.
గురువారం ఉదయం కూడా వేలూరు సైదాపేటలోని మురుగన్ గుడి వెనుక వైపున దీప పేరవై కార్యకర్తలు సుమారు 20 మంది కలిసి శశికళ దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శశికళకు అర్హత లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగిదపట్టరైలో కూడా శశికళకు వ్యతరేకంగా నిరసనలు కార్యక్రమాలు జరిగాయి.