మారువేషంలో బయటపడ్డా | I escaped from Kuvathur in Disguise | Sakshi
Sakshi News home page

మారువేషంలో బయటపడ్డా

Published Tue, Feb 14 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

I escaped from Kuvathur in Disguise

ఎమ్మెల్యే శరవణన్‌
తమిళసినిమా: శశికళ ఎంత పకడ్బందీగా నిర్బంధించినా ఓ ఎమ్మెల్యే తప్పించుకుని వచ్చారు. పన్నీరుకు మద్దతు ప్రకటించారు. పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ఏడుగురు శాసనసభ్యులు ఉండగా ఆదివారం ఆ సంఖ్య 11కు చేరింది. సోమవారం మరో ఎంపీ రావడంతో సంఖ్య 12కు చేరింది. అదే సమయంలో కూవత్తురు క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒకరైన శరవణన్‌ మారువేషంలో తప్పించుకుని పన్నీరు గూటికి చేరారు. మధురై ఎంపీ గోపాలకృష్ణన్‌తో కలిసి ఎమ్మెల్యే శరవణన్‌ పన్నీర్‌ గూటికి చేరారు.

ఈ సందర్భంగా శాసన సభ్యుడు శరవణన్‌ మాట్లాడుతూ తాను కూవత్తూర్‌ నుంచి మారువేషంలో తప్పించుకుని వచ్చినట్టు తెలిపారు. అక్కడ మరెందరో పన్నీరుకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. నిర్బంధంలో ఉన్నవాళ్లు బయటకు వస్తే, పన్నీరు సంపూర్ణ మెజారిటీతో సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అని తెలిపారు. అందరూ పన్నీరుసెల్వం సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారన్నారు. అందరూ వచ్చేశాక, చివరకు శశికళ పన్నీరు గొడుగు నీడన చేరాల్సిందేనని ఎద్దేవా చేశారు.

మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి..
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement