పీఎస్‌ఎల్‌వీ సి-37 ప్రయోగ సమయం మార్పు
Published Tue, Feb 7 2017 11:16 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
శ్రీహరికోట: శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 15 న జరపనున్న పీఎస్‌ఎల్‌వీ సి-37 ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు చేశారు. ఒకేసారి 103 ఉపగ్రహాలను ఆరోజు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 15 వ తేదీ ఉదయం 9.32 గంటలకు ప్రయోగం జరుగుతుందని తొలుత ప్రకటించినా దానికి బదులు 9.28 గంటలకే ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.
సతీష్ ధావన్ సెంటర్ నుంచి నుంచి పీఎస్‌ఎల్వీ సి-37 రాకెట్ ద్వారా వివిధ దేశాలకు చెందిన 100 ఉపగ్రహాలతో పాటు 3 భారత ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుండటంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగంపై ఆసక్తి చూపుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రోకు ఘనమైన రికార్డు ఉంది.
Advertisement
Advertisement