ఫ(బె)స్ట్ ఆఫీసర్ | kata amrapali first warangal urban district collector | Sakshi
Sakshi News home page

ఫ(బె)స్ట్ ఆఫీసర్

Published Sat, Oct 15 2016 9:51 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

ఫ(బె)స్ట్ ఆఫీసర్

ఫ(బె)స్ట్ ఆఫీసర్

  • ప్రతిభకు మారుపేరు అమ్రపాలి
  • వారానికి ఓ పుస్తకం చదవాల్సిందే
  • చూడకుండానే స్మార్ట్‌ఫోన్ టైపింగ్
  • మారథాన్‌లో ఉత్తమ ప్రతిభ
  • వరంగల్ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు
  •  
    అమ్రపాలి కాట... వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరు. పేరులాగే కొత్త తరానికి ప్రతినిధి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, నిరంతర శ్రమతో సాధించడం... ఇవే అమ్రపాలికి తెలిసినవి. టెక్నాలజీని బాగా వినియోగించే అమ్రపాలి... అభివృద్ధి కార్యక్రమాల్లో దీన్ని వినియోగించేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు. చారిత్రక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం గొప్ప అవకాశమని చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ అంశాలు ఆమె మాటల్లోనే...  
     
     మద్రాస్ ఐఐటీలో బీటెక్, బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశా. మొదట ముంబైలో ఆర్‌బీఎస్ బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేశాను.  నాకు నచ్చిన పని చేయడంలోనే నాకు ఆనందంగా ఉంది. సివిల్స్‌లో 39వ ర్యాంకు సాధించా. సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్ మెయిన్స్ ఆప్షనల్స్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకొని సివిల్స్ రాశా. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను.
     
     నాది 2010 ఐఏఎస్ బ్యాచ్. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా ఫస్ట్ పోస్టింగ్. తర్వాత మహిళా, శిశుసంక్షేమ శాఖ డెరైక్టరుగా పనిచేశా. మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా జారుుంట్ కలెక్టరుగా ఉన్నా. జిల్లాల పునర్విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వరంగల్ కలెక్టర్‌గా పోస్టింగ్ రావడం గర్వంగా ఫీలవుతున్నా. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పాత్ర విభిన్నమైనది.
     
     ఈ జిల్లాకు పోస్టింగ్ రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నగర, గ్రామీణ ప్రాంతాల కలబోతగా అర్బన్ జిల్లా ఉంది. కలెక్టరుగా... అన్ని శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తా.
     
     తల్లిదండ్రులే స్ఫూర్తి...
     జీవితంలో స్ఫూర్తినిచ్చినవారు అమ్మ..న్నాన్నలే. నాకు సంబంధించిన అన్ని అంశాల్లో వారు అండగా నిలిచారు. నన్ను జీవితంలో నిలబడేలా చేశారు. విశాఖపట్నంలోని సత్యసారుు పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ సాగింది. తండ్రి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్, సోషల్ స్టడీస్(సెస్)లో ఎకనామిక్ ప్రొఫెసర్. అమ్మ పద్మావతి ఉన్నత విద్యావంతురాలు, గృహిణి. సోదరి గంగోత్రి చెన్నైలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త తమిళనాడు సర్వీసు ఐఏఎస్ అధికారి.
     
     చదువకుండా ఉండను...
     చదవడం నాకు ఇష్టం. చదవకుండా ఉండలేను. ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. మహాభారత్, ఎస్ మినిస్టర్, ఎస్ ప్రైమ్ మినిస్టర్(కామిక్ బుక్), అగస్టా వంటి ఇంగ్లీషు పుస్తకాలు, నవలలు చదివాను. వారానికి ఒక పుస్తకం చదవాలని 2016 సంవత్సరం ఆరంభంలో గట్టిగా నిర్ణయించుకున్నా. ఇలా ఏడాదిలో 52 పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికి 29 పుస్తకాలు మాత్రమే చదివా. సినిమాలు చూస్తా. హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగిస్తా. స్కీన్ర్ చూడకుండానే వ్యాట్సాప్‌లో టైప్ చేస్తా. నడక అంటే ఇష్టం. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, సివిల్స్ శిక్షణలో హాఫ్ మారథాన్‌లో 21 కిలోమీటర్ల పరుగులో గోల్డ్‌మెడల్ సాధించా.
     
     బెస్ట్ ఫిమేల్ అథ్లెట్‌గా నిలిచాను. పాఠశాల, కళాశాల స్థారుులో ఎన్నో బహుమతులు పొందాను. హైదరాబాద్‌లో ఆగస్టులో 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తిచేశా. నవంబరులో మరో హాఫ్ మారథాన్ కోసం ప్రయత్నిస్తున్నా. వరంగల్‌లో ఉర్దు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నా.
     
     వీలైనంత సాయం...
     ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ పాత్ర ఎంతో ఉంది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగించడంపై దృష్టి పెడతా. మహిళా సాధికరత కోసం అన్ని చర్యలు తీసుకుంటా. ఐఏఎస్ అధికారికి సహనం ఎక్కువగా ఉండాలని భావిస్తా. ప్రజల సమస్యలను, బాధలను ఓపికగా విని అర్ధం చేసుకోవాలి.
     
     
     సమస్యలకు పరిష్కారాలు ఆలోచించి సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి. యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రయత్నిస్తా. కష్టపడేతత్వం. పారదర్శకంగా పనిచేయడం, సుపరిపాలన అందించడం, అందరికీ న్యాయం... నా పరిధిలో వీలైనంత మేరకు సహాయం చేయడం సంతృప్తినిస్తాయి. ఇప్పటి యువతీయువకులు... ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యసాధన దిశగా నిరంతరం శ్రమించాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement