శశికళపై పోలీసులకు ఫిర్యాదు
చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ వర్గాల మధ్య పోరు ముదురుతోంది. సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న సెల్వం, శశికళ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బధించారని పన్నీర్ సెల్వం వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యులను రిసార్ట్ లో బంధించారని ఎమ్మెల్యే షణ్ముగనాథన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
తూత్తుకుడి జిల్లా శ్రీ వైకుంఠం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షణ్ముగనాథన్ శశికళ క్యాంపు తప్పించుకుని వచ్చి పన్నీర్ సెల్వం శిబిరంలోకి వచ్చారు. శశికళపై 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్టు వార్తలు వచ్చాయి. నిర్బంధానికి గురైన ఎమ్మెల్యేలను విడిపించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు.
ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు!
అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా?
(మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!)