నేనెవరికి మద్దతివ్వాలి? | tamil nadu mla conducted opinion poll in his constituency | Sakshi
Sakshi News home page

నేనెవరికి మద్దతివ్వాలి?

Published Tue, Feb 14 2017 7:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

నేనెవరికి మద్దతివ్వాలి?

నేనెవరికి మద్దతివ్వాలి?

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో అసెంబ్లీ మెట్లు ఎక్కిన మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్‌ అన్సారీ తాను ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంగా సోమవారం ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించారు. బ్యాలెట్‌ ఓటింగ్‌ రూపంలో ఈ ప్రక్రియ సాగింది. శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆపద్ధర్మ సీఎం పన్నీరుకు మద్దతు పలకాలని తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

దీంతో నాగపట్నం ఎమ్మెల్యే అన్సారీ ప్రజాభిప్రాయం మేరకు తన నిర్ణయమని ప్రకటించారు. తన కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాలెట్‌ ఓటు ద్వారా అభిప్రాయాలు సేకరించారు. సాయంత్రం వరకు ఓటింగ్‌ సజావుగా సాగినా, ఐదున్నర గంటల సమయంలో బ్యాలెట్‌ బాక్సుల్ని కార్యాలయంలో పెట్టి, తాళం వేసుకుని ఆటోలో ఎమ్మెల్యే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. పన్నీరుకు మద్దతుగా మెజారిటీ ఓట్లు పడుతున్న సమాచారంతో శశికళ వర్గం నుంచి వచ్చి బెదిరింపు కారణంగా ఎమ్మెల్యే తమీమున్‌ అన్సారీ వెళ్లిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
 

మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి..
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement