కాపు జాబ్‌మేళా ప్రారంభం
కాపు జాబ్‌మేళా ప్రారంభం
Published Wed, Oct 19 2016 7:12 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
- పాల్గొన్న మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర
అమరావతి: రాష్ట్రంలోని కాపు విద్యార్థులకు కాపు కార్పొరేషన్ బుధవారం జాబ్‌మేళా నిర్వహించింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్‌లైన్‌లో తొమ్మిది వేల మంది రిజిస్ట్రేషన్‌లు చేసుకోగా జాబ్‌మేళాకు బుధవారం సుమారు ఐదు వేల మంది వరకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినురాజప్ప మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చేందుకు బీసీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. కమిషన్‌ను నియమించిన చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ జాబ్‌మేళాను ప్రతి నిరుద్యోగి ఉపయోగించుకోవాలన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందనే మాట నిజం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనాన్నరు. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ మాట్లాడుతూ కాపులను ఆర్థికంగా బలవంతులను చేయడమే కాకుండా చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
జాబ్‌మేళా కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగునుంది. మొదటి రోజు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌లు చేసుకునేందుకు సమయం కేటాయించారు. గురువారం ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యేందుకు పలువురు నిపుణులు శిక్షణ ఇస్తారు. శుక్రవారం ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తారు.
Advertisement