జియో ఎఫెక్ట్: ఎయిర్‌టెల్ 84జీబీ డేటా
జియో కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రకటన వెలువడిన తరువాయే టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా రెండు కొత్త ప్లాన్లను తన కస్టమర్ల కోసం తీసుకొచ్చేసింది.
ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు నువ్వానేనా అంటూ మార్కెట్‌లో విపరీతంగా పోటీపడుతున్నాయి. జియో కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రకటన వెలువడిన తరువాయే టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా రెండు కొత్త ప్లాన్లను తన కస్టమర్ల కోసం తీసుకొచ్చేసింది. దానిలో ఒకటి జియో కొత్త ప్లాన్ రూ.399కి గట్టిపోటీగా ఉంది. రూ.293 రీఛార్జ్ ప్యాక్‌పై 84జీబీ వరకు డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. అయితే ఇది కేవలం ప్రీ-పెయిడ్ కస్టమర్లకు మాత్రమే. మరొకటి రూ.449 ప్లాన్. దీని కింద కూడా 84జీబీ డేటాను 84 రోజుల పాటు వాడుకోవచ్చు. కాల్స్ సౌకర్యం పొందే దగ్గర ఈ రెండు ప్లాన్స్‌పై అందించే ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి. రూ.499 ప్యాక్‌పై అన్ని నెంబర్లకు అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ రూ. 293 ప్లాన్‌పై కాలింగ్ సౌకర్యంపై కంపెనీ పరిమితి విధించింది. ఉచిత కాల్స్ కేవలం ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ నెంబర్లకు మాత్రమే చేసుకోవడానికి మాత్రమే వీలున్నట్టు పేర్కొంది.
ఈ రెండు ప్లాన్లపైనా రోజువారీ డేటా వాడకం 1జీబీ మాత్రమే. ఒకవేళ కేవలం డేటా కోసం మాత్రమే సిమ్ వాడే కస్టమర్లకు రూ.299 ప్లాన్ మెరుగ్గా ఉంటుందని, రెగ్యులర్‌గా సిమ్ కార్డు వాడేవారికి రూ.499 ప్లాన్ బెస్ట్ అని కంపెనీ చెప్పింది. మరోవైపు ఈ రెండు ప్లాన్లు కూడా కొత్త ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే. ప్రస్తుతం ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్లకు ఇవి అందుబాటులోఉండవు. రిటైలర్ల వద్ద తమ ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అయితే 84 రోజులు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది కూడా కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. కాగ, ఇటీవలే ఎయిర్‌టెల్ తమ పోస్టుపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న హాలిడే సర్‌ప్రైజ్ ఆఫర్‌ను మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మాన్‌సూన్ సర్‌ప్రైజ్ ఆఫర్ కింద వచ్చే 3 బిల్లింగ్ సైకిల్స్ లోనూ ప్రతి నెలా 10జీబీ 4జీ డేటాను తమ కస్టమర్లకు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇదీ కూడా ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే.