
కుటుంబసభ్యుల్ని హతమార్చిన కిరాతకుడు
హైదరాబాద్ బాలాపూర్‌లోని సాయినగర్‌లో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల కారణంగా ఓ దుర్మార్గుడు... తల్లి, భార్య, కూతురిని అత్యంత కర్కశంగా పొట్టన పెట్టుకున్నాడు.
హైదరాబాద్: హైదరాబాద్ బాలాపూర్‌లోని సాయినగర్‌లో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల కారణంగా ఓ దుర్మార్గుడు... తల్లి, భార్య, కూతురిని అత్యంత కర్కశంగా పొట్టన పెట్టుకున్నాడు. సాయినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న సమ్మిరెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తి తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతుకోసి హతమార్చాడు.
శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హత్యలు అనంతరం ఘటనా స్థలం నుంచి పరైరయ్యాడు. అనంతరం ఓ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అయితే అదృష్టవశాత్తూ పెద్ద కూతురు ప్రత్యుష ఈ దాడి నుంచి తప్పించుకుంది.