ఏఎస్సై మోహన్‌రెడ్డికి బెయిల్
కరీంనగర్ క్రైం: అక్రమ ఫైనాన్స్ వ్యవహారాలతోపాటు పలు కేసుల్లో అరెస్టరుున ఏఎస్సై బొబ్బల మోహన్‌రెడ్డి 134 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. నాటకీయ పరిణామాల మధ్య సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మోహన్‌రెడ్డి న్యాయవాది, మరొకరు సిరిసిల్ల కోర్టులో బెయిల్ పనులన్నీ పూర్తి చేశారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో చడీచప్పుడు లేకుండా మోహన్‌రెడ్డి కరీంనగర్ జిల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. అంతసేపు దూరంగా ఉన్న కొత్త తెల్లటి స్కోడా కారు జైలు వద్దకు రాగా.. అందులో ఆయన ఎక్కి వెళ్లిపోయూరు.
గతేడాది అక్టోబర్ 29న కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల యాజమాని రామగిరి ప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రసాదరావు సూసైడ్ నోట్‌లో రాశారు. ఈ మేరకు మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే నెల 31న ఎస్సై శిక్షణలో ఉన్న అతడిని అరెస్టు చేసిన విషయం విదితమే. దీంతో జిల్లావ్యాప్తంగా పలు ఠాణాల్లో మోహన్‌రెడ్డిపై 40 కేసులు నమోదయ్యూరుు. ఈ క్రమంలో ఆదాయూనికి మించి ఆస్తులు సంపాదించాడనే అభియోగంపై ఏసీబీ దాడులు కూడా చేసింది. మరోపక్క ఈడీ, ఐటీ అధికారుల సైతం రంగంలోకి దిగి మోహన్‌రెడ్డి బంధువులు, బినామీలు 17మందికి నోటీసులు జారీ చేశారు. సీఐడీ అధికారులు 532 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటి విలువను లెక్కగట్టినట్లు సమాచారం.
కేసు నమోదైన 90 రోజులు గడిచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో మోహన్‌రెడ్డికి బెయిల్ లభించేందుకు అవకాశం కలిగింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందాలో మోసపోయిన పలువురు బాధితులు మోహన్‌రెడ్డి బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారు. ఈ బాధితులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు ఇప్పటికే 100 రోజులు దాటారుు. కాగా, మోహన్‌రెడ్డి దందాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పటికే పెద్ద మొత్తం చెల్లించాడని, వీటితోపాటు తనకు రావాల్సిన డబ్బులు కూడా వసూలు చేసుకోవడానికి డీల్ కుదుర్చుకున్నాకే.. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడనే ప్రచారం జరుగుతోంది.