లావుగా ఉన్నావంటూ... | Bride groom refuses to marry due to bride's fat | Sakshi
Sakshi News home page

లావుగా ఉన్నావంటూ...

Published Sat, Apr 5 2014 8:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

లావుగా ఉన్నావంటూ...

లావుగా ఉన్నావంటూ...

విజయవాడ(గుణదల), న్యూస్‌లైన్: నిశ్చితార్థం జరిగింది... కట్నం కింద కొంత డబ్బు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు... తీరా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక నీవు లావుగా ఉన్నావు.. నిన్ను పెళ్లి చేసుకోనంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితులతో పాటు సీపీఐ కార్యకర్తలు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

బాధితుల కథనం ప్రకారం... విజయవాడలోని మాచవరంలో ఉంటున్న యువతికి హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన పాలెం విక్రమనాయుడుతో పెళ్లి సంబంధం కుదిరింది. ఫిబ్రవరి 6న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. మే 12న పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. కట్నకానుకలు, లాంఛనాలు కలిపి రూ.5 లక్షల వరకు ఇచ్చేందుకు యువతి కుటుంబీకులు అంగీకరించారు. నిశ్చితార్థం రోజున రూ.2 లక్షలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో నాలుగురోజుల కిందట విక్రమనాయుడు కాబోయే భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు లావుగా ఉన్నావు.. వెంటనే తగ్గాలి.. లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఒకవేళ పెళ్లి జరగాలంటే మరో రూ.3 లక్షలు అదనంగా ఇవ్వాలి’అని డిమాండ్ చేశాడు. దీంతో అవాక్కైన ఆమె ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. మోసపోయామని గ్రహించిన యువతి తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement