ఎస్సైతో సీఐ రాసలీలలు
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ పోలీసు అధికారులు.. ఒకరు సీఐ.. మరొకరు మహిళా ఎస్సై.. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు.. అసెంబ్లీ సమావేశాల బందోబస్తు కోసం హైదరాబాద్ వచ్చారు.. అధికారులు వారికి వేర్వేరు చోట్ల లాడ్జీల్లో గదులు కేటాయించారు.. కానీ ఆ సీఐ రాత్రివేళ ఎస్సై గదిలోకి వెళ్లారు.. తీరా అదే సమయంలో ఆమె భర్త చెన్నై నుంచి వచ్చి తలుపులు తెరవడంతో సదరు సీఐ పరుగు లంకించుకున్నారు! మహిళా ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ... కరీంనగర్ త్రీటౌన్ సీఐ తొటిచర్ల స్వామి(35) అసెంబ్లీ బందోబస్తు కోసం బుధవారం నగరానికి వచ్చారు. అధికారులు ఈయనకు లక్డీకాఫూల్‌లోని ద్వారక హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. వరంగల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సీహెచ్ రాజ్యలక్ష్మి (30) కూడా అసెంబ్లీ బందోబస్తుకు నగరానికి వచ్చారు.
ఈమెకు అబిడ్స్‌లోని బృందావన్ హోటల్ 217 గదిలో అధికారులు బస ఏర్పాటు చేశారు. ఈమె భర్త సీహెచ్ సునీల్‌రెడ్డి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గతేడాదే వీరికి పెళ్లయింది. ఈ నెల 15న (శనివారం) తాను హైదరాబాద్ వస్తున్నట్లు భార్య రాజ్యలక్ష్మికి సమాచారం అందించారు. కానీ శుక్రవారం రాత్రే బృందావన్ హోటల్‌కు వచ్చారు. అప్పటికే సీఐ స్వామి... రాజ్యలక్ష్మి గదిలో ఉన్నారు. అతను ఎవరని భార్యను నిలదీస్తుండగానే... స్వామి గది నుంచి పలాయనం చిత్తగించారు. పరుగెత్తుతున్న వ్యక్తిని హోటల్ సిబ్బంది పట్టుకుని నిల దీయగా కరీంనగర్ త్రీటౌన్ సీఐ అని తేలింది. సునీల్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీఐ స్వామి, ఎస్సై రాజ్యలక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై 497, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
గతంలోనే గొడవలు..
రాజ్యలక్ష్మికి, సునీల్‌రెడ్డికి మధ్య గతంలోనే గొడవలు జరిగాయి. ఆమెను అనుమానించిన సునీల్ రాజ్యలక్ష్మి సెల్‌ఫోన్ వాయిస్‌లను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో వారం కిందట భర్తపై ఆమె వేధింపుల కేసు పెట్టింది. అప్పట్నుంచి ఆమెను వెంటాడుతున్న భర్త... శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చి సీఐతో గదిలో ఉండగా పట్టుకున్నారు. కాగా సీఐ స్వామి, ఎస్సై రాజ్యలక్ష్మిలను విధుల నుంచి తప్పించినట్లు వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి తెలిపారు. వారిని డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయమని ఆదేశించారు.
వారిద్దరిది గత పరిచయమే...
వరంగల్ జిల్లా చిట్యాలకు చెందిన తొటిచర్ల స్వామి 2002(బ్యాచ్)లో ఎస్సైగా ఎంపికయ్యూ రు. ఖమ్మం జిల్లా తొర్రూరులో తొలి పోస్టింగ్ పొందారు. మధిర టౌన్, గార్ల బయ్యారం, పాల్వంచ టౌన్‌లో ఎస్సైగా పనిచేశారు. 2012లో సీఐగా పదోన్నతి పొంది చింతూరులో బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న కరీంనగర్ త్రీటౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈయనకు గతంలోనే వివాహమైంది. ఓ పాప. స్వామి ఖమ్మంలో ఎస్సైగా పని చేసే సమయంలో రాజ్యలక్ష్మి అక్కడే కానిస్టేబుల్‌గా పని చేసేవారు. అప్పుడు ఇద్దరికి పరిచయం ఏర్పడిందని తెలిసింది. రాజ్యలక్ష్మి 2009 (బ్యాచ్)లో ఎస్సైగా ఎంపికయ్యూరు. మొదటి పోస్టింగ్ మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టే షన్‌లో ఇచ్చారు. ప్రస్తుతం వరంగల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. స్వామి ఓ కేసు విషయంలో ఈ నెల 11న ఖ మ్మంలో కోర్టుకు హాజరయ్యారు. 12న ఉదయం కరీంనగర్‌కు వచ్చి అసెంబ్లీ బందోబస్తుకు వెళ్తానని డీఎస్పీ రవీందర్‌ను కోరారు. అయితే మరో దఫా వెళ్లమని డీఎస్పీ సూచించారు. కానీ స్వామి ఎస్పీ ద్వారా ప్రయత్నించి హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి పొందడం గమనార్హం.