తోడటం మొదలెట్టారు!
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేల క్యూసెక్కులు తీసుకున్న ఏపీ
► ఐదు గేట్లు ఎత్తారన్న సమాచారంతో అప్రమత్తమైన తెలంగాణ
► అక్రమంగా నీటిని తరలిస్తున్నారంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలోకి నీటి ప్రవాహా లు కొనసాగుతూ మట్టాలు పెరుగుతుం డటంతో గరిష్ట నీటి వినియోగంపై కన్నేసిన ఆంధ్రప్రదేశ్.. ఊహించినట్లుగా పోతిరెడ్డిపా డు ద్వారా అక్రమంగా నీటిని తోడే చర్యలకు దిగింది. మంగళవారం ఉదయం ఐదు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల మేర నీటిని తోడే ప్రయత్నం చేసింది. ఏపీ నీటి తరలింపును గుర్తించిన తెలంగాణ.. అప్రమత్తంగా వ్యవహ రించి బోర్డుకు ఫిర్యాదు చేయడంతో సాయం త్రానికి గేట్లు దించింది.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే..
శ్రీశైలంలోకి 20 రోజులుగా íస్థిరంగా ప్రవాహా లు కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం 105.65 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు వాస్తవ మట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 860 అడుగుల్లో ఉంది. పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని తరలించాలంటే శ్రీశైలం లో 843 అడుగులు ఉంటే సరిపోతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకునే పోతిరెడ్డిపాడు కింది తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు కేటా యించాలని సోమవారం ఏపీ కృష్ణా బోర్డును కోరింది. దీనిపై బోర్డు నిర్ణయం వెలువరించ లేదు. నీటి కేటాయింపు చేయాలని కోరి 24 గంటలైనా ముగియకముందే పోతిరెడ్డిపాడు లోని 5 గేట్లను ఎత్తి 5 వేల క్యూసెక్కులు తీసుకోవడం మొదలుపెట్టింది.ఇప్పటికే శ్రీశైలం కింద ఏపీ చేసే వినియోగంపై దృష్టి పెట్టిన తెలంగాణ, పోతిరెడ్డిపాడు కింద బోర్డు అనుమతి లేకుండా నీటిని తీసుకుంటున్నారని గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు.
పోతిరెడ్డిపాడు కింద ఏపీ చేస్తున్న వినియోగంపై నిరసన తెలిపారు. నాగార్జునసాగర్ కనీస మట్టం 510 అడుగు లైనా ప్రస్తుతం 500.9 అడుగుల వద్దే నీరుం దని, ఇక్కడి తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత ఏడాదిలో తాగునీటి అవస రాలపై చర్చించేందుకు బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ లేఖ రాసిన అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏపీ పోతిరెడ్డిపాడు గేట్లు మూసి వేసింది. అయితే పవర్‌హౌస్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తోంది.
తగ్గనున్న వరద..
శ్రీశైలంలోకి మంగళవారం సాయం త్రానికి 1,31,007 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటి నిల్వ 105.65 టీఎంసీలకు చేరుకుంది. జలాశ యం నిండాలంటే మరో 110 టీఎంసీలు అవసరం. ఎగువన ఉజ్జయిని, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువ కు నీటి విడుదలను కట్టడి చేస్తున్నారు. దాంతో బుధవారం నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. నెలాఖరు నుంచి.. అక్టోబర్ ప్రథమార్థం లోగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో తుపాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వేస్తోన్న అంచనాలు వాస్తవరూపం దాల్చితే కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది.