'పోలీసులే వ్యవస్థను చెడగొడుతున్నారు'
హైదరాబాద్: వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే వ్యవస్థను చెడగొడుతున్నారని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ.. నేరేళ్ల సంఘటనతో కూడా పోలీసులకు బుద్దిరాలేదని, పోలీసులను వాడుకుని ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు అమలు చేయాలని చూస్తుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణకి పోలీసులను మోహరించి ప్రజలను భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. భూ సర్వేకు తాము వ్యతిరేకం కాదని, గతంలో చేసిన సమగ్ర సర్వేను ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విదివిధానాలు లేకుండా సర్వే చేయటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు.