మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్‌ సాయం | KCR helped the former MLA Ramachandra reddy | Sakshi

మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్‌ సాయం

Published Sun, Jun 25 2017 12:14 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్‌ సాయం - Sakshi

మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్‌ సాయం

కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి కేసీఆర్‌ ఆర్థిక సాయం అందించారు

సిద్దిపేట: కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి కేసీఆర్‌ ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన దీనస్థితిని చూసి కేసీఆర్‌ చలించిపోయారు.

ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనకు ఇంటి స్థలం కూడా లేకపోవడంతో వెంటనే ఇంటి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సాయం చేస్తానన్న మాట ప్రకారం రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని, డబుల్‌బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేశారు. రూ.25 లక్షల చెక్కును మంత్రి హరీష్‌రావు రామచంద్రారెడ్డికి కొండపాకలో అందజేశారు. కాగా, కేసీఆర్‌ సాయానికి ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement