రఘునందన్‌తో ప్రాణహాని: అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి.. | Radha Ramani Sensational Comments On Raghunandan Rao | Sakshi
Sakshi News home page

రఘునందన్‌తో ప్రాణహాని ఉంది : రాధారమణి

Published Tue, Feb 4 2020 4:36 PM | Last Updated on Tue, Feb 4 2020 4:48 PM

Radha Ramani Sensational Comments On Raghunandan Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రఘునందన్‌రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు సోమవారం ఆమె సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆమె మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘునందన్‌ తనను, తన కుమారుడిని హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చిన అమ్మాయిలకు మత్తుమందు కలిపి వారిపై అత్యాచారం చేసేవారని తెలిపారు. అంతేకాకుండా ఓ టాలీవుడ్‌ ప్రముఖ హీరో సోదరుడికి రఘునందన్‌ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.(రఘనందన్‌ లైంగికంగా వేధించారు)

ఆమె మీడియా సమావేశాలు మాట్లాడుతూ రఘునందన్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘నన్ను శారీరకంగా ఎంతో టార్చర్‌ చేస్తున్నారు. నా భర్తతో కలిసి నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముంబై కేంద్రంగా రఘునందన్‌ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. దీనికి ఆర్సీపురం సీఐ రాజేశేఖర్‌రెడ్డి సహాయం కూడా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావుతో కలిసిన రఘునందన్‌ అమ్మాయిల బిజినెస్‌ చేస్తున్నారు. కేసుల పరిష్కారం వచ్చే వారిని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. నా మెయింటెనెన్స్‌ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను మార్చేశారు. తనకు న్యాయం చేయాలని అనేక మంది చుట్టూ తిరిగాను. చివరికి విసిగిపోయి మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించాను.’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement