తెలంగాణలో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు | Reservation Confirm In Mayor And Municipal Chairman In Telangana | Sakshi
Sakshi News home page

మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

Published Sun, Jan 5 2020 12:39 PM | Last Updated on Sun, Jan 5 2020 3:50 PM

Reservation Confirm In Mayor And Municipal Chairman In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి ఆదివారం ఆయా కార్పొరేషన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్‌-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్‌ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్‌పేట్‌ మేయర్‌ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం మేయర్‌ పదవి ఎస్సీకి కేటాయించారు. జవహర్‌నగర్‌, బండ్లగూడ, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ పదవులను బీసీకి కేటాయించినట్లు ఆమె తెలిపారు. 128 మున్సిపాలిటీలో జడ్చర్ల, నకిరేకల్ ఇంకా సమయం ఉందని, వివిధ కారణాలతో పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్ ప్రకటించడం లేదని వివరించారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించామన్నారు. కొత్త చట్టం ప్రకారం ఇవే రిజర్వేషన్లు తరువాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయన్నారు. 


ఎస్టీ రిజర్వుడ్ మున్సిపాలిటీలు..
అమన్గల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్.

ఎస్సీ రిజర్వుడు మున్సిపాలిటీలు..
కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి 

బీసీ రిజర్వుడు మున్సిపాలిటీలు..
సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్,  కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి.


13 కార్పొరేషన్లలో రిజర్వేషన్లు
ఎస్టీ : మీర్‌పేట్

ఎస్సీ :  రామగుండం
బీసీ : జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడ
జనరల్‌ : బండాగ్ పెట్, కరీంనగర్, బొడుప్పల్, పిర్జాదిగూడ. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజాంపేట
(జనరల్‌ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు)

మొత్తం జనాభాలో
1.9 శాతం ఎస్టీ జనాభా 3.25% రిజర్వేషన్లు
3.6 శాతం ఎస్సీ జనాభా.  14% రిజర్వేషన్లు
32.5 శాతం బీసీ % జనాభా, 33 శాతం రిజర్వేషన్లు ఖరారు.

పూర్తి జాబితా కోసం ...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement