న్యూఢిల్లీ: భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. శనివారం సంభవించిన భూప్రకంపనల వల్ల బీహార్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. ఇప్పటి వరకు బీహార్ ల 20 మంది మరణించినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్లో ఆరుగురు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు మరణించారు.
బీహార్లోని భగల్పూర్ గోడ కూలిపోవడంతో ఇకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లో చాలా చోట్ల భూప్రకంపనల ధాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి నష్టం ఏమేరకు సంభవించిదన్న విషయం ఇంకా తెలియరాలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.