రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్.. | Aishwarya Rai Bachchan shakes in Ae Dil Hai Mushkil new song | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..

Published Fri, Sep 16 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..

రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..

ముంబై: హీరోకు కన్నుగీటి కవ్వించి, చూపు తిప్పుకోనివ్వని కళ్లతో మైమరపించి, అతని బుగ్గలకు క్రీమ్ రాసి పెదవులతో తుడిచి.. ఇంకా రకరకాల చేష్టలతో ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా కోసం 42 ఏళ్ల ఐశ్వర్య.. 33 ఏళ్ల రణ్ బీర్ కపూర్ తో కలిసి రొమాన్స్ ను అద్భుతంగా పండించారని వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. కొద్ది రోజుల కిందటే టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన 'ఏ దిల్ హై ముష్కిల్' రూపకర్తలు రెండో పాటగా 'బులెయా..'ను శుక్రవారం ఆన్ లైన్ లో విడుదల చేశారు.

కరణ్ జోహార్ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్'పై సినీ వర్గాల్లో ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా చిత్రీకరించిన 'బులెయా..' సాంగ్ నెట్ లో విడుదలైన కొద్ది గంటలకే గణనీయమైన హిట్స్ సాధించింది. ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లు ఈ సినిమాలో ప్రధాన తారగణం. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ కూడా తళుక్కున మెరవనున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, 2006లో వచ్చిన 'యాక్షన్ రిప్లే' తర్వాత ఐశ్వర్య నటిస్తోన్న రొమాంటిక్ సినిమా ఇదే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement