గృహ రంగానికి గుడ్న్యూస్
గృహ రంగానికి గుడ్న్యూస్
Published Wed, Feb 1 2017 12:29 PM | Last Updated on Mon, Aug 20 2018 5:20 PM
న్యూఢిల్లీ : ఇక గృహ రుణాలు చౌకగా లభ్యం కానున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు జైట్లీ బడ్జెట్లో రూ.20వేల కోట్ల గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనతో డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక పెట్టుబడిదారులను ఆకర్షించనుంది. వనరుల కేటాయింపులు పెంచడానికి ఈ స్టేటస్ ఎంతో సహకరించనుంది.
దీంతో హౌసింగ్ సప్లైలు పెరిగి, డిమాండ్ తగ్గనుంది. మౌలిక సదుపాయాల కల్పినకు రూ.3,96,134 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అడిగిన గడువు ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోనే వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సరసమైన గృహాల కోసం మౌలిక సదుపాయాల స్టేటస్ను కల్పించారు.
Advertisement
Advertisement