సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య | Film star Uday Kiran suicide at his flat | Sakshi
Sakshi News home page

సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

Published Mon, Jan 6 2014 2:36 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య - Sakshi

సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని చనిపోయారు. గత రెండేళ్లుగా ఆయన అదే అపార్టుమెంటులోని 402 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఉరేసుకునే సమయంలో ఆయన భార్య విషిత ఇంట్లో లేరు.
 
అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరి వేసుకుని.. చనిపోయే ముందు ఉదయ్‌కిరణ్‌ ఇంట్లో వాళ్లకి కాకుండా.. తన స్నేహితులకు ఫోన్లు చేశారు. వాళ్లు మళ్లీ కాల్‌బ్యాక్‌ చేస్తే ఎంతకూ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానించిన స్నేహితులు ఆయన ఇంటికి వెళ్లి చూడగా ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఉన్నట్టు తెలిపారు. వెంటనే ఉదయ్ కిరణ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
 
కాగాస్నేహితులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదయ్ కిరణ్ తెలిపినట్టు తెలిసింది. ఉదయ్ కిరణ్ ఫోన్ కు స్నేహితులు కాల్ బ్యాక్ చేయగా లిఫ్ట్ చేయలేదని.. వెంటనే ఆయన నివాసానికి వెళ్లి చూడగా ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఉన్నట్టు స్నేహితులు తెలిపారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న సినీ నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేశ్, తరుణ్, ఇతర సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. 
 
ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించారు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో ఎంగేజ్ మెంట్ జరిగినా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. నువ్వు నేను చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement