ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య | Haryana Minister Anil Vij controversial comments on terrorism | Sakshi
Sakshi News home page

ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య

Published Wed, Jun 21 2017 6:10 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య

ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య

- హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీగఢ్‌:
ఉగ్రవాదం నేపథ్యంలో మతాలను వర్గీకరిస్తూ బీజేపీకి చెందిన హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్లో దోషులంతా ముస్లింలేనని, హిందూ అనేవాడు ఉగ్రవాది కాబోడని వ్యాఖ్యానించారు. బుధవారం ఛండీగఢ్‌లో ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. హిందూ ఉగ్రవాదం అనేది ఓ మిథ్య అన్నారు.

‘ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వ వైఖరి. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే వాళ్లు(కాంగ్రెస్‌) హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించారు. నిజానికి ఏ హిందువు ఉగ్రవాది కాడు.. కాబోడు. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు జరిగిన దాడుల్లో దోషులు, నిందితులు అందరూ ముస్లింలేకదా?’ అని అనిల్‌ విజ్‌ అన్నారు.

ఇండియాపై దాడులు చేసిన ఎంతోమంది టెర్రరిస్టులను కాంగ్రెస్‌ హయాంలో విడిచిపెట్టారని, ఇప్పుడు వాళ్లంతా సమన్లను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారని అనిల్‌ విజ్‌ మండిపడ్డారు. హిందూ ఉగ్రవాదంటూ ఉండిఉంటే దేశం ఏనాడో నాశనమై ఉండేదని విజ్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement