మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ దారుణ హత్య | Infosys techie murdered at workstation in Pune office | Sakshi
Sakshi News home page

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ దారుణ హత్య

Published Mon, Jan 30 2017 8:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

మహిళా  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ దారుణ  హత్య

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ దారుణ హత్య

పుణే:   ప్రముఖ సాఫ్ట్‌వేర్‌  సంస్థ ఇన్ఫోసిస్‌  లో పనిచేసే  మహిళా సాఫ్ట్‌వేర్‌   ఇంజనీర్  మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురైంది.   పుణే రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌ కార్యాలయంలో  పనిచేస్తున్న టెకీ అనుమానాస్పద స్థితిలో  మరణించింది.  మృతురాలు కేరళకు చెందిన  ఆనంద్ కె రాసిలా రాజు (25)గా గుర్తించారు.  ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదవ అంతస్తులో  విధి నిర్వహణలో ఉన్న ఆమెను ఎవరో గొం‍తు నులిమి హత్య చేశారు. ఆనంద్ కె రాసిలా రాజు బెంగళూరులోని  టీమ్‌ తో ఆన్‌ లైన్‌​ లో వర్క్‌  చేసుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కంప్యూటర్‌ వైర్‌ తో ఆమె మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  ఈ ఘటన ఆదివారం  సాయంత్రం చోటు చేసుకుంది. ఈ  కేసులో  సెక్యూరిటీ గార్డును ప్రధాన అనుమానితుడిగా పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అందించిన సమాచారం..  రాజు ఆదివారం కార్యాలయంలో పని చేసుకుంటోంది.  టీమ్‌ మేనేజర్‌ ఆమెకు ఫోన్‌ కాల్‌ చేసినప్పుడు.. సమాధానం రాకపోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ ను  అలర్ట్‌ చేశాడు. అయితే సెక్యూరిటీ గార్డు  తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో పడి వున్నట్టు గుర్తించినట్టు  తెలిపారు.  ఆదివారం  సాయంత్రం  సుమారు 5 గంటల ప్రాంతంలో ఆ హత్య జరిగి వుండవచ్చని అసిస్టెంట్‌ కమిషనర్‌  వైశాలి జాదవ్‌  అనుమానిస్తున్నారు. అయితే ఎనిమిది గంటలకు తమకు సమాచారం అందిందని చెప్పారు.   సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా  దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement