గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు?
చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెలం (ఓపీఎస్) గురువారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీ 20నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, సెల్వం నువ్వా-నేనా అన్నరీతిలో తలపడుతున్న నేపథ్యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అందరి దృష్టి గవర్నర్‌పై నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మొత్తం తనకు మద్దతుగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలతో ఓపీఎస్ గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తనకు అవకాశం ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. శశికళ ఒత్తిడి చేయడం వల్లే రాజీనామా చేశానని, వీలుంటే తన రాజీనామాను వెనుకకు తీసుకుంటానని కూడా ఓపీఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు మరో అవకాశం ఎందుకు కల్పించాలో ప్రధానంగా సెల్వం.. గవర్నర్‌కు వివరించినట్టు చెప్తున్నారు.
తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరిచేందుకు ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.