tamilnadu
-
ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య
-
విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి
-
విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే వ్యూహం..!
-
తమిళనాడులో కొత్త చరిత్ర! ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
-
ఊహించని విధంగా 5 రాష్ట్రాల.. ఎగ్జిట్ పోల్స్
-
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్.. విజయకి సీఎం అయ్యే ఛాన్స్'
-
ఐడెంటిటీకి మరింత బ్యూటీ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూవాగం ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన అందాల పోటీలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి విజేతగా నిలిచారు. తమిళనాడులోని విళ్లుపురంలో అట్టహాసంగా జరిగిన ఈ ట్రాన్స్ వేడుకలో ఆమె ‘మిస్ కూవాగం 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లను ఏకం చేసే ఈ సాంస్కృతిక వేదికపై సూర్యకుట్టి సాధించిన విజయం, ఆ కమ్యూనిటీ ఐడెంటిటీకి, ఆత్మవిశ్వాసానికి, కళాత్మక ప్రతిభకు అద్దం పడుతోంది.ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దైవమైన కూతాండవర్ వెలసిన కూవాగం గ్రామంలో ప్రతి ఏటా కూవాగం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాభారతంలోని అరవాన్ (కూతాండవర్) బలి ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలను సౌత్ ఇండియన్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్, తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. అందులో భాగంగా కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి మిస్ కూవాగం 2026 టైటిల్‌ను గెలుచుకుని అందరినీ ఆనందంలో ముంచెత్తారు.ప్రథమ స్థానంలో సూర్యతమిళనాడు విళ్లుపురం మున్సిపాలిటీ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 25 మంది పోటీదారులు మూడు దశల్లో తమ ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్ వాక్‌లో, జడ్జిల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సూర్య కనబరచిన చాకచక్యం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. రెండో స్థానాన్ని మలేసియాకు చెందిన నిషా నిలబెట్టుకుంటే, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడోస్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మరో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు ‘యంగ్ అచీవర్స్’ పురస్కారాలను కూడా అందజేశారు. అంతకుముందు జరిగిన ‘మిస్ తిరునంగై 2026’ పోటీలో చెన్నైకి చెందిన ఓమన మొదటి బహుమతి గెలుచుకోగా, సాయి శ్రీ, సుఖి తర్వాతి స్థానాల్లో నిలిచారు.దేశ విదేశాల నుంచి తమిళనాడులోని కూవాగం గ్రామంలో ఉన్న కూతాండవర్ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా, ట్రాన్స్ జెండర్ల సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఇక్కడికి చేరుకుని తమ ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు.ఉనికిని చాటే వేదిక కూతాండవర్ ఆలయ ఉత్సవాల్లో భాగమైన ఈ మిస్ కూవాగం పోటీ కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ట్రాన్స్ జెండర్ల ఉనికిని చాటే ఒక గొప్ప వేదిక. ఈ వేదిక సూర్య కుట్టి సాధించిన విజయానికి, పట్టుదలకు కోయంబత్తూరు కీర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సినీ నటులు, గాయకుల సమక్షంలో ఆమెకు ఈ గౌరవం లభించడం విశేషం. కుటుంబ మద్దతే మా బలంట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలంటే ముందుగా కుటుంబం నుంచి మద్దతు లభించాలి. నా ఈ విజయం మరికొంత మంది ట్రాన్స్జెండర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిపాదించే చట్టాలు మా హక్కులను కాపాడేలా ఉండాలి. ట్రాన్స్ జెండర్ సమాజం పట్ల ఉన్న వివక్షను తొలగించి, హక్కుల కోసం పోరాడుతూ.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవడమే లక్ష్యం. -
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
-
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అధికారం ఆ పార్టీలదే
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం ఖాయమని తేల్చాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. వివిధ సంస్థలు ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్స్ పోల్స్‌ను విడుదల చేశాయి. తమిళనాడు (మొత్తం: 234)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్డీఎంకే: 125 – 145ఏడీఎఎంకే: 65 – 80టీవీకే (విజయ్): 18 – 24ఇతరులు : 2 – 6కేరళ (మొత్తం: 140)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్యూడీఎఫ్: 75 – 85ఎల్డీఎఫ్: 55 – 65బీజేపీ: 0 – 3ఇతరులు : 0అసోం (మొత్తం: 126)ఏజెన్సీ: యాక్సిస్ మై ఇండియాబీజేపీ: 88 – 101కాంగ్రెస్: 15 – 36ఏఐయూడీఎఫ్: 0ఇతరులు: 0 – 3పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్టీఎంసీ: 177 – 187బీజేపీ: 95 – 110కాంగ్రెస్: 1 – 3వాపక్షాలు: 0 – 1పుదుచ్చేరి (మొత్తం: 30)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్ఎన్ఆర్సీ: 16 – 19కాంగ్రెస్: 10 – 12ఇతరులు: 1 – 2 అస్సాంలో బీజేపీ సునామీఅస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మ నేతృత్వంలోని ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీ 88-100 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 24-36 సీట్లతో సరిపెట్టుకోవచ్చని తెలిపింది. పశ్చిమ బెంగాల్రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. అధిక సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.తమిళనాడు234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 82 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో టీవీకే విజయ్, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని సూచనలు వెలువడుతున్నాయి.కేరళంఎప్పటిలాగే అధిక ఓటింగ్ నమోదైన కేరళంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజారిటీని చూపడం కష్టం. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.అసోం85 శాతం పైగా పోలింగ్ నమోదైన అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ, ఎన్డీఏ బలంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.పుదుచ్చేరి89 శాతం పైగా పోలింగ్ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బలంగా నిలుస్తోంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ–బీజేపీ మధ్య పోటీ, కేరళలో ఎల్డిఎఫ్–యూడిఎఫ్ మధ్య పోటీ కనిపిస్తోంది. -
రీపోలింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కీలక ప్రకటన చేసింది. మొదటి విడత పోలింగ్ ముగిసిన ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి రీపోలింగ్ నిర్వహించబోమని స్పష్టం చేసి, పలువురి ఊహాగానాలకు తెరదించింది. ఏప్రిల్ 23న (2026) జరిగిన పశ్చిమ బెంగాల్ (152 స్థానాలు), తమిళనాడు (234 స్థానాలు) ఎన్నికల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఈసీ అధికారులు తేల్చి చెప్పారు.బెంగాల్‌లోని 44,376 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. మిగిలిన 142 స్థానాలకు బెంగాల్లో ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. తొలి విడత తరహాలోనే రెండో విడతను కూడా ప్రశాంతంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించాలని బీజేపీ నేత తపస్ రాయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీస్ అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. డైమండ్ హార్బర్ అదనపు ఎస్పీ సందీప్ గరాయ్, ఎస్డీపీఓ సజల్ మండల్, ఇన్స్పెక్టర్ మౌసమ్ చక్రవర్తితో పాటు ఫాల్టా, ఉస్తి పోలీస్ స్టేషన్ల అధికారులైన అజయ్ బాగ్, శుభేచ్ఛా బాగ్లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరందరిపై కఠిన క్రమశిక్షణ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.విజయంపై అంచనాలు..ఎన్నికల ఫలితాలపై అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు మిత్రపక్షాలు తీవ్ర ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో మొదటి విడత ఎన్నికల్లోనే టీఎంసీ ‘సెంచరీ (100+ స్థానాలు)’ కొట్టేసిందని, ఈ పరిణామంతో బీజేపీ శిబిరంలో వణుకు పుట్టిందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు, నార్త్ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
రికార్డు స్థాయి ఓటింగ్.. విజయ్ క్రేజ్.. తమిళనాడు లెక్కలు మారనున్నాయా?
-
తమిళనాడు, బెంగాల్ లో రికార్డు స్థాయిలో పోలింగ్
-
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు.. పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 92.72 శాతం, తమిళనాడులో 85.14 శాతం ఓటింగ్ నమోదు
-
ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు
-
ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్
-
తమిళనాడు సమరం.. 234 స్థానాలకు పోలింగ్ స్టార్ట్
-
మీకు చేతులెత్తి మొక్కుతున్న... స్టాలిన్ నుంచి కాపాడండి
-
తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు
తమిళనాడులో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం పూర్తి చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో దాదాపు 404 మందికి పైగా అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని నివేదిక తెలిపింది.తమిళనాడు ఎన్నికలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, టీన్యూ ప్రకటించిన సర్వే వివరాలు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మెుత్తంగా 4,023 మంది ఉండగా వారిలో 3,992 మంది అఫిడవిట్లు పరిశీలించబడ్డాయి. అందులో తీవ్రమైన కేసులు ఉన్నవారు 404 మందిపై తీవ్రమైన కేసులున్నట్లు తేలింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యిందని నివేదిక పేర్కొంది.722 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. . వీరిలో దాదాపు 18% అభ్యర్థులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించకపోవడం వల్ల టికెట్లు పొందినట్లు తెలిపింది. 58% స్థానాల్లో వివిధ అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉండటంతో వాటిని ఆయా నియోజకవర్గాలను 'రెడ్ అలర్ట్'గా గుర్తించారు. ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 3,992 మంది అభ్యర్థుల ప్రకటించిన ఆస్తుల విలువ రూ. 20,678 కోట్లు. అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ మూడు రెట్లు పెరిగి రూ. 5.17 కోట్లకు చేరుకుంది. వీరిలో ఇది వరకే 981 మంది కోటీశ్వరులని తెలిపారు. మరి కొంతమందికైతే ఏకంగా వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారుఅత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థుల జాబితాAIADMK అభ్యర్థి లీమా రోజ్ మార్టిన్ – ₹5,863 కోట్లు.TVK నాయకుడు సి. జోసెఫ్ విజయ్ – ₹648 కోట్లు.TVK అభ్యర్థి ఆథవ్ అర్జున – ₹534 కోట్లు. ఎన్నికల ఎదుట ఈ నివేదిక ప్రజలను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. -
ఎన్నికల వేళ డీఎంకే, కాంగ్రెస్‌లకు షాక్
తమిళనాడులో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల (ఏప్రిల్ మొదటి వారంలో) సేలంలోని పలువురు డీఎంకే నేతల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు సుమారు 5-8 గంటల పాటు కొనసాగాయి. కాగా ప్రస్తుతం మరో సారి ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన కూమారుడి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. క్రిప్టో మనీలాండరింగ్ కేసులో భాగంగా బెంగళూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన 17 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 గురువారం రోజున ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై నిఘా సంస్థల తనిఖీలు పెరిగాయి. -
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 20 మంది మృతి
చెన్నై: తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. విరుధునగర్ జిల్లా కట్టనార్‌పట్టి ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వనజ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. కర్మాగారంలోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మొదట నలుగురు మరణించినట్లు సమాచారం వచ్చినా, కొద్ది సమయంలోనే మరణాల సంఖ్య భారీగా పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
తమిళనాట ఇండియన్ ఇనిస్టిట్యూట్ సర్వే...!
చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ సంచలన ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన స్థానాన్ని పదిలం చేసుకోబుతున్నారని సర్వే తెలిపింది.ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటములతో పాటు సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. అధికారం పొందడమే లక్షంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే కూటమి తమిళనాట మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ఒపీనియన్ పోల్ చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష డీఎంకే కూటమి ఏ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. సినీహీరో విజయ్ అధికారానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ మంచి స్థాయిలో ఓట్లషేర్ సాధించే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ ఓపీనియన్ పోల్ ప్రకారండీఎంకే కూటమి-37.5 % ఓట్లు 121 సీట్లుఏఐడీఎంకే కూటమి- 33.63 % ఓట్లు 83 సీట్లుటీవీకే పార్టీ - 24.71 % ఓట్లు 3 సీట్లు సాధించనున్నట్లు సర్వే తెలిపింది. 27 చోట్ల హోరాహోరి పోరు నడుస్తోందని పేర్కొంది. అయితే డీఎంకే సైతం సొంతంగా మెజారిటీ సాధించలేదని అలియన్స్ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇదివరకు వచ్చిన సర్వేలలో చాలా వరకూ డీఎంకే వైపే మెుగ్గుచూపాయి. కాగా తమిళనాడులో 234 స్థానాలుండగా అధికారం సాధించడానికి 118 స్థానాలు అవసరం. -
ఘోర ప్రమాదం.. పదిమంది మృతి
కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్పారైలో వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు 10మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొనికేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. -
అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..
సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్ సృష్టించే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాయ్ చౌధురి ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను. "వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్‌లో వెల్లడించారు రాయ్.స్పెషాల్టీ..కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం 'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్ డైయింగ్ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్‌కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్‌లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం. View this post on Instagram A post shared by Diya Roychowdhury (@vastrakathaxdiya) (చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్) -
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్‌గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
విజయ్‌కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
టీవీకే అధినేత విజయ్‌కి ఎన్నికల ముందు ఊహించని షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకముందే టీవీకే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.ఎడప్పాడీ నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ నియామాల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌పై పదిమంది ప్రపోజర్ల సంతకాలు ఉండాలి. అయితే టీవీకే తరుపున పోటీ చేస్తున్న అరుణ్ కుమార్ అనే అభ్యర్థి నామినేషన్ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉండడంతో పత్రాల్ని రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా అతనికి ప్రత్యామ్నయంగా నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి నిత్య నామినేషన్ పత్రాలు కూడా ఏడుగురు అభ్యర్థుల సంతకాలు ఉండడంతో రిజెక్ట్ అయ్యింది.అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏఐడీఏంకే అధ్యక్షుడు కెె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. అయికే ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్ ప్రస్తుతం అదృశ్యం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరి నామినేషన్ రిజెక్ట్ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా దీంతో ఆయనను ఏవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
న్యాయం వైపు నిలబడి.. హ్యాట్సాఫ్ కానిస్టేబుల్
చెన్నై: నిన్న (సోమవారం) సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు చట్టం ముందు నిలబడడానికి కారణం ఒక లేడీ కానిస్టేబుల్ అవునండీ నిజం. బాధితులకు న్యాయం జరగడం కోసం తన సొంత డిపార్ట్మెంట్ను సైతం ఎదురించి సత్వం వైపు నిలబడడం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది.సాధారణంగా పోలీస్ స్టేషన్లలో జరిగిన ఏదైనా నేరాలు జరిగితే వాటిని బహిర్గతం చేయడానికి వారు ఆసక్తి చూపరు. అయితే హెడ్‌కానిస్టేబుల్ రేవతి మాత్రం ఇందుకు విభిన్నంగా వ్యవహరించింది. బాధితుల పక్షాన నిలబడడానికి తన సొంత డిపార్ట్‌మెంట్‌నే ఎదురించింది. ఆ రోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనను మేజిస్ట్రేట్ ముందు నిర్భయంగా వివరించింది.బాధితులు జయరాజ్, బెన్నిక్స్‌లను పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎంతో దారుణంగా హింసించారని మేజిస్ట్రేట్ ముందు ఆమె వివరించింది. పోలీసులు ఆ తండ్రీ కొడుకులను రాత్రంతా తీవ్రంగా కొట్టారని, లాఠీలు మరియు టేబుళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. దీంతో ఆమె సాక్షం ద్వారానే ఆ రక్తపు మరకలున్న వస్తువులను ఫోరెన్సిక్ ఆధారాలుగా సేకరించడం సాధ్యమైంది.అయితే ఈ సమయంలో తన తోటి పోలీసులు మరియు ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి, భయం ఉన్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి, మేజిస్ట్రేట్ విచారణకు వెళ్ళినప్పుడు అక్కడి పోలీసులు సహకరించలేదు, కానీ ఆమె ఇచ్చిన ధైర్యంతోనే విచారణ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలోనే తోటి పోలీసుల నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేయడంతో, అప్పట్లో ప్రభుత్వం ఆమెతో పాటు తన కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించింది.ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ ఆమె ఆ ఆప్షన్ తీసుకోలేదు కేవలం డ్యూటీ మాత్రమే కాదు… తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించడమే ప్రథమ కర్తవ్యంగా భావించింది. దీంతో ఎట్టకేలకు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో కానిస్టేబుల్ రేవతి ఎంతో కీలకపాత్ర పోషించింది. -
సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణ శిక్ష..
-
మన అమెరికన్
స్టూడెంట్ లీడర్‌గా జాత్యహంకారంపై పోరాడిన రిని సంపత్‌కు సమస్యల మూలాలు తెలుసు. ఆ సమస్యలపై అలుపెరగని పోరాటం తెలుసు. ‘నేను వలస ప్రజల బిడ్డను’ అని గర్వంగా చెప్పుకునే రినికి ఆత్మగౌరవ నినాదం తెలుసు. తమిళనాడులోని తేనిలో జన్మించిన 31 ఏళ్ల రిని సంపత్, వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా నిలిచారు.ఏడు సంవత్సరాల వయసులో రిని సంపత్ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. ‘యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యుఎస్సి)లో చదువుకున్న రిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. యుఎస్సీ అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. వారి హక్కుల కోసం నినదించారు. జాత్యహంకారాన్ని, వేధింపులను వ్యతిరేకించారు.వారే నిజమైన అర్హులుడెమొక్రటిక్ పార్టీకి చెందిన రిని సంపత్ ప్రభుత్వ కాంట్రాక్టర్. ప్రాథమిక అవసరాలు తీర్చండి’ ‘ఒక కొత్త డీసీ’ నినాదాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘నగరవాసులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం, వినాశకరమైన మురుగునీరు పొంగి పొర్లడాన్ని ఆపడం, గుంతలను పూడ్చడం, ధరలను తగ్గించడం అనేవి నా ప్రాధాన్యత అంశాలు. వాషింగ్టన్ డీసీని అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారే మేయర్ పదవికి అర్హులు’ అని తన ప్రచార వెబ్సైట్లో పేర్కొన్నారు రిని. వాషింగ్టన్ డీసీని ప్రధానంగా డెమొక్రాట్లు పాలిస్తున్నారు. 1975లో మేయర్ పదవికి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి రిపబ్లికన్ మేయర్‌గా ఎవరూ ఎంపిక కాలేదు.ఇదే సరిౖయెన సమయంతాను రాజకీయనాయకురాలు కాదని నొక్కి చెబుతుంటారు రిని. ‘నేను సంప్రదాయ రాజకీయ నాయకురాలిని కాదు. నేను ఒక ఫెడరల్ కాంట్రాక్టర్‌ని. నా వృత్తిజీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలలో, పౌర సేవలను మెరుగుపర్చడంలో గడిపాను.మనకు ఒక కొత్త వ్యక్తి కావాలినగరానికి సేవలను అందించడంపై అవిశ్రాంతంగా దృష్టి సారించే వ్యక్తికి ఇది సరిౖయెన సమయం. అందుకే నేను మేయర్ రేస్‌లో ఉన్నాను. మనం కలిసి పనిచేసి, మెరుగైన డీసీని నిర్మించగలమని నమ్ముతున్నాను’ అని ప్రజలను ఉద్దేశించి అంటున్నారు రిని.విజయానికి స్పష్టమైన మార్గంఫిబ్రవరి ఆరంభంలో వచ్చిన మంచుతుఫాన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. వికలాంగులు ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయారు. నిత్యావసర సేవలు అందలేదు. ఉద్యోగులు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. తన ప్రచారయాత్రలో ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు రిని.‘విజయం సాధించడానికి మనకు స్పష్టమైన మార్గం ఉంది. కేవలం నాలుగు వారాల్లోనే డీసీ చరిత్రలో మేయర్ బ్యాలెట్‌కు స్థానం సంపాదించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచాము. తక్కువ వనరులతో, ప్రజల మద్దతుతో సాగిన ప్రచారం ఇంతటి విజయాన్ని సాధించింది. నగరవ్యాప్తంగా ప్రతి ఓటరును చేరుకోవడానికి అవసరమైన వనరులు మనకు సమకూరి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించవచ్చు’ అంటున్నారు రిని సంపత్. చారిత్రక మైలురాయిమేయర్ ప్రైమరీ ఎన్నిక జూన్ 16న జరగనుండగా, సాధారణ ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. అమెరికా రాజకీయాలలో ప్రాతినిధ్యానికి సంబంధించి రిని ప్రచారం చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఉన్నత స్థాయికి ఎంపికైన పదవులలో భారతీయ అమెరికన్లకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. వారి రాజకీయ భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో మేయర్ బరిలో రిని సంపత్ నిలవడం విశేషంగా మారింది. మేయర్‌గా ఎన్నికైతే ఆమె డీసీ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్ అవుతారు. చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లినా తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు రిని. ‘మా తాతగారు ఎప్పుడూ నాకు చోదకశక్తిగా, స్ఫూర్తితేజంగా ఉన్నారు’ అంటారు.ఆ శక్తి ఏమిటో నాకు తెలుసువాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి బ్యాలెట్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది. అమెరికా కలను సాకారం చేసుకోవాలనే తపనతో తల్లిదండ్రులతో కలిసి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చాను. వలసదారుల కుమార్తెగా, కఠోర శ్రమ, పట్టుదలల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఆ విలువలని నగర పాలక సంస్థ(సిటీ హాల్)లోకి తీసుకు రావడానికి, వాషింగ్టన్ వాసులందరికీ సత్ఫలితాలు అందించడానికి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. డీసీ మేయర్ పదవికి నన్ను బ్యాలెట్లో చేర్చడానికి నా పిటిషన్‌పై 4,500 మందికి పైగా సంతకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు దక్షిణాసియా ప్రజల సహకారం ఎంతో ఉంది. కానీ ప్రభుత్వంలో వారికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండటం విచారకరం.– రిని సంపత్, మేయర్ అభ్యర్థి, వాషింగ్టన్ డీసీ -
కోర్టు సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష
మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసుస్టేషన్లో తండ్రి కొడుకును చిత్రహింసలకు గురి చేసి చంపిన కేసులో తొమ్మిదిమంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ రోజు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్ మరియు బెన్నిక్స్ కస్టోడియల్ మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ లతో పాటు మరో ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లకు ఉరిశిక్ష విధించారు.ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కేసు అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం దారుణమని తెలిపింది. దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. సమగ్ర విచారణ అనంతరం నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.కేసు నేపథ్యం2020 జూన్ నెలలో లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి షాపు తెరిచి ఉంచారనే కారణంతో జయరాం, అతని కూమారుడు బెన్నిక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాత్రంతా లాకప్‌లో చిత్రహింసలకు గురిచేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఇద్దరికి తీవ్రగాయాలై మరణించారు. సీబీఐ విచారణలో ఆ రాత్రంతా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు అత్యంత క్రూరంగా శారీరక మరియు లైంగిక హింసకు గురిచేశారని తేలింది. అంతేకాకుండా పోలీసుల దెబ్బలకు బాధితులకు రక్తంవస్తే బాధితులే స్వయంగా ఆ రక్తపు మరకలను తుడిచివేసేలా పోలీసులు వారిని బలవంతం చేశారని విచారణలో వెల్లడైంది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
ఒకవైపు నామినేషన్లు మరోవైపు ప్రచారాలు
-
తమిళనాట ఎన్నికల హీట్.. విజయ్‌కే నా ఓటు అంటోన్న హీరోయిన్..!
ఈ మండు వేసవిలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. సినిమా రంగంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. సినీ తారలు తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి వాణిభోజన్ తన మద్దతు టీవీకే ఛీఫ్ విజయ్‌కే అని ప్రకటించారు. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఓమై కడవుల్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత మహాన్, మిరన్ వంటి పలు చిత్రాల్లో వాణి భోజన్ నటించారు. కొన్ని వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హీరోయిన్గా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. కాగా ఇటీవల తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాణి భోజన్ పలు విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను నటుడు విజయ్‌కు వీరాభిమానినని.. ఆయనకు జంటగా నటించాలన్న కోరిక ఉందని తెలిపింది. అయితే విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఆ కోరిక నెరవేరే అవకాశం లేదని పేర్కొంది. అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాని వెల్లడించింది.విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషమని అన్నారు. మీకు ఆ పార్టీలో చేరే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారని, అయితే దాని గురించి తరువాత చెబుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్‌కే నని తెలిపింది. కాగా ప్రస్తుతం తాను ఈ భామ ప్రస్తుతం వలై అనే చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తున్నట్లు వెల్లడించారు. -
మేనిఫెస్టో ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్
-
తమిళనాడులో విజయ్ దూకుడు
-
164 స్థానాల్లో డీఎంకే పోటీ
చెన్నై: తమిళనాట అధికార డీఎంకే పార్టీ వచ్చే నెలలో జరగబోయే శాసనసభ ఎన్ని కల్లో 164 స్థానాల నుంచి బరిలో దిగనుంది. తన సారథ్యంలోని లౌకిక ప్రగతిశీల కూటమి(ఎస్పీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, డీఎండీకే తది తర 11 పార్టీలకు డీఎంకే మొత్తంగా 70 సీట్లను కేటాయించింది. కూటమి పార్టీల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 28 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని పార్టీ కార్యాల యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. నిదానంగా చర్చలు జరపడంతో నష్టంకంటే లాభమే ఒనగూరింది. మిత్ర పక్షాలన్నింటినీ సంతృప్తిపరుస్తూ సీట్లు కేటాయించాం.ఎస్పీఏ కూటమిలో ఐక్యతకు ఇది నిదర్శనం. ఎన్నికల తర్వాత డీఎంకే 2.0 ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అభ్యర్థులంతా గెలుపు గుర్రాలే’’ అని అన్నారు. పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదలచేస్తానని ఆయన వెల్లడించారు. వైకో సారథ్యంలోని ఎండీఎంకేలోని కొందరు అభ్యర్థులు సహా 11 మంది కూటమి పార్టీల అభ్యర్థులు ఈసారి డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతుండటం విశేషం. దీంతో డీఎంకే పరోక్షంగా 175 స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్లయింది. సీట్ల సర్దుబాటు తర్వాత పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్కోడె, శివకాశి, కరైకుడి సహా 28 స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి నిలబడుతున్నారు. కూటమి న్యాయం పాటిస్తూ... దివంగత తమిళనటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీకి 10 సీట్లు కేటాయించారు.దాదాపు మంత్రులందరికీ మళ్లీ చాన్స్33 మంది కేబినెట్ మంత్రుల్లో ము గ్గురు మినహా మిగతా వారందరికీ సీఎం స్టాలిన్ మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకూ మరోసారి పోటీచేసే అవకాశం దక్కింది. ఈసారి వైద్యులు, ఇంజనీర్లు, పీహెచ్డీ పట్టాదారులు సహా 60 మందికిపైగా కొత్తవాళ్లను డీఎంకే రంగంలోకి దింపుతోంది. డీఎంకే పార్టీ తరఫున ఈసారి 18 మంది మహిళా నేతలూ ఎన్నికల రణక్షేత్రంలోకి దూసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగోసారి కొలథూర్ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మరోసారి చెపాక్–త్రిప్లికేన్ నుంచి పోటీచేస్తున్నారు. -
తొలి ట్రాన్స్‌జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!
కుటుంబం, యావత్తు సమాజం తన పుట్టుకను అంగీకరించలేదు. అడగడుగున వివక్ష, హేళనలు అవమానాలు. వాటన్నింటిని తన పని, గుర్తింపుతోనే తగిన సమాధానమివ్వగలనని భావించి నిశబ్దంగా పట్లుదలతో సాగింది. ఇవాళ ఆ నమ్మకమే గెలిచి..ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టింది. ట్రాన్స్‌జెండర్ విలక్షణమైన మనిషి, విభిన్నంకాదు అని అందరు అంగీకరించేలా తన గెలుపుతో చాటిచెప్పింది. ఆ మహిళే డాక్టర్ ఎన్ జెన్సీ.తమిళనాడులో పీహెచ్డీ పట్టా పొందిన తొలి ట్రాన్స్ జెండర్. ఆ తర్వాత ఆమె లయోలా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందారు. యూజీ,పీజీలలో స్వర్ణ పతక విజేత అయిన ఆమె ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఉచిత విద్య, జీవనోపాధి సహాయం అందించడంతో తోడ్పడుతున్నారు. తమిళనాడులోని తిరుత్తని సమీపంలో ఉన్న ఆర్కే పేట అనే చిన్నగ్రామంలో జెన్సీ బాల్యం సాగింది. అంత చిన్న వయసులోనే కఠోర సత్యం తెలుసుకుంది తనను ఈ ప్రపంచం మనుగడ సాగించనివ్వదని. తల్లిదండ్రులు మద్దతు లేకుండా సాగుతున్న ఆమెకు గుర్తింపు కోసం పోరాటం ఆ క్షణం నుంచి మొదలైంది. తనకు రక్షణగా ఉండేది ఏది అని అన్వేషించడం మొదలుపెట్టింది. అనుక్షణం వెంటాడుత్ను వివక్షకు విరుగుడు విద్య మాత్రమే అని అర్థం చేసుకున్నా అని ఓ ఇంటర్వూలో జెన్సీ స్వయంగా చెప్పింది. అది మొదలు ఎప్పుడు గుర్తింపు పొందేలానే చదవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అలా వలక్కనంపూడిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యలో కూడా ప్రథమ స్థానంలో ఉండేది. ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు నుంచి తన ప్రతిభతో గుర్తింపు, గౌరవం దక్కించుకునేలా ఆహర్నిశలు కష్టపడింది. ఆ పరుగు తిరుత్తానిలోని అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చేరి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువు వరకు కొనసాగించిది. అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఆమె డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మాస్టర్స్, ఎంఫిల్ చేసింది. ఆ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ ఆమెదే కావడం విశేషం. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కళాశాల నుంచి ఆంగ్లంలో పిహెచ్డి పూర్తి చేసి, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందింది. అలా ఆమె తమిళనాడు డాక్టరేట్ పొది అసిస్టెంట్ ప్రొఫెస్ర్గా నియామకం పొందిన తొలి ట్రాన్స్ జెండ్ మహిళగా నిలిచింది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం బహిరంగంగా ఆమెను అభినందించారు. అయితే జెన్సీ ఈ క్రెడిట్‌ని తన ట్రాన్ కమ్యూనిటికీ చెందనదని అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నానని అన్నారామె. ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా చూస్తూ ప్రతి ఏడాది వారికోసం ఏడు నుంచి 12 సీట్లు రిజర్వ్ చేసేలా కాలేజీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్నారు. సమాజ పక్షపాత వైఖరికి ఓటమితో తలవంచకుండా.. విద్యతో ధీటుగా సమాధానమిచ్చి ఆమోదించేలా చేసుకోవాలని జెన్సీ తన కథ ద్వారా చక్కటి సందేశం ఇచ్చింది కదూ..!.(చదవండి: దంతాలతో కళాఖండాలు..! ఆమె టాలెట్కి ఫిదా అవ్వాల్సిందే) -
రయ్ రయ్..నాలుగు చక్రాల సైకిలోయ్!
తమిళనాడు వెల్లూరులోని వాణివిద్యాలయంలో పదవతరగతి చదువుతున్న శబరివాసన్ నాలుగు చక్రాల సైకిల్ తయారుచేసి ‘ఆహా!’ అనిపించుకున్నాడు. వృథాగా పడి ఉన్న వస్తువులతో ఈ నాలుగు చక్రాల సైకిల్‌ను తయారుచేయడం విశేషం. ‘ఎవరి సలహాలు, సూచనలు తీసుకోకుండానే మా అబ్బాయి ఈ సైకిల్‌ను తయారుచేశాడు’ అని సంబరపడిపోతున్నాడు శబరివాసన్ తండ్రి కతిర్వేల్. ఆయన క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శబరివాసన్కు సైకిల్ నుంచి కారు వరకు రకరకాల వాహనాల గురించి ఆసక్తి. వాటిలో ఏ భాగాలు ఉంటాయి? అది ఎలా పనిచేస్తుంది?... మొదలైన వివరాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాలుగు చక్రాల సైకిల్ తయారుచేయడానికి కారణం అయింది.అందుబాటులో ఉన్న వస్తువులతోనే రకరకాల వాహనాలు తయారుచేసిన వ్యక్తుల వీడియోలు తరచుగా చూసేవాడు. ఆ సమయంలోనే తనకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, స్పేర్ ట్యూబ్‌లను సేకరించి నాలుగు చక్రాల సైకిల్‌ను తయారు చేశాడు. ఈ వాహనాన్ని తయారుచేయడానికి నెలరోజుల సమయం పట్టింది.‘నేను తయారుచేసిన నాలుగు చక్రాల సైకిల్‌ను చాలామంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త వాహనాలు తయారుచేస్తాను’ అని ధీమాగా అంటున్నాడు శబరివాసన్. (చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్..) -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..!
కళ్లు పొడుచుకున్నా కనిపించనంత చీకటి. దుర్భేద్యమైన కొండలు. దారంతా రాళ్ళూరప్పలు...అవన్నీ దాటాలి. 150 అడుగుల లోపలకు వెళ్లాలి. అక్కడో మనిషి ఉన్నాడు. ఒళ్లంతా దెబ్బలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. అతడిని బయటకు తీయాలి. ఆ ప్రాణం కాపాడాలి. ఇదేమీ సినిమా కథ కాదు. నిజజీవిత విజయ గాథ. పర్యాటకుడి ప్రాణలు కాపాడిన సాహస బృందంలో శ్రీకాకుళం జిల్లాలోని మెట్టూరు గ్రామానికి చెందిన మేజర్ కవిత ఉన్నారు....భయపడితే భయమే మిగులుతుంది. ఆ భయం మరింత భయపెడుతుంది. ఆ భయాన్ని కాలదన్ని ముందుకు వెళితే సాహసం అవుతుంది. విజయం సొంతం అవుతుంది. ప్రాణరక్షణ చేసే ఆపద్భాందవ శక్తి అవుతుంది.ఉసిమలై లోయలో...మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక వ్యక్తి లోయలోకి పడిపోతే ఆపసోపాలు పడి బయటకు తీస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఊసిమలై లోయలో ఉన్న నీడల్రాక్ వ్యూ పాయింట్ దగ్గర జరిగింది. ఈ నెల 19న ఈ వ్యూ పాయింట్ దగ్గర ఒక పర్యాటకుడు సెల్ఫీ దిగుతూ 150 అడుగుల లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయం వెల్లింగ్టన్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ (ఎంఆర్సీ)కు తెలియజేయడంతో ఇండియన్ ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 29 ఏళ్ల సిక్కోలు సివంగి మేజర్ డాక్టర్ వాసుపల్లి కవిత కీలక పాత్ర పోషించారు. ఆమెది వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు. రెస్క్యూ ఆపరేషన్పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అగ్నిమాపక అధికారులు, అటవీ అధికారులు, సహాయక బృందాలు సంయుక్తంగా సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ చీకటి పడడంతో అంతా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్మీ బృందం లెఫ్టినెంట్ కల్నల్ చందన్ మోహతా నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.రాత్రి 9.15 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో చిమ్మ చీకటి అలుముకుని ఉంది. కఠినమైన భూభాగం, ఎత్తైన ప్రదేశాలు, లోయలను దాటుకుంటూ 150 అడుగుల లోయకు చేరుకున్నారు. టార్చీల వెలుగులో బాధితుడిని గుర్తించారు. అప్పటికే ఛాతీ, చేయి, వీపు, తుంటి ఎముకలు విరిగి కదలలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించారు. ప్రాణాలు కాపాడారు...టార్చ్‌లైట్ వెలుగులో క్షతగాత్రునికి మేజర్ డాక్టర్ కవిత ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అక్కడే స్ట్రెచర్‌ను ఏర్పాటు చేశారు. లోయ పక్కన ఉన్న రెండు పర్వతాల మధ్య 70 మీటర్ల టైరోలియన్ ట్రావర్స్ లైవ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. గురువారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించిన ఈ ఆపరేషన్ వేకువజాము 3.30 గంటల వరకు సాగింది. ఈ ఆపరేషన్‌లో కవిత కీలక పాత్ర పోషించారు. గత సంవత్సరం బ్రహ్మపుత్ర నదిలో 1,040 కిలోమీటర్లు రాఫ్టింగ్ యాత్ర పూర్తి చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు.– కె. చలపతిరావు, వజ్రపు కొత్తూరు, రూరల్ సాక్షి, శ్రీకాకుళం (చదవండి: పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!) -
Tamil Nadu: ఏఐఏడీఎంకే తొలి జాబితా.. ‘ఎడ్పాడి’ పళనిస్వామిదే!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎన్డీఏ కూటమి సారథిగా ఉన్న ఏఐఏడీఎంకే తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బుధవారం 23 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసి, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో పైచేయి సాధించే వ్యూహాన్ని పళనిస్వామి అమలు చేస్తున్నారు.సొంత గడ్డపైనే పోటీపార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్) తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ‘ఎడ్పాడి’ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. తన కంచుకోటను కాపాడుకుంటూనే, రాష్ట్రవ్యాప్తంగా కూటమిని విజయపథంలో నడిపించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.సీనియర్లకే పెద్దపీటతొలి జాబితాలో పార్టీలోని హేమాహేమీలకు ఏఐఏడీఎంకే పెద్దపీట వేసింది. సీనియర్ నాయకులు కేపీ మునుసామి, దిండిగల్ సి. శ్రీనివాసన్, నథమ్ ఆర్. విశ్వనాథన్ వంటి కీలక నేతలు తమ పాత స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బలమైన నేతలుగా పేరున్న ఎస్పీ వేలుమణి (తోండముత్తూరు), పి. తంగమణి (కుమారపాళయం) నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నారు.రేసులో ముందంజరాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన తొలి పార్టీగా ఏఐఏడీఎంకే నిలిచింది. ఇప్పటికే సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' (ఎన్టీకే) అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ప్రధాన కూటముల్లో మాత్రం ఏఐఏడీఎంకేనే అందరికంటే ముందుగా అడుగు వేసింది. కేవలం 23 స్థానాలకే ప్రస్తుతం జాబితా పరిమితమైనా, కీలక నేతలందరినీ ముందే రంగంలోకి దించడం ద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏఐఏడీఎంకే, ఈ తొలి జాబితా ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்றக் கழக முதற்கட்ட வேட்பாளர்கள் பட்டியல்.- மாண்புமிகு கழகப் பொதுச்செயலாளர் புரட்சித் தமிழர் @EPSTamilNadu அவர்கள் அறிவிப்பு. #EPSfor2026#Vote4AIADMK pic.twitter.com/HVvrcUtDpt— AIADMK - SayYesToWomenSafety&AIADMK (@AIADMKOfficial) March 25, 2026 -
కమల్ మరో సంచలనం.. స్టాలిన్‌కు మద్దతుగా..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు బేషరతు మద్దతు ప్రకటించాలని కమల్ నిర్ణయించుకున్నారు.అందుకే ఈ నిర్ణయండీఎంకేతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాకపోవడమే కమల్ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీఎంకేకు చెందిన ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న ప్రతిపాదనను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అస్తిత్వమైన ‘టార్చ్ లైట్’ గుర్తును కాపాడుకోవడం, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయాలనేవి ఒక నిరంతర ప్రయాణం. ఎన్నికల ఫలితాలు ఒక భాగం మాత్రమే, అవే అంతిమ లక్ష్యం కాదు’ అని కమల్ వ్యాఖ్యానించారు.స్టాలిన్ కృతజ్ఞతలు.. ప్రచారానికి ఆహ్వానంకమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాష్ట్ర సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, కమల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ‘ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. ఈ నిర్ణయం నన్ను ఎంతగానో కదిలించింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆయన కమల్‌ను కోరారు.ద్రవిడ మోడల్ 2.0 లక్ష్యంగా..తమ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడాన్ని త్యాగంగా భావించడం లేదని, అదొక బాధ్యతని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రగతికి ‘ద్రవిడ మోడల్ 2.0’ ప్రభుత్వం అవసరమని, అందుకే డీఎంకే కూటమికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించామని ఆయన గుర్తు చేశారు. కాగా ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా, డీఎంకే కూటమి విజయానికి కీలకంగా మారడం ద్వారా కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదో వేచి చూడాల్సిందే! இது தியாகம் அல்ல; கடமை. சுய நலம் அல்ல; பொறுமை.@mkstalin @Udhaystalin @maiamofficial pic.twitter.com/V19889YYlg— Kamal Haasan (@ikamalhaasan) March 24, 2026 -
ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
చెన్నై: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు సభ్యులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. వీరితో పాటు మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.📍Salem, Tamil Nadu: A government bus traveling from Coimbatore to Salem lost control in the Ariyanur area and rammed into a bike and a tempo, resulting in a tragic accident that claimed 4 lives. Police are currently investigating the incident.pic.twitter.com/RwDAmRLc5F— Deadly Kalesh (@Deadlykalesh) March 20, 2026 -
‘నేను భోజనం చేస్తున్నాను.. ప్రస్తుతం పాయసం తింటున్నాను’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే.. ఐతే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులుంటాయి. ఈ రెండు పార్టీలు మినహా.. మరో పార్టీ పాగా వేసే అవకాశాలే ఉండవంటే.. అక్కడి పరిస్థితులను, ఓటర్ల విస్పష్ట తీర్పును అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న డీఎంకే.. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్‌ను కరుణానిధి అణచివేయడంతో అన్నాడీఎంకేగా చీలిపోయింది. ఒక్క మంత్రి పదవి విషయంలో కరుణానిధి మంకుపట్టు.. తమిళనాట మరో ద్రావిడ పార్టీ పుట్టుకకు కారణమైంది. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు ఎన్నికలపై ఇప్పుడు దేశమంతా దృష్టిసారించింది. ఒకప్పుడు తమిళగళాన్ని దేశానికి వినిపించేందుకు ఒక్క డీఎంకే పార్టీ ఉండేది. ద్రావిడ వాదంతో ఆ పార్టీ ముందుకు సాగేది. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ తోడవ్వడంతో... కరుణానిధి దూసుకుపోయారు. అయితే.. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. కరుణానిధి ఆయనను రాజకీయంగా సినిమాలపరంగా అణచివేయడం.. పార్టీ నుంచి బహిష్కరించినా.. పరోక్ష టార్చర్‌ను నిలిపివేయకపోవడం వంటి పరిణామాలు డీఎంకే చీలికకు దారితీశాయి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులు మారడమే కాకుండా.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రత్యర్థులపై కక్షసాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయి.ఎంజీఆర్ క్రేజ్.. అక్కసు వెళ్లగక్కిన కరుణానిధిఅది 1971.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. కరుణానిధికి ఇది రెండోసారి వరుస విజయం. రాజాజీ నేతృత్వంలోని కూటమి ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ సర్కారుకు డీఎంకే దన్నుగా నిలిచింది. నిజానికి అప్పటి డీఎంకే సారధి కరుణానిధే అయినప్పటికీ.. ఆ పార్టీ అభివృద్ధికి ఎంజీఆర్ ఎనలేని సేవ చేశారు. ఆయనకున్న ఫేమ్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పార్టీని విజయాల బాట పట్టించింది. ఆ తర్వాత.. పార్టీలో ఎంజీఆర్‌కు క్రమంగా పెరుగుతున్న ఆదరణను గుర్తించిన కరుణానిధి.. అణచివేత ధోరణిని ప్రారంభించారు. ఎంజీఆర్ తనకు ఆరోగ్యశాఖ కావాలని కోరుతూ.. మంత్రిపదవిని ఆశించారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ శ్రీలంకను సందర్శించడం డీఎంకేకు ససేమిరా నచ్చలేదు. ఆయన శ్రీలంకలో తమిళుల కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారు. ఈ పరిణామాలన్నీ.. డీఎంకేలో చీలిక వస్తుందనే సందేశాలకు దారితీశాయి.సినిమా వర్సెస్ రాజకీయం.. ఏదో ఒకటే కరుణానిధి మంత్రిపదవుల విషయంలో తన మంకుపట్టును వదల్లేదు. ఎంజీఆర్‌ను ఈ విషయంలో పక్కనబెట్టారు. ఆ సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఓ చిత్ర షూటింగ్లో ఉన్న ఎంజీఆర్.. స్వయంగా కరుణానిధికి ఫోన్ చేశారు. తనకు ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశమివ్వాలని కోరారు. అయితే.. నటనకు దూరమైతేనే మంత్రిగా ప్రజాసేవకు అవకాశమిస్తానని కరుణానిధి తేల్చిచెప్పారు. ఎందుకంటే.. అప్పటికే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్షన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించే పార్టీగా డీఎంకేకు పేరుంది. జోడుపదవులు తగదనేది కరుణానిధి ఆలోచన. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’అయినప్పటికీ ఆయన ఎంజీఆర్‌కు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ.. రాష్ట్ర చిన్నమొత్తాల పొదుపు పథకానికి చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కరుణానిధితో ఎంజీఆర్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. 1971 అక్టోబరులో ఎంజీఆర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే కరుణానిధి అమెరికా వెళ్లారు. అదే సమయంలో.. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి డిసెంబరు 3న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాంతో అమెరికా పర్యటనలో ఉన్న కరుణానిధి డిసెంబరు 5న ఆగమేఘాల మీద చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పరిణామాలకు సంబంధించి అప్పట్లో ’ద హిందూ‘ విలేకరి సత్య స్టూడియోలో షూటింగ్లో ఉన్న ఎంజీఆర్ స్పందన కోసం ఫోన్ చేశారు. ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన ఎంజీఆర్ అసిస్టెంట్ మహాలింగం.. విషయాన్ని ఎంజీఆర్‌కు చేరవేశారు. దానికి ఎంజీఆర్ స్పందిస్తూ.. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’ అని సమాధానమిచ్చారు. అప్పట్లో ఆ మాట పతాకశీర్షికలకెక్కింది.కరుణానిధిలో భయం పుట్టించిన ఎంజీఆర్?వేగంగా మారుతున్న పరిణామాలు కరుణానిధికి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో ఆయన ఎంజీఆర్‌కు పోటీగా తన కుమారుడు ఎంకే ముత్తును వెండితెరకు పరిచయం చేశారు. ఎంజీఆర్‌కు సినిమా అవకాశాలు రాకుండా తెరవెనక మంత్రాంగం నెరిపారు. కరుణానిధి ఆదేశాలతో.. పోలీసులు కూడా ఎంజీఆర్ అభిమాన సంఘాలపై అణచివేత ధోరణిని కొనసాగించారు. ఎంకే ముత్తు అభిమాన సంఘాలు పెరిగేందుకు చర్యలు ప్రారంభించారు. ఎంజీఆర్‌ను అభిమానించే 700 ఫ్యాన్స్ క్లబ్ నేతలపై ఒత్తిడి మొదలైంది. ఈ పరిణామాలన్నీ ఎంజీఆర్‌కు మరింత చిరాకు పుట్టించాయి. దాంతో.. ఎంజీఆర్ వేరుకుంపటి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన కరుణానిధి ఓ అడుగు వెనక్కి తగ్గారు. ఎంకే ముత్తు ఫ్యాన్స్ క్లబ్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఒక్క ఆదేశంతో డీఎంకేలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి భయపడ్డారనే ప్రతికూల సందేశం దేశంలో వ్యాపించింది.పురుడు పోసుకున్న అన్నాడీఎంకేఎంజీఆర్ అంతటితో ఆగలేదు. డీఎంకే పరిపాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అవినీతి పాతుకుపోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మద్యపానం కారణంగా ప్రాణాలు పోతున్నాయంటూ సమాజానికి చాటిచెప్పారు. నిజానికి ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల ఆయనకు జరిగిన నష్టం లేదు కానీ.. డీఎంకే పార్టీ ఎంతగానో ప్రజాదరణను కోల్పోవడానికి కారణమైంది. తనను పార్టీ నుంచి బహిష్కరించిన ఏడాది కాలంలోనే.. అంటే.. 1972 అక్టోబరు 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. 1986లో ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ పార్టీకి విరాళంగా చెన్నైలోని రాయపేటలో ఉన్న తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా తమిళ రాజకీయాలు కొనసాగాయి. ఎంజీఆర్ వారసురాలిగా 1989 నుంచి 2016 వరకు అన్నాడీఎంకేను జయలలిత నడిపించారు. -
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’ పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.బంపర్ ఆఫర్.. కానీ మెలిక!ఈ పొత్తులో భాగంగా విజయ్‌కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్‌కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్‌తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.విజయ్ క్యాంపులో అంతర్మథనంమరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. -
సిలిండర్లు దాచారో.. జైలుకే!
మధురై: ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని, అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై తమిళనాడు ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు నడుం బిగించింది. మధురైలో భారీ ఎత్తున వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు సివిల్ సప్లైస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిపై అత్యంత కఠినమైన ‘ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్’ (గుండా చట్టం) కింద కేసు నమోదు చేశారు. సిలిండర్ల నిల్వపై రాష్ట్రంలో ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు మధురై సమీపంలోని కోవిల్పాపాకుడి ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పళని అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన 100 సబ్సిడీ సిలిండర్లు, 109 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆనందం నగర్‌లోని మదన్ కుమార్ (27) నివాసంలో సోదాలు నిర్వహించి, మరో 189 సిలిండర్లను గుర్తించారు. మొత్తం కలిపి 398 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పి. మురళి మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టెర్మినల్స్‌లో 7,000 పైగా పెట్రోల్ బంకులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, కనీసం మూడు వారాలకు సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ బంకుల్లో నిల్వలు అయిపోవడం వల్ల ఇటువంటి వదంతులు వ్యాపించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తమిళనాడు వణిగర్ సంఘంగళిల్ పేరమైపు అధ్యక్షుడు విక్రమరాజా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఏజెంట్లు ఒక్కో సిలిండర్‌ను రూ. 4,000 వరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల సామాన్యులకు ఆహార పదార్థాల లభ్యత భారంగా మారుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం -
టీవీకే చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ను మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మంగళవారం సమన్లు పంపారు.విజయ్ను సీబీఐ జనవరిలో రెండు సార్లు విచారించింది. మరోసారి మార్చి 9న హాజరుకావాలని చెప్పింది. అయితే, 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ విచారణ చెన్నైలో లేదా తమిళనాడులోని ఇతర ఏ కార్యాలయంలోనైనా నిర్వహించాలని విజయ్ కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే, సీబీఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీలో మార్చి 15న హాజరుకావాలని సూచించింది.కరూర్ నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా బాలాజీ స్పందిస్తూ.. మార్చి 17న సీబీఐ ముందు హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.కాగా, 2025 సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో సీబీఐ నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేలా సీనియర్ అధికారిని నియమించాలని సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశించింది.న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగితేనే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. -
తమిళనాడులో బీజేపీ బిహార్ ఫార్ములా..: స్టాలిన్
చెన్నై: తమిళనాడులో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఆయన గుర్తు చేశారు.తమిళనాడులోని సిరుగనూరులో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘తమిళనాడులో గెలవడానికి అన్నాడీఎంకేను బీజేపీ క్రమంగా నాశనం చేస్తోంది. తమిళనాడులో బీజేపీ బిహార్ ఫార్ములాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. బిహార్‌లో నితీశ్ కుమార్‌ను పక్కనపెట్టేసి తమ పార్టీకి చెందిన నేతను సీఎం చేయడానికి ఏర్పాటు చేసుకుంది. బిహార్‌లో ఎప్పుడూ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి లేరు. నితీశ్‌ను ముందు నిలబెట్టి చూపిస్తూ ఎన్నికలు గెలిచిన తరువాత ఇప్పుడు ఆయనను పక్కకు నెట్టారు. ముఖ్యమంత్రి కావాలన్న స్వార్థంతో పళనిస్వామి బీజేపీకి బానిసగా మారారు.ఈ ఎన్నికలు తమిళనాడుకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్నాయి. ఢిల్లీ టీమ్ గెలుస్తుందా? తమిళనాడు టీమ్ గెలుస్తుందా? అన్న అంశంపై ఆధారపడే 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ కుతంత్రాలు తమిళనాడులో పనిచేయవు. ఇక్కడ మేమే ఉంటాం, మా నేలపై గెలుపు మాదే, గెలిచేది మేమే. మీరు పల్టీలు కొట్టినా, ఏ ముసుగు వేసినా, ఏ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించినా, తమిళనాడు ఎప్పటికీ మీకు లొంగదు. నేను ఉన్నంత కాలం, నా పార్టీ పనిచేస్తున్నంత కాలం బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రావడం అసాధ్యం’ అని స్టాలిన్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం‘ -
ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!
తమిళనాడులో కాలానుగుణ నది నాగనది. గత 20 ఏళ్లుగా ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది. చక్కగా నీటితో కళకళలాడే నది కాస్తా..బీడు వారిపోయింది. ఈ నదే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఆధారం. అలాంటి నదికి నారీ శక్తి ప్రాణం పోసి 365 రోజులు నీటితో పారేలా చేస్తోంది. అదెలా ఈ మహిళామణులకు సాధ్యమైందో తెలుసుకుందామా..!.సరిగ్గా ఆ టైంలోనే గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికతతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో నీటి కొరత నిర్వహణలో భాగంగా నాగనది నది పునరుజ్జీవన పనిని అమలు చేసే నిమిత్తం 2014లో వెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్వచ్ఛంద సేవకులతో సహా సాంకేతిక నిపుణుల బృందం కదిలివచ్చింది. ఈ నదిని తిరిగి పునరుజ్జీవింప చేయాలంటే బావులు, బండరాళ్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలన్సి అవసరం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన నదులను పునరుద్ధరించేందుకు దాదాపు 20 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త దావానలం ఆ చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద స్వచ్ఛంద సేవకులుగా ఈ పనుల్ల పాలుపంచుకునేవాళ్ల సంఖ్య అనుహ్యంగా 40 వేలకు పైగా చేరింది. వారంతా మహిళామణులే కావడం విశేషం. ఈ మహిళా స్వచ్ఛంద సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్గదర్శకత్వంలో బావులు తవ్వడం, సిమెంట్ రింగులు నిర్మించడం వంటి వాటితో అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా భూగర్భజల మట్టాలు ఒక మీటర్ నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగాయి. దెబ్బతో నదికి తిరిగి జీవం వచ్చినట్లైంది. ఇదంతా కేవలం మహిళా శ్రామిక శక్తి వల్ల సాధ్యం కావడం విశేషం. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన వందవ 'మన్ కీ బాత్' ఎపిసోడ్లో చెప్పి..ఆ నారీ శక్తి జట్టు కృషిని ప్రశంసించారు. ఒకరకంగా సమాజం కోసం అందరూ నడుబిగించాలని చెప్పడమే కాదు..ఐక్యతను సైతం చాటి చెప్పింది ఈ నారీ శక్తి. మహిళ తలుచుకుంటే భూమిని స్యశ్యామలంగా ఉంచగలరు. అలాగే ప్రకృతి సైతం పులకరించిపోయేలా అందంగా అపురూపంగా మార్చగలరు. అలాంటి మహిళామణులకు, మహిళా శక్తికి సదా జోహార్లు అని కీర్తిద్దాం, గౌరవిద్దాం. కేవలం విమెన్ డే ఒక రోజున మాత్రమే కాదు..ప్రతి సందర్భంలోనూ అవకాశంలోనూ మహిళలను పురుషులతో సమానంగా చూస్తే చాలు. అంతకుమించి ఇంకేమి ఆశించరు అని గుర్తిస్తే చాలు కదూ..!. View this post on Instagram A post shared by Art of Living (@artofliving) (చదవండి: చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..! టెక్ ఉద్యోగం వద్దనడానికి కారణం అదే..) -
త్వరలో చర్లపల్లి-నాగర్‌కోయల్ అమృత్ భారత్.. ప్రత్యేకత ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మీదుగా మరో అమృత్‌భారత్ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్‌ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్‌కోయల్ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్‌భారత్ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్‌కోయల్ అమృత్‌భారత్ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ మీదుగా రెండు అమృత్‌భారత్ రైళ్లు, వరంగల్ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్‌భారత్, హైదరాబాద్‌కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చర్లపల్లి–ముజఫర్‌పూర్ జంక్షన్(బిహార్) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.కాగా, హైదరాబాద్–నాగర్‌కోయిల్ అమృత్ భారత్ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు. -
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. సెల్వంకు కండువా కప్పిన స్టాలిన్
-
తమిళనాట సంచలనం.. డీఎంకేలో చేరిన మాజీ సీఎం
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐడిఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పన్నీరు సెల్వానికి ఆయన గతంలో పోటీ చేసిన స్థానం నుంచే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని సమాచారం.పన్నీరు సెల్వం దివంగత నేత ఆ రాష్ట్ర మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడు. జయలలితపై అనర్హత వేటు పడిన సందర్భంతో పాటు ఆమె మరణాంతరం తమిళనాడుకు సీఎంగా వ్యవహరించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో 2022లో ఆయన ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా కొద్దిరోజుల క్రితమే దివంగత నేత ఆరాష్ట్ర మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. కాగా తాజాగా జయలలిత వీర విధేయుడిని అని చెప్పుకునే పన్నీరు సెల్వం డీఎంకేలో చేరారు. దీంతో తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. -
తమిళనాడులో సంచలనం.. శశికళ కొత్తపార్టీ
చైన్నై: తమిళనాడులో ఎన్నికల వేళ మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నానని శశికళ ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించింది. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని శశికళ తెలిపింది. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంది.అయితే ఈ రోజు ఉధయం (మంగళవారం) దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శశికళ.. త్వరలోనే ఒక శుభవార్త వింటారని బహిరంగంగా ప్రకటించారు. దీంతో రేపోమాపో శశికళ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ, కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు సర్వత్రా వినిపించాయి. ఇంతలోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.కాగా శశికళ ,జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇదివరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. -
'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు
హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.స్పందించిన త్రిష..'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.అసలేం జరిగిందంటే..అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. -
1600 BC... ఈజిప్టు- తమిళ్ ట్రేడ్..!
భారత ప్రాచీన నాగరికత కాలంలో ఈజిప్టుతో జరిపిన వ్యాపార సంబంధాల గురించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తమిళనాడుకు చెందిన ఓ వాణిజ్య యాత్రికుడికి సంబంధించిన పేరు అక్కడి పిరమిడ్స్‌లో చెక్కబడింది. అంతేకాకుండా మరికొన్ని చారిత్రక సంబంధిత విషయాలు తెలిశాయి.ప్రపంచంలోని అతికోద్ది పురాతన నాగరికలో భారత్ ఒకటిగా భావిస్తారు. సింధూ కాలం నుంచే మన దేశ నాగరికత ప్రపంచంలోని వివిధ నాగరికతలతో వాణిజ్యం ఉండేదని చరిత్రకారులు భావిస్తారు. తాజాగా ఆ వాదనకు మరింత బలం చేకూర్చేలా కీలక ఆదారాలు ఈజిప్టి పిరమిడ్స్( రాజసమాధుల్లో) లభ్యమయ్యాయి. అందులో 16 BC కి చెందిన వాణిజ్య వేత్త "సికాయి కొట్రాన్" పేరు చెక్కబడింది. వాటితో పాటు తమిళ తమిళ-బ్రహ్మీ శాసనాలు, ఐదు వేర్వేరు పిరమిడ్లలో ‘సికాయి కొట్రాన్’ అనే తమిళ వాణిజ్యవేత్త పేరు ఎనిమిది సార్లు చెక్కి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను స్విట్జర్లాండ్‌లోని లౌసాన్ యూనివర్సిలీ ప్రొఫెసర్ ఇంగో స్ట్రౌచ్ వెల్లడించారు. ఇక్కడి పిరమిడ్లలోని ఆరు రాతి సమాధుల్లో తమిళ బ్రహ్మీ, ఆరు పాకృత భాషల్లో సుమారు 30 శాసనాలను వారు గుర్తించినట్లు తెలిపారు. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ తమిళ ఎపిగ్రఫీ కాన్ఫరెన్స్‌లో వారు తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అయితే దీనిపై తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు ఆనందం వ్యక్తం చేశారు. " రోమన్ ఈజిప్టు కాలంలోనే (క్రీ.శ. 1 నుండి 3వ శతాబ్దం మధ్య) తమిళులు కేవలం వర్తకానికే పరిమితం కాకుండా, అక్కడ నివసించారని మరియు రాజ సమాధులపై తమ ముద్ర వేశారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు.ఈ అద్భుతమైన ఆవిష్కరణ తమిళ ప్రజలు గర్వంచదగ్గదని ఆ కాలంలోనే వారు సముద్రాలు దాటి ప్రపంచ సంస్కృతులపై తమ ముద్ర వేసారని ప్రపంచానికి చాటిచెబుతోందన్నారు. -
ఉత్తరాదిపై పన్నీర్‌సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాట మరోమారు భాషా వివాదం రాజుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కె పన్నీర్‌సెల్వం భాషా వివాదాన్ని తట్టి లేపారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి వలస వచ్చే కార్మికులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఉత్తరాది వారికి కేవలం హిందీ మాత్రమే తెలియడం వల్ల వారికి తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, అందుకే వారు తమిళనాడుకు వచ్చి టేబుళ్లు శుభ్రం చేయడం, నిర్మాణ రంగంలో పని చేయడం లేదా పానీపూరీ అమ్ముకోవడం వంటి పనులు చేసుకుంటున్నారని పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్విభాషా విధానంతో కలిగే ప్రయోజనాలను మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లండన్, అమెరికా తదితర దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు.ఇదే సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా స్పందిస్తూ రాష్ట్రంలో హిందీ మాట్లాడటాన్ని ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదని, జర్మన్, జపనీస్ వంటి విదేశీయులే ఇక్కడ సంతోషంగా ఉంటున్నప్పుడు, హిందీ మిత్రులకు ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘భాష’ ప్రధానాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి దీనిని సవాలు చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1930లు, 1960ల కాలంలో జరిగిన భాషా ఉద్యమాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన -
అరుణాచలం కొండపై నటి.. జరిమానా
పరమేశ్వరుడి ప్రతిరూపం అరుణాచలం.. అక్కడి పర్వతమే పరమాత్మగా ప్రాభవం పొందిన అరుణగిరిని దర్శించుకోవటం పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అయితే, ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉన్న విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు 14 కి.మీ దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అక్కడ మరింత రద్దీగా ఉంటుంది. అక్కడ గిరి ప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొండ ఎక్కడానికి అటవీశాఖ వారు నిషేధం విధించారు. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా నటి అర్చనా రవిచంద్రన్‌తో పాటు నటుడు అరుణ్ వెళ్లారు. అక్కడ వారిద్దరూ ఫోటోలను కూడా తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఇద్దరికి రూ. 5వేలు చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. అన్నామలై (అరుణాచల) కొండపైకి భక్తులు ఎక్కకూడదనడానికి ప్రధాన కారణం ఉంది. ఆ కొండను స్వయంగా శివుడి రూపంగా పరిగణించడం వల్ల ఎవరూ కొండపైకి వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. కొండపైకి నేరుగా ఎక్కడం అపచారం. పవిత్రతకు విరుద్ధం అని భక్తులు భావిస్తారు. ఈ కొండను దేవాలయ గోపురంలా కాకుండా.. దేవుడి శరీరంగా భక్తులు భావిస్తారు. కాబట్టి దానిపై నడవడం, ఎక్కడం అనేది శివుని శరీరంపై నడిచినట్లుగా అవుతుంది. -
కొండల నుంచి సభకు..!
గిరిపుత్రులుగా పిలిచే గిరిజనులు..కొన్నితెగలు ఇప్పటకీ చాలా వెనకబడే ఉన్నారు. ఇప్పటికీ నాటి ఆచార సంప్రదాయాలు, కట్లుబాట్లు వారిలో భాగం అన్నట్లుగా ఉంటుంది వారి సంస్కృతి. కొందరు ఇప్పటికీ సిటీ ముఖమే చూడని వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి గిరిజనుల్లో ఒక తెగ అసలు బయటకే అడుగుపెట్టరు. వాళ్లకస్సలు..పట్టణాలు, నగరాలు గురించి బొత్తిగా తెలియనే తెలియదు. ముఖ్యంగా అక్కడ మహిళలు తమ ఇల్లు, గ్రామం తప్ప బయట ముఖమే తెలియని వాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వాళ్లంతా ఏదో పార్టీలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారనుకుంటే పొరపాటేతమిళనాడు నీలగిరిలోని దేవర్చోలై పంచాయతీలోని కౌండన్‌కొల్లై కుగ్రామానికి చెందిన ఓ గిరిజన తెగ చాలా అరుదుగా బయటకు వస్తారు. అలాంటి నేపథ్యం ఉన్న గిరిజన మహిళలు అసెంబ్లీనికి చూసేందుకు రావడం విశేషం. ఎవరి వల్ల వాళ్లు ఇంత ధైర్యంగా అసెంబ్లీ సందర్శనకు రాగలిగారంటే..గూడలూరు ఎమ్మెల్యే పొన్ జయశీలన్ మద్దతుతో అసెంబ్లీకి వచ్చారు. ఆ తెగకు చెందిన ఎక్కువమందిని అసెంబ్లీకి తీసుకురావాలనుకుంటే..కేవలం ఐదుగురు మాత్రమే ఇక్కడకు రావడానికి అంగీకరించారట. అంతేగాదు వాళ్లంతా తమకు ఈ అవకాశం ఇచ్చిన సదరు ఎమ్మెల్యే, స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాము అసెంబ్లీ ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతుహలంతో వచ్చామని అన్నారు. కాగా, ఎమ్మెల్యే పొన్ జయశీలన్ ఆ తెగకు చెందిన చాలామంది ఇక్కడకు రావాలని ఆశించా, కానీ ఐదురుగు మాత్రమే వచ్చారని ఆయన అన్నారు. అంతేగాదు ఆయన మారుమూల గిరిజన ప్రాంతాలలో గృహాలను నిర్మించడంలో ఎదుర్కొంటున్న లాజిస్టికల్ సవాళ్లను పేర్కొంటూ, గిరిజన గృహాలకు ఆర్థిక సహాయాన్ని 5.25 లక్షల నుంచి 7.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కూడా. (చదవండి: వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..!) -
కొంపముంచిన వెయిట్‌లాస్ టిప్..! పాపం ఆ విద్యార్థిని..
ఇటీవల కాలంలో అందర్నీ వేధించే సమస్య అధిక బరువు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది తింటే బరువు తగ్గుతారు, ఈ జ్యూస్ తాగితే సన్నజాజిలా నాజుగ్గా అయిపోతారంటూ..యూట్యూబ్ వీడియోలు ఎంతలా ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయో తెలిసిందే. అయితే ఏ చిట్కా లేదా హెల్త్ టిప్స్ అనేవి మన శరీరానికి ఎంత వరకు సరిపడుతుందనేది వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్యనిపుణులని సంప్రదించడం అనేది అత్యంత ప్రధానం. గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అయితే..ప్రాణాలకే ప్రమాదం అనేందుకు ఈఉదంతమే నిదర్శనం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఏఐ, సోషల్‌మీడియా సాయం తీసుకునేవాళ్లకు ఈ ఘటన ఓ కనువిప్పు కూడా. అసలేం జరిగిందంటే.. తమిళనాడు సెల్లూరులోని మీనాంబాల్పురం, కామరాజ్ క్రాస్ స్ట్రీట్‌కు చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్ (51), విజయలక్ష్మీ దంపతుల కుమార్తె కలైయరసి(19) నరిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది. కొద్దిగా అధిక బరువుతో ఉండటంతో ఆమె తరుచుగా బరువు తగ్గే చిట్కాలను యూట్యూబ్‌లలో చూస్తుండేది. గతవారం ఆమె కొవ్వుని తగ్గించి..శరీరాన్ని సన్నగా మార్చే..వెంకారాం(బొరాక్స్) అనే టైటిల్‌తో ఉన్న వీడియోని ఓ యూట్యూబ్ ఛానెల్లో చూసింది. జనవరి 16న, థెర్ముట్టి, కీళమాసి వీధి సమీపంలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిందామె. జనవరి 17న వీడియోలో చెప్పిన విధంగా సేవించింది. వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తక్షణమే ఆమె తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టక పోగా..మళ్లీ తిరగబెట్టాయి..దాంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయినా పరిస్థితి చక్కపడక పోగా..తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడుతోందంటూ తండ్రిని పట్టుకుని భోరున విలపించింది. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. వైద్యులు సైతం అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తదనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు యూట్యూబ్ ఛానెల్‌పై చర్యలు తీసుకునేలా దర్యాప్తు ప్రారంభించారు.(చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!) -
గవర్నర్ల కోసం ప్రత్యేక చట్టాలేవి లేవు: స్టాలిన్
తమిళనాడు గవర్నర్ RN రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి వైరం ముదిరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనను అవమానించారని అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని అన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ " సభనుంచి గవర్నర్ వాకౌట్ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించడమే. గవర్నర్ తన అభిప్రాయాలను పంచుకునేలా, ఎదైనా చెప్పేలా ఉండే చట్టాలేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా గవర్నర్ మద్దతు ప్రకటించాలి కాని RNరవి అలా చేయడం లేదు" అని స్టాలిన్ అన్నారు.రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తుని ఇటువంటి చర్యలు చేయడం వల్ల సభను అవమానపరుస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం సభను వాకౌట్ చేసిన గవర్నర్ అనంతరం అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. జతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని తాను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులున్నాయని, తన మైక్ ఆప్ చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.అయితే గతంలోనూ తమిళనాడు గవర్నర్ RN రవి తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించన ప్రసంగం కాకుండా తన స్వంత ప్రసంగాన్ని చదివారు. ఈ వివాదం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంమైంది. -
2026 ‘బిగ్ ఫైట్’: అటు బెంగాల్ పులి.. ఇటు తమిళ ‘దళపతి’!
దేశంలో ప్రతీయేటా ఎన్నికల కోలాహలం సాధారణమే అయినా, ప్రస్తుత 2026లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే సత్తాను కలిగి ఉన్నాయి. తూర్పున అస్సాం, పశ్చిమ బెంగాల్.. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఏడాది మోగనున్న ఎన్నికల నగారా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ప్రాంతీయ శక్తులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే (డీఎంకే)లకు పెద్ద సవాల్‌ను విసరనున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా, పార్టీల సంస్థాగత నిర్మాణం, నాయకత్వ పటిమ మొదలైనవి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.బీజేపీ ముంగిట భారీ సవాళ్లుఅస్సాం, పుదుచ్చేరిలలో ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సవాల్ కానున్నాయి. మరోవైపు 14 ఏళ్లుగా బెంగాల్‌ను ఏలుతున్న మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడం కమలనాథుల ప్రధాన లక్ష్యంగా మారింది. ఇక కేరళలో సీపీఎం (ఎల్డీఎఫ్), తమిళనాడులో డీఎంకే తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందరి దృష్టి ఆ రాష్ట్రాలపైనే..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపైనే నిలిచింది. బెంగాల్లో దశాబ్ద కాలానికిపైగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై సహజంగానే కొంత వ్యతిరేకత ఉండే అవకాశముందని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ తదితర అంశాలు మమత సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నా, బీజేపీ ఈ అంశాలను ఓట్లుగా మలుచుకోగలదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.పొత్తులే నిర్ణయాత్మక శక్తులుగుజరాత్లో బీజేపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నట్లే.. బెంగాల్లో మమత కూడా తన పట్టు నిలుపుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అస్సాంలో గత ఎన్నికల్లో బీజేపీ కూటమి సునాయాసంగా గెలిచినా, విపక్ష ‘మహాజోత్’ కూటమికి, ఎన్డీయేకి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 4 శాతం మాత్రమే ఉండటం గుర్తించదగినది. రాబోయే ఎన్నికల్లో చిన్నపాటి ఓట్ల చీలిక కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో, పొత్తులే ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని తెలుస్తోంది. పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమి తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆసక్తికర వ్యూహాలు రచిస్తోంది.కేరళలో పుంజుకుంటున్న బీజేపీదక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ఈసారి రాజకీయ ముఖచిత్రం కొంత భిన్నంగా కనిపిస్తోంది. సంప్రదాయంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్యే అధికారం చేతులు మారే కేరళలో.. బీజేపీ అనూహ్యంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ సీటు గెలవడం, ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్లో మెజారిటీకి చేరువగా రావడం కమలదళంలో ఉత్సాహాన్ని నింపింది.తమిళనాట విజయ్ ప్రకంపనలుతమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించిన విజయ్.. ఒంటరిగానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. విజయ్ భారీ బహిరంగ సభలకు జనం వస్తున్నా, ఆ జనసందోహం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది సందేహంగా మిగిలింది. ద్రవిడ పార్టీల ఆధిపత్యం నడిచే తమిళనాడులో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఈసారైనా సత్తా చూపుతాయా లేక ప్రాంతీయ పార్టీల నీడలోనే కొనసాగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది‘ఇండియా’ కూటమి ఏమవునో..2026 ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమి మనుగడకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి గీటురాయిగా నిలవనున్నాయి. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఈసారి కూడా ఓడిపోతే పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. కేరళలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్.. ఈ ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే రాహుల్ గాంధీ సామర్థ్యంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే ప్రమాదముంది. మరోవైపు బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌కు కూడా ఈ ఎన్నికలు తొలి పరీక్షగా నిలవనున్నాయి. మొత్తంగా చూస్తే, పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ గెలుపుపైనే ‘ఇండియా కూటమి’ భవిష్యత్తు ఆధారపడి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: మీ నిద్రలోనే మీ ఆయుష్షు! -
జల్లికట్టులో అపశ్రుతి..10మంది పరిస్థితి విషమం
సాక్షి చెన్నై: తమిళనాడు ఆవనీయపురంలో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో అపశ్రుతి చోటు చేసుకుంది. జల్లికట్టు సాగుతుండగా ఉన్నట్టుండి ఎద్దులన్నీ ఆటను వీక్షిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చాయి అక్కడున్న ప్రజలపై దాడి చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా తీవ్రగాయాలు కాగా అందులో 10 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పోటీలలో 600కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 1000కి పైగా ఎద్దులు ఈ పోటీలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
వివాదంలో శివ కార్తికేయన్ పొంగల్ మూవీ..!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అన్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. -
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితుల కారణంగా జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడిందని సంస్థ స్పష్టం చేసింది. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అదే రోజు ఈ చిత్రానికి సంబంధించిన తీర్పు చెప్తామని కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో నిరాశ చెందారు. అయితే కొత్త విడుదల తేదీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. -
ఘోర ప్రమాదం.. ఊటీలో లోయలో పడ్డ బస్సు
తమిళనాడు ఊటీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మనవాడ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం వివరాలు తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదంలో గాయపడిన వారికి అక్కడే స్థానికంగా ఉన్న పలాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఊదగై మెడికల్ కాలేజ్‌కి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
తమిళనాట పెరిగిన పొలిటికల్ హీట్
సాక్షి చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. డీఎంకే అందుకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలనిపక్షంలో విజయ్ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పొత్తుల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. దీంతో సీట్ల షేరింగ్ అంశంపై రెండుపార్టీల మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోందట. కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.ఇటు కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీ టీవీకేతో పొత్తుపెట్టుకునే అవకాశాల్ని పూర్తిగా కొట్టిపడేసే అవకాశాలు లేవు. ఇటీవల ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ " కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజమిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులు, రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడం కలకలమే రేపింది. దీంతో.. బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తుకోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్‌తో చర్చించాకే ఏ నిర్ణయమనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతుండడం గమనార్హం. -
పొత్తుపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన
సాక్షి చెన్నై:తమిళనాట పొలిటికల్ హీట్ వేడెక్కింది. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలన్నీ గెలుపుకోసం ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ స్టార్ విజయ్ స్థాపించిన విజయ్ తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పొత్తులపై ఆపార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ "సెక్యులరిజం భావజాలంలో కాంగ్రెస్, టీవీకే సహజంగానే మిత్రులు, మతతత్వానికి రెండు పార్టీలు వ్యతిరేకులు, ఆ విషయాలలో రెండు పార్టీలు సహజంగానే భాగస్వామ్యులు అంతేకాకుండా రాహుల్ గాంధీ, విజయ్ ఇద్దరు మంచి మిత్రులు ఈ విధంగా చూస్తే కాంగ్రెస్, టీవీకే రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవడానికి చాలా అవకాశాలున్నాయి". అని ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల అక్కడి కాంగ్రెస్ నేతలు పొత్తుకు అంగీకరించకపోవచ్చు అని తెలిపారు.ఒకవేళ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే మైనార్టీల ఓట్లతో పాటు బీజేపీ వ్యతిరేఖ ఓట్లను చీల్చకుండా ఒకే పార్టీ పొందవచ్చు అన్నారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుల గురించి మాట్లాడడం ఇప్పుడు సరైన పద్ధతి కాదని అన్నారు. అయితే కాంగ్రెస్-టీవీకే మధ్య ఇది వరకే మంచి సయోధ్య కుదిరిందని గతేడాది డిసెంబర్ 25న నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హజరయ్యారని ఆయన తెలిపారు.అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్యా ఈ పొత్తు దాదాపు అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రధాన భాగస్వామి అంతేకాకుండా రాహుల్ గాంధీకి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంచి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకేతో కాంగ్రెస్ జతకట్టే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.తమిళనాడులో యాక్టర్ విజయ్‌కు చాలా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ ఫాలోయింగ్‌ని క్యాచ్ చేయడానికి 2024లో తమిళిగ వెట్రి కజగం (టీవీకే) అనే పార్టీని స్థాపించారు. స్టార్డమ్కు అనుగుణంగానే లక్షల మందితో సభలు నిర్వహించి అందరిదృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందారు. ఈ తొక్కిసలాట ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
చెన్నై:తమిళనాడు తిరుచారపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు టైర్లు పేలి అదుపు తప్పింది. అవతలి రోడ్డుపై వస్తున్న రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. కడలూరు జిల్లా తిట్టకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కార్లలో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి నుండి చైన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని సమాచారం. -
డీఎంకే ఈవిల్, టీవీకే ప్యూర్.. విజయ్ రాజకీయ పునరాగమనం
తమిళనాడు: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత రాష్ట్రంలో ఆయన పెద్ద ఎత్తున జరిపిన మీటింగ్ ఇదే కావడం విశేషం. ఈ ర్యాలీ ద్వారా విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారానికి స్వరం సిద్ధం చేసుకున్నారు. విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో NEET పరీక్ష మినహాయింపు అంశం, శాంతిభద్రతల సమస్యలపై ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పార్టీకి సమస్యలు ఫెవికాల్తో ముడిపడి ఉన్నాయి, వాటిని వేరు చేయలేం అని వ్యాఖ్యానించారు. అధికార డీఎంకేను దుష్ట శక్తిగా, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం)ను స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించారు. పోరాటం స్వచ్ఛమైన శక్తికి, చెడుకు మధ్య అని విజయ్ మండిపడ్డారు. ర్యాలీకి వచ్చిన జనసమూహాన్ని సురక్షితంగా వెళ్లమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు కేఏ సెంగొట్టయన్ స్వస్థలం విజయమంగళం సమీపంలో జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెంగొట్టయన్ గత నెలలో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన తర్వాత విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆయనను సీనియర్ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పరిగణిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన రెండవ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇదే కావడం విశేషం. మొదటి సభ గత వారం పుదుచ్చేరిలో జరిగింది, అక్కడ కూడా ఆయన డీఎంకేపై మాటల దాడి చేశారు. ఈరోడ్ ర్యాలీతో విజయ్ తన రాజకీయ యాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు. తోపులాటకు ఆస్కారం లేకుండా.. తోపులాట, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను నిర్వహించారు. గర్భిణిలు, వృద్ధులు, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని ముందుగానే సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి విజయ్ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది. -
తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్‌ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
జాతీయ మహిళల చెస్ విజేత నందిత
దుర్గాపూర్: జాతీయ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన పీవీ నందిత విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నందిత 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొమ్మిది గేముల్లో గెలిచిన నందిత, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. చాంపియన్‌గా నిలిచిన నందితకు విన్నర్స్ ట్రోఫీతో పాటు రూ. 7 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు చెందిన మేరీ ఆన్ గోమ్స్ 9 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. త్రిపుర అమ్మాయి అర్షియా దాస్ 8.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. శుభి గుప్తా (ఉత్తరప్రదేశ్), కల్యాణి సిరిన్ (కేరళ), సృష్టి పాండే (మహారాష్ట్ర), వర్షిణి (తమిళనాడు), సాచి జైన్ (ఢిల్లీ), ఏజీ నిమ్మీ (కేరళ) 8 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వీరి ర్యాంకింగ్‌ను వర్గీకరించగా వరుసగా 4 నుంచి 9 స్థానాల్లో నిలిచారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 7.5 పాయింట్లతో 11వ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరయు ఏడు గేముల్లో గెలిచి, మూడు గేముల్లో ఓడిపోయి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తెలంగాణకు చెందిన శివంశిక 7 పాయింట్లతో 21వ స్థానంలో, గాదె శరణ్య 6.5 పాయింట్లతో 33వ స్థానంలో, స్నేహ భరతకోటి 6.5 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొట్లూరి సుప్రీత 7.5 పాయింట్లతో 14వ స్థానంలో, భీమరశెట్టి శ్రావ్యశ్రీ 7 పాయింట్లతో 18వ స్థానంలో, మోడిపల్లి దీక్షిత 7 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. -
స్టాలిన్‌కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. గతంలో కరూర్‌లో విజయ్ బహిరంగ సభ జరగగా, తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేడు (మంగళవారం) పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. ‘2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుండి డీఎంకే పాలకులు 100 శాతం గుణంపాఠం నేర్చుకుంటారు. మా ప్రజలు దానిని నిర్ధారిస్తారు’ అని అన్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.డీఎంకే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు కొనసాగిస్తూ.. పుదుచ్చేరి సీఎం రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, ప్రత్యర్థి పార్టీ ర్యాలీకి సైతం భద్రత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ‘సీఎం రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడు డీఎంకే పాలన లాంటిది కాదు’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే పాలకులు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి నేర్చుకుంటే మంచిది, అయితే, వారు ఇప్పుడు నేర్చుకోరు' అని వ్యంగ్యంగా అన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన కర్తవ్యమని టీవీకే చీఫ్ ప్రకటించారు. #WATCH | Puducherry | Security arrangements in place as a large number of people start arriving for TVK Chief Actor Vijay's political rally in Uppalam Expo Ground. For the first time since the stampede during his rally in Karur that killed 41 people, actor-politician Vijay is… pic.twitter.com/NGMFCNIeeT— ANI (@ANI) December 9, 2025ఈ సందర్భంగా విజయ్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై ఉన్న డిమాండ్‌ను మరోమారు లేవనెత్తారు. కేంద్రం అభివృద్ధి విషయంలో పుదుచ్చేరికి మద్దతు ఇవ్వలేదనిఅని విమర్శించారు. అయితే, కేంద్రం విభజించి చూసినా.. తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నేత విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 110 మంది గాయపడ్డారు. "DMK regime will 100 per cent learn their lesson from 2026 TN Assembly election. Our people will ensure it," TVK chief #Vijay said at the party's first public rally at Puducherry since #KarurStampede. https://t.co/NMgDbEXbHH— The New Indian Express (@NewIndianXpress) December 9, 2025 -
రూ.2 వేల ప్రొజెక్టర్ : అమెజాన్‌కు రూ. 35వేల షాక్
చెన్నై,సాక్షి : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరో తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకుగాను కోర్టు జరిమానా విధించింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులోకి తిరుచ్చకి చెందిన ఐజాక్ న్యూటన్ జులై 9న ఒక మినీ ప్రొజెక్టర్ ఆమెజాన్ ద్వారా ఆర్డర్ చేశారు. కానీ జూలై 14న వచ్చిన పార్సిల్ చూసి ఐజాక్ నివ్వెరపోయాడు. రూ.2,707 ధర గల మినీ ప్రొజెక్టర్‌కి బదులుగా టీ-షర్టులు కనిపించాయి. అయితే, న్యూటన్ ఉత్పత్తిని మార్చాడని ఆరోపిస్తూ అమెజాన్ డబ్బును తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. అమెజాన్ చర్యతో నిరాశ చెందిన ఐజాక్ కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. అసలు మొత్తాన్ని తిరిగి ఇచ్చింది. అయినా చెప్పిన సమయానికిఈ-కామర్స్ సంస్థ డబ్బులు చెల్లించక పోవడంతో న్యాయపోరాటానికి దిగాడు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతోతనకు జరిగిన మోసం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఐజాక్ న్యూటన్ త్రిరుచ్చి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. రూ. 5 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన కోర్టు అమెజాన్ ,డెలివరీ ఏజెంట్ తప్పు చేసినట్లు గుర్తించింది. నవంబర్ 28న కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది, అమెజాన్ ఐజాక్ న్యూటన్‌కు రూ.25,000 పరిహారంగా రూ.10 వేల కోర్టు ఖర్చులకు చెల్లించాలని ఆదేశించింది. ఐజాక్‌కు మొత్తంగా రూ.35,000 చెల్లించాలని తీర్పు చెప్పింది.చదవండి: మాస్క్‌తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?TN NEWS : Tiruchi court fines Amazon ₹35,000 for delivering t-shirts instead of ordered projector.On July 9, he ordered a mini projector priced at ₹2,707. The product was delivered on July 14, but when Isaac opened the package and he found T-shirts instead of the projector. pic.twitter.com/izbiHzMqQh— News Arena India (@NewsArenaIndia) December 2, 2025 -
అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!
హీరోయిన్ సమంత రూతు ప్రభు, రాజ్ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్, ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టు కున్నారు. రాజ్ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్ శైలి పోట్రెయిట్‌కట్ డైమండ్ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్ కట్‌ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్, సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్ టాపిక్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official)అరటి ఆకులో కమ్మటి భోజనంసమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం, పప్పు,కూరలతో కలర్పుల్గా కనిపించిన సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం, పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా ఈ ఫుడ్‌ను వడ్డించారు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది? -
టన్నెల్లో నిలిచిపోయిన మెట్రో రైలు.. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
చెన్నైలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న టన్నెల్లో అకాలంగా నిలిచిపోయింది. దీనితో ప్రయాణికులు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ప్రారంభ సమయంలో బ్లూ లైన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. రైలులో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు వెలుగు లేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడివారు రికార్డ్ చేసిన వీడియోల్లో ప్రయాణికులు హ్యాండ్రెయిల్ పట్టుకుని బయట పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.అయితే పది నిమిషాల తర్వాత హైకోర్టు స్టేషన్ వరకు (దాదాపు 500 మీటర్లు) నడుచుకుంటూ వెళ్లాలని మెట్రో సిబ్బంది ప్రయాణికులకు తెలిపింది. అనంతరం వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కాగా ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉండొచ్చని అంచనా. అయితే పరిస్థితిని త్వరగా సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు.అనంతరం ఎక్స్‌లో చెన్నై మెట్రో అధికారులు స్పందిస్తూ ఎయిర్పోర్ట్ విమ్కో నగర్ డిపో బ్లూ లైన్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. గ్రీన్ లైన్‌లోని సెంట్రల్ మెట్రో–సెంట్ థామస్ మౌంట్ మార్గంలో కూడా రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.జరిగిన ఘటన వల్ల ఉదయం ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించడంతో మెట్రో సేవలు మళ్లీ సవ్యంగా కొనసాగుతున్నాయి. -
వచ్చే ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోవడం ఖాయం: విజయ్ విమర్శలు
చెన్నై: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత కొన్ని నెలలు సుదీర్ఘ విరామం తీసుకున్న టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు విజయ్.. తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. నేడు(ఆదివారం, నవంబర్ 23 వ తేదీ) కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికోసం కాంచీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు.కేవలం 2000 మందికి మాత్రమే QR కోడ్ పాస్‌లతో కూడిన అనుమతి ఇచ్చారు. అనుమతి లేని వారికి ప్రవేశం లేకుండా పకడ్బందీ ప్లానింగ్ చేశారు. ప్రచార పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ర్యాడికల్స్‌కు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని ఆయన మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తోందని విజయ్ స్పష్టం చేశారు.ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకంగా లేదని, ఆ ప్రక్రియ ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు.తమిళనాడులో అధికార డీఎంకేతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని విజయ్ విమర్శించారు. రెండు పార్టీల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవని అన్నారు.విజయ్ ఒకేసారి డీఎంకే, బీజేపీలపై దాడి చేయడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
తమిళనాడు ఎన్నికలు.. మళ్ళీ ప్రజల్లోకి విజయ్
సాక్షి చెన్నై: కరూర్‌లో జరిగిన విషాద ఘటనతో తను చేస్తున్న అన్ని ప్రజా కార్యక్రమాలను నిలిపివేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కొంతకాలం విరామం తర్వాత తిరిగి తన ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ప్రచార యాత్ర పునఃప్రారంభానికి సంబంధించి నిర్వహించనున్న తొలి పెద్ద సభ కాంచీపురంలో జరగనుందని టీవీకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. పార్టీ బలోపేతం, స్థానిక నాయకుల సమావేశం, ప్రజలతో మళ్లీ ప్రత్యక్షంగా అనుసంధానమవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. తొలి సభను కాంచీపురంలో నిర్వహించడానికి విజయ్ టీమ్ నిర్ణయం తీసుకుంది. దాంతో కాంచీపురానికి ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ వెంటనే అన్ని ప్రజా ఈవెంట్లను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాల పట్ల గౌరవ సూచికగా చేపట్టిన ఈ నిర్ణయాన్ని అప్పట్లో విస్తృతంగా ఆయన అభిమానులు అభినందించారు. ఆ సమయంలో బీజేపీ పార్టీ విజయ్‌కు మద్దతుగా నిలిచింది. అయితే కొంతకాలం విరామం తరువాత విజయ్ తిరిగి ప్రచార యాత్రను ప్రారంభించడంతో తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసిన అధికారులుకరూర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. జనసంచారం నియంత్రణతో పాటు అత్యవసర సేవలు సిద్ధంగా ఉండేలా స్థానిక అధికారులు, పార్టీ నిర్వాహకులు కలిసి పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల అనుమతి తిసుకుని కేవలం రెండువేల మందితో మాత్రమే సభను నిర్వహించాలని టీవీకే పార్టీ వర్గాలు నిర్ణయించాయి.కాగా కాంచీపురం సభ అనంతరం, తమిళనాడులోని పలు కీలకమైన ప్రాంతాలలో విజయ్ ప్రచార షెడ్యూల్‌ను ఏర్పాటు చేసేందుకు పార్టీ ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. -
సెలక్టర్ల కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి
దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)-2025 కోసం తమ జట్టును తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఎంపికయ్యాడు.ప్రొఫెషనల్ క్రికెట్లో వరుణ్ ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. ఇంతకుముందు పరిమిత ఓవర్ల క్రికెట్లో తమిళనాడు జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ (M Shahrukh Khan) నాయకత్వం వహించాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని సీనియర్ వరుణ్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు.సాయి కిషోర్, నారాయణ్ జగదీశన్ (Narayan Jagadeesan) ఉన్నప్పటికి వరుణ్‌కే జట్టు పగ్గాలను కట్టబెట్టారు. అయితే ఈ టోర్నీలో అతడి డిప్యూటీగా జగదీశన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో వరుణ్‌ది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే వరుణ్ డొమాస్టిక్ క్రికెట్లో తమిళనాడు తరపున తనదైన ముద్ర వేసుకున్నాడు ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 ప్రారంభం కానుంది. తమిళనాడు తమ తొలి మ్యాచ్‌లో టోర్నీ ఆరంభం రోజునే రాజస్తాన్‌తో తలపడనుంది. కాగా ఈ టోర్నీకి స్టార్ ఆటగాడు సాయిసుదర్శన్ దూరమయ్యాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ మాత్రం అందుబాటులో ఉన్నాడు.SMAT 2025 కోసం తమిళనాడు స్క్వాడ్వరుణ్ చక్రవర్తి (కెప్టెన్), నారాయణ్ జగదీశన్ (వైస్ కెప్టెన్), తుషార్ రహేజా , అమిత్ సాథ్విక్, షారుఖ్ ఖాన్, ఆండ్రీ సిద్దార్థ్, ప్రదోష్ రంజన్ పాల్, శివమ్ సింగ్, సాయి కిషోర్, సిద్ధార్థ్, నటరాజన్, గురజప్నీత్ సింగ్, సోథు సిలంబరసన్, రితిక్ ఈశ్వరన్ (వికెట్ కీపర్)చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర వీరుడు.. ఆరేళ్ల తర్వాత -
‘కారు సైడ్ మిర్రర్లో పాము!.. బుసలు కొడుతూ బయటకొచ్చింది’
సాక్షిచెన్నై: ఓ ఫ్లైఓవర్‌పై కారు వేగంగా దూసుకెళ్తోంది. అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే... ఆ కారు సైడ్ మిర్రర్ వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వస్తోంది! ఆ పామును చూసిన డ్రైవర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి, తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కారు యజమానులు మన కారులో ఇలాంటి పాములు దాగి ఉన్నాయేమో అన్న భయంతో తమ వాహనాలను పరికించి పరికించి పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే?ఇటీవల తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డులో ఓ డ్రైవర్ కారుకు ఊహించని అనుభవం ఎదురైంది. కారు నడుపుతుండగా సైడ్ మిర్రర్ నుండి ఒక పాము బయటకు వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తొలుత కారు అద్దంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించాడు. అయినా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా..అగస్మాత్తుగా ఓ పాము బుసలకొడుతూ బయటకు రావడాన్ని గమనించాడు. వాహనదారులకు జాగ్రత్తలు చెప్పేందుకు వీడియో తీశాడు.అనంతరం, కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారును ఆపాడు. ఊపిరి ఆడక కారు అద్దం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్న పాము రక్షించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కారు అద్దంలో ఇరుక్కున్న పామును పట్టుకున్నారు. స్థానిక అటవీ ప్రాంతానికి తరలించారు. ⚠️ Safety Alert for Drivers!Shocking Incident on Namakkal–Salem Road: Snake Discovered Inside Car’s Side Mirror While DrivingAs the cold and rainy season sets in, motorists are urged to be extra cautious before hitting the road. Always inspect your vehicle thoroughly… pic.twitter.com/AOGzVdArxi— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025 -
నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడులో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయంతో పాటు సినీ నటుడు ప్రభు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమేరకు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో మరికాసేపట్లో బాంబు పేలుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో ఒక బాంబు పేలుతుందని మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు. తర్వాత అమెరికా కాన్సులేట్‌లో పనిచేస్తున్న అధికారుల ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబులు దొరకలేదు. ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్.వి.శేఖర్ ఇల్లు, మైలాపూర్‌లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఇళ్లలో బాంబులు పెట్టినట్లు తెలిపారు. వెంటనే తనిఖీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ను జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా తమిళనాడు (Tamil Nadu vs Jharkhand)తో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు. ఒకానొక సమయంలో డబుల్ సెంచరీ దిశగా పయనించిన ఇషాన్.. ద్విశతకానికి ఇరవై ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.సెలక్టర్లకు గట్టి వార్నింగ్ఏదేమైనా ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రదర్శన పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. అద్భుత సెంచరీతో టీమిండియా సెలక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌ను చాన్నాళ్లుగా టీమిండియా నుంచి పక్కన పెట్టడం గురించి మాట్లాడుతూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను తెరమీదకు తెస్తున్నారు.మెరుగైన ప్రదర్శనతో‘‘ఇషాన్ కిషన్ మంచి ఆటగాడు. అయితే, అతడు దేశీ క్రికెట్లో తరచుగా ఆడుతూ.. నిలకడైన ప్రదర్శనలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకునేందుకు సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అగార్కర్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఈ యువ ఆటగాడు... ఈసారి మెరుగైన ప్రదర్శనతో సీజన్‌ను ఆరంభించడం విశేషం.తొలిరోజే శతకంఇక మ్యాచ్ విషయానికొస్తే... కోయంబత్తూర్ వేదికగా తమిళనాడుతో బుధవారం మొదలైన పోరులో టాస్ గెలిచిన జార్ఖండ్.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు టీమిండియా ప్లేయర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (183 బంతుల్లో 125 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.ఇషాన్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... సాహిల్ రాజ్ (105 బంతుల్లో 64 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. శరణ్‌దీప్ సింగ్ (102 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లు విఫలమవడంతో ఒక దశలో జార్ఖండ్ జట్టు 157 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సాహిల్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తమిళనాడు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... క్రీజులో కుదురుకున్న తర్వాత చక్కటి షాట్లతో ఆకట్టుకుంది. ఈ జంట అబేధ్యమైన ఏడో వికెట్‌కు 150 పరుగులు జోడించడంతో జార్ఖండ్ కోలుకుంది. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా... చంద్రశేఖర్ 2 వికెట్లు తీశాడు.డబుల్ సెంచరీ మిస్ఇక రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ తన ఓవర్‌నైట్ స్కోరు 125కు మరో 48 పరుగులు జోడించి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 247 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. ఆర్ఎస్ అంబరీశ్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.మరోవైపు సాహిల్ రాజ్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గురప్జీత్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక అనుకూల్ రాయ్‌ను (12)ను సందీప్ వారియర్ వెనక్కి పంపించాడు. ఈ నేపథ్యంలో 122 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి జార్ఖండ్ 379 పరుగులు చేసింది. జతిన్ పాండే 4, రిషావ్ రాజ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
కరూర్ తొక్కిసలాట.. స్టాలిన్ సర్కారు సుప్రీం బిగ్ షాక్
-
‘నీ డబ్బేం వద్దు విజయ్.. తొక్కిసలాటలో మరణించిన నా సోదరిని నాకివ్వు’
చెన్నై,సాక్షి: మాటలకందని కరూర్ విషాదంపై తమిళగ వెట్రి కగళం అధ్యక్షుడు విజయ్ ఇస్తానన్న రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా తమకేం వద్దని, తొక్కిసలాటలో మరణించిన తన చెల్లల్ని తిరిగి తనకు ఇవ్వాలని ఓ సోదరి కన్నీటి పర్యంతమవుతున్నారు. శనివారం రాత్రి విజయ్ తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కరూర్‌కు చెందిన బృందా ఒకరు.బృందాకు హీరో విజయ్ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానమే బృందా ప్రాణాలు తీసింది. నిన్న తానుండే ఏరియాలో విజయ్ సభ నిర్వహిస్తున్నాడని తెలుసుకుంది. ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. రెండేళ్ల కొడుకును తన సోదరి వద్ద వదిలి తన హీరోని చూసేందుకు గంపెడాశతో విజయ్ మీట్ ద పీపుల్ వేదిక వద్దకు వెళ్లింది. సభలో విజయ్ను కలుసుకుని, ఆయనతో సెల్ఫీ దిగాలని అనుకుంది. కానీ కొన్ని గంటల తర్వాత, బృందా కరూర్ తొక్కిసలాటలో మరణించింది. ఆ ర్యాలీలో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మంది గాయపడ్డారు.ఇక కరూర్ విజయ్ సభలో శనివారం సాయంత్రం సమయంలో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు రావడంతో బృందకు ఆమె సోదరి ఫోన్ చేస్తూనే ఉంది. అట్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదివారం ఉదయమే బృంద మరణించినట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు.‘నా సోదరి తన బిడ్డను నా దగ్గరే వదిలేసి విజయ్ ర్యాలీకి వెళ్తానని చెప్పింది. మేము సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేశాం. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం.. ఆమె నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. సాయంత్రం పది గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఈ రోజు ఉదయం నా సోదరి భర్త ఆమె ఫొటోతో ప్రభుత్వ అధికారుల్ని కలిశారు. ఆ తర్వాతే కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారిలో ఆమె ఉన్నట్లు తెలిసింది.ఈ సందర్భంగా తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం ప్రకటించారు. ఆ మొత్తం మాకెందుకు. చనిపోయిన నా సోదరిని ఇవ్వండి చాలు అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. -
కరూర్ తొక్కిసలాట: విచారణకు సిద్ధమైన జస్టిస్ అరుణ జగదీశన్ ఎవరు?
కరూర్: కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్‌ను నియమించింది. గతంలో జస్టిస్ అరుణ జగదీశన్ ఇలాంటి సున్నితమైన పలు కేసులను సమర్థవంతంగా విచారణ చేశారు. జస్టిస్ అరుణ జగదీశన్.. మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తి . ఆమె తమిళనాడులో పలు ఉన్నతస్థాయి విచారణ కమిషన్లకు సారధ్యం వహించారు. 2009 నుండి 2015లో పదవీ విరమణ చేసే వరకు మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఆమె విధులు నిర్వహించారు. కరూర్‌లో టీవీకె పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకూ గాయపడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడు డీజీపీ వెంకటరామన్ మాట్లాడుతూ ఊహించనంత సంఖ్యలో ప్రజలు తరలిరావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. ర్యాలీ కోసం 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు.ఈ ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌తో విచారణకు ఆదేశించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతోపాటు ఆమె సహచరులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును జస్టిస్ అరుణ విచారించారు. జస్టిస్ అరుణ హైకోర్టులో పని చేస్తున్నప్పుడు ఓ కేసులో చెన్నై పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2015లో పోలీసు ఎన్కౌంటర్లో ఐదుగురు మృతిచెందారు. వారంతా బ్యాంకును దోచుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. పలువురు దీనిని నకిలీ ఎన్కౌంటర్ అని ఆరోపించారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.ఆ సమయంలో పోలీసులకు జస్టిస్ అరుణ బెంచ్ క్లీన్చిట్ ఇచ్చింది. 2018లో తమిళనాడులోని టుటికోరిన్లో స్టెర్లైట్ పరిశ్రమకు నిరసన సెగ తగిలి హింస చెలరేగింది. పోలీసులు.. నిరసన కారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను అప్పటి ప్రభుత్వం జస్టిస్ అరుణ్‌కు అప్పగించింది .ఈ నేపధ్యంలో ఓ ఐపీఎస్ అధికారితో సహా 17 మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె నేతృత్వంలోని కమిషన్ సిఫార్సు చేంది. 2002లో ఓ దళిత మహిళ కస్టోడియల్ మరణం కేసులో నూ ఆమె సంచలన తీర్పు ఇచ్చారు. బాధితురాలిపై ప్రలలో సానుభూతి ఉన్నప్పటికీ, తగిన ఆధారాలు లేకపోవడంతో దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేశారు. ఎనిమిది మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించారు. -
‘దేశంలో ఎక్కడో లోపం ఉంది’: ఎంపీ శశి థరూర్
తిరువనంతపురం: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఇది చాలా విషాదకర పరిస్థితి. మన దేశంలో జనసమూహ నిర్వహణలో ఏదో లోపం ఉంది. ప్రతి ఏటా ఇలాంటి ఏదో ఒక ఘటన జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో బెంగళూరు ఘటన గుర్తుకువస్తోంది. ఈ తొక్కిసలాటల్లో పిల్లలు కూడా చనిపోతున్నారని విన్నప్పుడు హృదయం ద్రవించిపోతోంది’ అని థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నేత విజయ్ సారధ్యంలో జరిగిన ర్యాలీలో భారీ రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి, 40 మంది మృత్యువాపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మొదలుకొని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎంపీ శశి థరూర్ ‘భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, భారీ సమావేశాల విషయంలో కఠినమైన నియమాలను, భద్రతా ప్రోటోకాల్‌లను రూపొందించాలి. సాధారణ ప్రజానీకాన్ని రక్షించేందుకు జాతీయ స్థాయిలో క్రమబద్ధమైన విధాన రూపకల్పనకు ఏమి చేయగలం అని ఆలోచించాలి.జనం అటు సినిమా నటుడైనా, ఇటు రాజకీయ నేత అయినా వారి మాటలు వినడానికి ఉత్సాహంగా బహిరంగ సభలకు హాజరవుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని నియమాలు, ప్రమాణాలు, ప్రోటోకాల్‌లు అమలులో ఉండాలి. అదే సమయంలో తొక్కిసలాటలో అయినవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి. ఏదిఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసమూహాన్ని నియంత్రించేందుకు కఠినమైన విధానాలను తీసుకురావాలి. ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని కోరుతున్నానని శశిధరూర్ పేర్కొన్నారు.తమిళనాడులోని కరూర్‌లో తమిళగా వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది మృతిచెందారు. 70 మంది గాయపడ్డారు.ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. రెండు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు విజయ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. -
విజయ్ నీకే చెప్తున్నా.. కరూర్ తొక్కిసలాట ఘటనపై KA పాల్ స్ట్రాంగ్ రియాక్షన్
-
కరూర్ మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్ధిక సాయం
-
కరూర్ తొక్కిసలాట మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారి శోకం వర్ణనానీతం. విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి కన్నీరమున్నీరుగా విలవిస్తున్న దృశ్యాలు ఎవరికైనా కంట తడిపెట్టించక మానవు. ఈ క్రమంలో గుండె పగిలే మరోహదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కరూర్ తొక్కిసలాటల కాబోయే జంట కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. హీరో విజయ్ ఫ్యాన్‌గా భావిస్తున్న ఆకాశ్ (24) మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఉంది. కానీ అంతలోనే అనంత లోకాలకు చేరాడు. ఆకాశ్ కు ఇటీవల గోకులశ్రీ ( 24)తో ఇటివల ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో ఇద్దరికీ వివాహం జరగనుంది. ఆకాశ్ తన కాబోయే భార్యతో కలిసి గోకులశ్రీ ఎంతో ఉత్సాహంగాతన అభిమాన హీరో సభకు వెళ్లాడు. కానీ విధి మరోలా ఉంది. శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభ, అక్కడ జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని ఆకాశ్, గోకులశ్రీ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.ఈ ఘోరం ప్రమాదం విజయ్ Xలో స్పందించారు: “నా హృదయం ముక్కలైంది, నేను భరించలేని, వివరించలేని బాధ దుఃఖంలో ఉన్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. టీవీకే తరఫున మృతులకు రూ.20 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.2లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ విషాదంపై తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి సాధ్యమైన అన్ని వైద్య సహాయం అందించాలని ఆదేశించారు, తొక్కిసలాటపై విచారణ కమిషన్‌ను ఆదేశించారు.A woman lost her 5-year-old child in the Karur tragedy. Disturbing video shows her crying inconsolably. #Karur #KarurVijaySpeech #KarurTragedy https://t.co/YRskL4GoDr pic.twitter.com/cVOLJcN4cX— Vani Mehrotra (@vani_mehrotra) September 28, 2025 > కాగా కాగా తమిళ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది ఆహారం లేదా నీరు లేకుండా ఎండలో గంటల తరబడి వేచి ఉండటంతో ఉద్రిక్తత్తకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 39 మంది చనిపోగా, మరో కొంతమంది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఆర్థిక సాయం ప్రకటన.. బాధితులకు అండగా ఉంటా: విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విషాదకర ఘటనపై టీవీకే అధినేత, నటుడు విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.2లక్షలు పరిహారం ఇస్తున్నట్టు తెలిపారు. ఇక, అంతకుముందు విజయ్ కరూర్ ఘటన తర్వాత ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తూ..‘నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ అత్యంత విచారకరమైన మానసిక స్థితిలో, మన వారిని కోల్పోయినప్పుడు నా మనస్సు అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు. నా కళ్లు, మనస్సు కలత చెంది బాధలో ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విచారాన్ని మీతో పంచుకుంటాను. ఇది మేము భర్తీ చేయలేని నష్టం. ఎవరు ఓదార్పునిచ్చినా, నష్టాన్ని మేము భరించలేము. అయితే, మీ కుటుంబంలో ఒకరిగా బంధువులను కోల్పోయి బాధపడుతున్న కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.2 లక్షలు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. నష్టం ముందు ఇది పెద్ద మొత్తం కాదు.అయితే, ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుడిగా మీతో నిలబడటం నా కర్తవ్యం. అదేవిధంగా, గాయపడి చికిత్స పొందుతున్న వారందరూ చాలా త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. చికిత్స పొందుతున్న మా తమిళనాడు వెట్రి కగమగన్ ఖచ్చితంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. దేవుని దయతో, మేము ప్రతి దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తాము’ అని పోస్టు చేశారు. ’ అని పోస్టు చేశారు.ఇదిలా ఉండగా.. తమిళనాడు కరూర్‌లో విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ ప్రసంగిస్తుండగా.. కొందరు ఒక్కసారిగా ఆయనకు సమీపానికి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.పోలీసు కేసు నమోదు..కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుస్సీ ఆనంద్, సిటీ నిర్మల్ కుమార్ సహా మరో నలుగురిపై కేసు నమోదు అయ్యింది. కరూర్ నగర పోలీస్ స్టేషన్లో u/s 105, 110, 125(b), 223 r/w 3 of TNPPDL Act కింద కేసు ఫైల్ చేశారు.వివరాలు ఇలా.. A1. మతియజగన్ – కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శిA2. పుస్సీ ఆనంద్A3. నిర్మల్ కుమార్, ఇతరులు.BNS సెక్షన్ 105 – హత్యతో సమానం కాని నేరపూరిత హత్యకు శిక్ష.BNS సెక్షన్ 110 – నేరపూరిత హత్యకు ప్రయత్నం.BNS సెక్షన్ 125 – మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే తొందరపాటు/నిర్లక్ష్య చర్యలకు శిక్షBNS సెక్షన్ 223 – ప్రభుత్వ అధికారి ఆదేశాన్ని పాటించకపోవడం నేరం.TNPPDL చట్టం సెక్షన్ 3 – ప్రజా ఆస్తికి నష్టం కింద కేసు నమోదు చేశారు. -
తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వ హించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పో యారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మహిళలు ఉన్నారు. వీరు కాకుండా 45 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసుల భద్ర తా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్ష త గాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రుల కు లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై విచార ణకు రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ఏకసభ్య కమిషన్ ఏర్పా టు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాల యంలో సమీక్ష అనంతరం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అర్ధరాత్రి ఘటనా స్థలికి సీఎం స్టాలిన్ బయలుదేరా రు. ఈ దుర్ఘటనపై 24 గంటల్లో నివేదికను సమ ర్పించాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సభాస్థలికి ఏడు గంటల ఆలస్యంగా..సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఈ నెల 13వ తేదీ నుంచి మీట్ ది పీపుల్ పేరుతో ప్రచార సభ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటన చేస్తున్నారు. ఇందులో అధికార డీఎంకేను తీవ్రంగా విజయ్ టార్గెట్ చేస్తున్నా రు. అలాగే బీజేపీని ఫాసిస్టులు అంటూ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం నామక్కల్‌లో ఆయన పర్యటించారు. ఇక్కడి కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వా మి పురం సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. విజయ్ వెళ్లిన కొదిసేపటికే...విజయ్ వెళ్లిన కాసేపట్లోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో జనం తల్లడిల్లారు. జనం రద్దీ ఒక్క సారిగా పెరగడంతో తోపులాట, తొక్కిస లాటతో అక్కడి వాతావరణం తీవ్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఊపిరి ఆడక పోవడంతో సొమ్మ సిల్లే వారి సంఖ్య పెరిగింది. క్షణాలలో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు అక్క డికి చేరుకున్నాయి. అస్వస్థతకు గురైన వారందర్నీ ఆస్ప త్రులకు తరలించారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు నిమి షాల వ్యవధిలో బాధితులతో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకు న్నాయి. ఒక్కో అంబులెన్స్‌లో ఇద్దరు, ముగ్గుర్ని తీసు కొచ్చారు. ఒకే స్ట్రక్చర్‌లో ఇద్దరి లోనికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి కొందరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 45 మంది చికిత్సలో ఉండగా, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. మిన్నంటిన రోదనలుప్రచార సభకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో పలు కుటుంబాలు తీవ్రంగా రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశాయి. ఆస్పత్రి మార్చురీ పరిసరాలు ఆప్తులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. పరిస్థితి దారుణంగా మారడంతో నామక్కల్, తిరుచ్చి జిల్లాల నుంచి వైద్య బృందాలు హుటా హుటిన కరూర్‌కు చేరుకున్నాయి. కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్, ఎమ్మెల్యే , మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను తక్షణ చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పరిస్థితి తక్షణ సమీక్షకు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్‌ను కరూర్‌కు పంపించారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఉన్న వారందరికీ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇక, సీఎం స్టాలిన్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సచివాలయానికి చేరుకుని కరూర్ పరిస్థితిపై సమీక్షించారు. అటు తర్వాత అర్ధరాత్రి ఘటనా స్థలికి బయలుదేరారు. అంబులెన్స్‌తో గందరగోళం..కాగా సభా సమయంలో విజయ్ పార్టీ వర్గాలు అటుగా వచ్చిన ఒక అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా, డ్రైవర్ పైదాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి చేజారినట్లు సమాచారం. పోలీసుల ముందస్తు భద్రతా చర్యలలో వైపల్యాలపై విమర్శలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషణ్ణ వదనంతో వెళ్లిపోయిన విజయ్..కాగా, ఈ ప్రమాద ఘటనపై తిరుచ్చి విమానాశ్రయంలో విజయ్ను మీడియా ప్రశ్నించడంతో, ఆయన మౌనంగా విషణ్ణ వదనంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే.. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పోలీసులు వీటికి తగినంత భద్రత కల్పించాల్సి ఉంది. అప్పుడే తొక్కిసలాటలను నివారించొచ్చు. కానీ పోలీసులు విజయ్ సభకు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే తాజా దుర్ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. విజయ్ అభిమానులు సైతం ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపడుతున్నారు. తగినంత మంది పోలీసులను కేటాయించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. విజయ్ ప్రచార సభ కోసం కరూర్‌లో సభాస్థలిని పోలీసులే ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విజయ్‌పార్టీ వర్గాలు మరో ప్రదేశాన్ని కోరితే, చివరకు పోలీసులు ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇరుకైన రోడ్లతో కూడిన ఈ ప్రాంతంలో వేలాది మంది చేరడమే ఘటనకు దారితీసినట్లు విమర్శలు వస్తున్నాయి. -
తమిళ పాలిటిక్స్.. విజయ్‌పై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో పొలిటికల్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీవీకే అధినేత విజయ్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయ్ను టార్గెట్ చేసిన ఉదయనిధి.. తాను వీకెండ్ పొలిటీషియన్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పడిన కొన్ని పార్టీలకు సిద్ధాంతం ఏమిటో తెలియదు. వారికి సిద్ధాంతం గురించి అవగాహన లేదని కనిపిస్తోంది. డీఎంకే ఎన్నికల కోసం మాత్రమే పుట్టిన పార్టీ కాదు, ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీ. సీఎం ఎంకే స్టాలిన్‌కు సుమారు 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనేక పోరాటాలతో ఆయన ప్రజా జీవితం నిండి ఉంది. మన సిద్ధాంతాన్ని యువతలోకి తీసుకెళ్లాలి. విద్యార్థులు, యువతతో మాట్లాడాలన్నారు.ఇదే సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి మాట్లాడుతూ.. ‘నేను వారంలో 4-5 రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కేవలం ప్రతీ శనివారం మాత్రమే బయటకు రాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆదివారాలను కూడా ప్రచార కార్యక్రమానికి చేర్చుకోవాలని భావిస్తున్నా. నేను వారంలో ఏ రోజు అని చూడకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండాలి' అని చెప్పుకొచ్చారు.అలాగే, ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని ఉద్దేశించి.. ఆయనకు ఎప్పుడు బీజేపీ నేత, హోంశాఖ మంత్రి అమిత్ షానే ముఖ్యమని అన్నారు. తన సొంత పార్టీ అధినేత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను కూడా మరచిపోయారని ఎద్దేవా చేశారు. ఇక, టీవీకే విజయ్.. ప్రతి శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం రోజునే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. -
వైద్య శిబిరం
వైద్యశిబిరంసీఎం వైద్య శిబిరాలను గురువారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిశీలించారు. ఆలందూరులో జరిగిన శిబిరంలో ఆయన బీపీ పరీక్షలు చేయించుకున్నారు. సాక్షి, చైన్నెసముద్ర వర్తకంసముద్ర వర్తకాన్ని ప్రోత్సహించే విధంగా బ్లూ ఎకనామిక్ కాన్ఫరెన్స్ – 2025 చైన్నె లో జరిగింది. ఇందులో చిన్న ఓడరేవుల శాఖ మంత్రి ఎ.వి.వేలును చైన్నె కామరాజర్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ సునీల్ పాలీవాల్ సత్కరించారు. ఇందులో రాష్ట్రంలో సముద్ర తీర వర్తకం, రవాణ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సాక్షి, చైన్నె హత్య కేసులో జీవిత ఖైదుఅన్నానగర్: పూర్వీకుల ఇంటిని తన పేరుకు మార్చలేదని తల్లిని దారుణంగా హత్య చేసిన కుమారుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. నైల్లె జిల్లాలోని కుడంకుళం సమీపంలోని సెట్టిక్కులంలోని అయ్యప్పన్ నగర్లో రాజన్ (41). ఇతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇతని పూర్వీకుల ఇల్లు అదే ప్రాంతంలోని సెట్టిక్కులంలో ఉంది. ఇతని తల్లి జయమణి (60) అక్కడే నివసిస్తుంది. రాజన్ చిన్నతనంలోనే తండ్రి రాజమణి మృతిచెందాడు. రాజన్ తల్లిని పూర్వీకుల ఇంటిని తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో, మే 7, 2020న తల్లిని రాజన్ పొడిచి చంపాడు. నైల్లె మహిళా కోర్టులో జరిగిన ఈ కేసులో, న్యాయమూర్తి రామలింగం గురువారం తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో రాజన్న్కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.లారీని ఢీకొన్న బస్సు●కండక్టర్ దుర్మరణం ●30 మందికి గాయాలుతిరువొత్తియూరు: పొల్లాచి సమీపంలో ఆగిఉన్న లారీని, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కండక్టర్ దుర్మరణం చెందాడు. 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కోయంబత్తూరు నుంచి దిండుగల్‌కు ప్రభుత్వ బస్సు గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సును దిండుగల్‌కు చెందిన డ్రైవర్ కాశీరాజన్ నడుపుతున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు పొల్లాచి–కోయంబత్తూరు రోడ్డు ఆచ్చిపట్టి ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగిఉన్న ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ బాలసుబ్రమణి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పొల్లాచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.సర్వ దర్శనానికి 24 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,213 మంది స్వామివారిని దర్శించుకోగా 29,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందు వెళితే భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. -
కాలువలో కారు పడి యువకుడి మృతి
అన్నానగర్: కాలువలో కారు పడిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. తెన్న్కాసి జిల్లా శంకరన్‌కోవిల్‌కు చెందిన కార్తీక్ (24), మధుబాలన్ (23), శ్రీధర్ (24). కన్యాకుమారి జిల్లా మార్తాండంకు చెందిన సంజయ్ (23). ఇతను మధుబాలన్ బంధువు. ఆ నలుగురు స్నేహితులు ఊటీకి ప్రయాణం కోసం కారులో బయలుదేరారు. కార్తీక్ కారు నడుపుతున్నాడు. విరుదునగర్ నాలుగు లేన్ల రహదారిపై ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ఎదురుగా బుధవారం ఉదయం వెళతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని స్తంభాన్ని ఢీకొని కాలువలో పడింది. ఈ ప్రమాదంలో సంజయ్ మృతిచెందాడు. కార్తీక్, మధుబాల తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాలువ బురదలో నుంచిసంజయ్ మృతదేహాన్ని వెలికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.జైల్లో ఖైదీ మృతివేలూరు: వేలూరు సెంట్రల్ జైలులో ఓ ఖైదీ మృతిచెందాడు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని కొంగల్లి గ్రామానికి చెందిన శంకర్ (77) లైంగిక వేధింపుల కేసులో ఆరణి మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. గత 2023 మార్చి 30వ తేదీన శంకర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం శంకర్ వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈనేపత్యంలో శంకర్‌కు గత నెల 20వ తేదీన కిడ్నీ సమస్యతో బాధ పడుతుండడంతో జైలు అధికారుల ఆదేశాల మేరకు శంకర్ వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. జైలు అధికారులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేస్తున్నారు.ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్యఅన్నానగర్: శ్రీపెరంబుదూర్‌లో తన ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ కాచిపట్టు ప్రాంతానికి చెందిన భూపతి (21). అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న రంజనిని ప్రేమించాడు. గత 11వ తేదీన భూపతి, రంజని మధ్య గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం కి గురైన భూపతి గత 11వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన వల్లే భూపతి ఆత్మహత్య చేసుకున్నాడని రంజని తీవ్ర మనస్తాపానికి గురైంది. బూధవారం తెల్లవారుజామున, రంజని తల్లిదండ్రులు మేల్కొని చూసేసరికి, రంజని ఫ్యాన్‌కు మృతదేహంగా వేలాడుతూ కనిపించింది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఏనుగు దాడిలో కార్మికుడి మృతితిరువొత్తియూరు: ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈరోడ్ జిల్లా కడంబూరు కొండ ప్రాంతం ఏలంజియంకు చెందిన ప్రభు (38).ఇతను అదే ప్రాంతానికి చెందిన రైతు ప్రకాష్‌కు చెందిన వ్యవసాయ తోటలో కూలీ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతను రాత్రి పూట అరటి పండ్ల తోట వద్ద రాత్రి వేళల్లో కాపలా వుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కాపలా కాస్తుండగా అర్ధరాత్రి అక్కడికి ఏనుగు వచ్చింది. దీంతో ఇరుగుపొరుగుతో కలిసి ప్రభు ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. ఆసమయంలో ఏనుగు ప్రభుపై కాళ్లతో తొక్కి దాడి చేసింది. దీంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కడంబూరు అటవీశాఖ అధికారులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఏనుగును అడవిలోకి వెళ్లగొట్టారు. ప్రభు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఉపాధ్యాయులపై దాడి– ఐదుగురు ప్లస్‌టూ విద్యార్థుల తొలగింపుఅన్నానగర్: ఉపాధ్యాయులపై దాడి కేసులో ఐదుగురు ప్లస్‌టూ విద్యార్థులను కళాశాల నుంచి తొలగించారు. కడలూరు జిల్లాలోని వేపూర్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో ట్రైనీ టీచర్‌గా పోయనప్పడి గ్రామానికి చెందిన దురైరాజ్ కుమారుడు మణికంఠన్ (24) పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 11వ తరగతి విద్యార్థులకు త్రైమాసిక పరీక్ష జరుగుతుండగా, ప్లస్‌టూ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత వారు గది తలుపు, కిటికీలు తట్టి ప్రశ్నాపత్రం గురించి వాదించుకున్నారు. కానీ టీచర్ వారిని పరీక్ష గదిలోకి అనుమతించలేదు. దీని కారణంగా, విద్యార్థులు మణికంఠన్‌పై దాడి చేశారు. వారిని ఆపిన ఉపాధ్యాయుడిపై కూడా దాడి చేశారు. దీనిపై మణికంఠన్ వేపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం, ఐదుగురు ప్లస్–2 విద్యార్థులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. తరువాత వారిని కడలూరులోని జువైనెల్ స్కూల్‌కు పంపారు. ఈ స్థితిలో, ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుంచి తొలగించారు. -
నేడు 3 మండలాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత
తిరువొత్తియూరు: చైన్నె మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ,మురుగు నీటి బోర్డు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో చైన్నెలోని తిరు.వి.కా. నగర్ మండలంలోని పట్టాలం, స్ట్రారస్ రోడ్డులో, కిల్పాక్కం తాగునీటి శుద్ధి కర్మాగారం నుంచి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన తాగునీటి పంపింగ్ పైప్‌లైన్‌కు సంబంధించిన పనులు నేడు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు జరుగుతాయి. దీని కారణంగా, పనులు జరిగే సమ యంలో తండైయార్పేట మండలంలోని తండై యార్పేట, కాసిమేడు, చాకలి పేట ప్రాంతా లు, అలాగే రాయపురం మండలంలోని కాసి మేడు, చాకలి పేట తిరు.వి.కె.నగర్ మండలంలోని ఓట్టేరి, ఐనావరం, పట్టాలం, నమ్మళ్వార్పేట, పుళియంతోపు ప్రాంతాలలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరం మేరకు తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అదనపు తాగునీటి అవసరం ఉంటే, https://cmwssb.in.gov.in వెబ్సైట్లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలనిసూచించారు.వాచ్‌మన్‌ను హత్య చేసి: మృతదేహాన్ని బావిలో పడేసిన నిందితులువేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలో అరుంగల్దుర్గం గ్రామానికి చెందిన కలీల్‌కు చెందిన భూమి ఉంది. ఇక్కడ తిరుపత్తూరుకు చెందిన సయ్యద్ ముజీబ్ కుమారుడు అస్కర్ బాషా(38) నాలుగు సంవత్సరాలుగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అస్కర్ బాషా గురువారం బావిలో మృతదేహంగా కనిపించాడు. వీటిపై స్థానికులు ఆంబూరు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో అక్కడే పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన అనిల్‌కుమార్, ఆదీద్ కలిసి అస్కర్ బాషాను హత్య చేసి మృత దేహాన్ని బావిలో వేసి అక్కడ నుంచి పరారీ అయినట్లు తెలిసింది. దీంతో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు కార్మికుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు ఏమిటి, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.రూ.8 లక్షల దోపిడీకి యత్నంతిరువొత్తియూరు: చైన్నె మన్నడి ప్రాంతానికి చెందిన అసరాత్ హుస్సేన్ (39). అతని అన్న ఆసిఫ్ అలీ (42). వారి స్నేహితులు తౌఫిక్ అబ్దుల్ రజాక్. వీరు ఖతార్‌లో పనిచేస్తున్నారు. బుధవారం చైన్నెకి వచ్చిన తౌఫిక్, అబ్దుల్ రజాక్ మన్నడి మూర్ వీధిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. వీరు ఖతార్ నుంచి వచ్చేటప్పుడు 5 ఖరీదైన సెల్ఫోన్లను తీసుకొచ్చారు. డబ్బు అవసరం కావడంతో సెల్ఫోన్లను అమ్మి ఇవ్వమని ఆసిఫ్ అలీకి చెప్పారు. దీని ప్రకారం, ఆసిఫ్ అలీ తన తమ్ముడు అసరాత్ హుస్సేన్‌కు సెల్ఫోన్లు ఇచ్చి, వాటిని అమ్మి డబ్బు తీసుకురమ్మని పంపాడు. దీని ప్రకారం, పారిమునైలోని ఈవినింగ్ బజార్‌లోని ఓ దుకాణంలో సెల్ఫోన్లను అమ్మి, రూ 8 లక్షల తీసుకొని అసరాత్ హుస్సేన్ బైక్‌పై మన్నడికి బయలుదేరాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తుల ముఠా అతన్ని అడ్డగించి కత్తి చూపించి బెదిరించి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో, అప్రమత్తమైన అసరాత్ హుస్సేన్ బైక్‌ను కింద పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై నార్త్ బీచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్లల్లో దొంగతనంసేలం: నామక్కల్ తిరుచెంగోడ్ సమీపంలోని రింగ్ రోడ్లో ఉన్న ఇడయార్పాలయం గ్రామంలో గురువారం తెల్లవారుజామున వరుసగా ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. నగలు, డబ్బు, ఇత్తడి పాత్రలు, వెండి ఉంగరాలు, టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనం, ఎలక్ట్రిక్ మోటారులను దుండగులు దొంగలించుకుని పోయారు. గ్రామంలో దాదాపు 150 ఇళ్లు ఉన్నాయి. గురువారం వేకువజామున ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్లలో చోరీ జరిగింది. గురువారం ఆటో డ్రైవర్ శక్తివేల్ (36), గ్రామంలోని గుడి ఇంట్లో నివసించే మెకానిక్ విజయకుమార్ (38), ప్రైవేట్ కళాశాలలో క్యాషియర్‌గా పనిచేస్తున్న గోపాల్ (35), శివగామి, అగియోర్ ఇళ్ల తాలాలు పగలగొట్టి ఇత్తడి పాత్రలు, బంగారు నగలు, రూ. 10,000 దోచుకున్నారు. ఒక ప్రైవేట్ కళాశాలలో మెకానిక్‌గా పనిచేస్తున్న గోపాల్ (35) ఇంటిని పడగొట్టి, ఇంటి బయట పార్క్ చేసిన టీవీఎస్ ఎక్సెల్ 100 వాహనాన్ని కూడా దొంగిలించారు. ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేసే థానప్పన్ ఇంట్లో నుండి విద్యుత్ మోటారును కూడా దొంగిలించారు. తిరుచెంగోడ్ గ్రామీణ పోలీసులు వేలిముద్ర నిపుణులను పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్ లిఫ్టింగ్‌లో విజయం
ఆమె బరువులు ఎత్తడం మాత్రమే కాదు..మన స్ఫూర్తిని కూడా పైకి ఎత్తుతోంది అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు గుప్పించారు. సాక్షాత్తూ మహీంద్రా గ్రూప్ అధినేతగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆయన లాంటి ప్రముఖుడి నుంచి ప్రశంసలు అందుకున్న ఆమె అత్యంత సాదా సీదా వ్యక్తి. మరీ ముఖ్యంగా 82 ఏళ్ల వయసున్న వృద్ధురాలు. ఆ వయసులో ఆమె బరువులు ఎత్తడమే విచిత్రం అనుకుంటే ఆ పని ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఉండడం గొప్ప విశేషం. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పరిధిలో ఉన్న పొల్లాచ్చి అనే చిన్న పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు ఆనంద్ మహీంద్రాకు ప్రేరణగా నిలిచింది. శారీరక సామర్ధ్యానికి వయస్సు అడ్డంకి కాదని ప్రపంచానికి నిరూపించడమే ఆ ప్రేరణకు కారణం. ఇటీవల పవర్ లిఫ్టింగ్ ఛాంపియషిప్లలో పోటీ పడి అందరినీ ఆశ్చర్యపరిచిన కిట్టమ్మాళ్ ధైర్యసాహసాలు శక్తి సామర్ధ్యాల కథ దానికి ఆనంద్ మహీంద్ర ప్రశంసలు ఇవన్నీ వైరల్‌గా మారాయి.80 వర్సెస్ 30...ఇటీవల కునియాముత్తూరులో జరిగిన ’స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో కిట్టమ్మాళ్ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది, అక్కడ ఆమె పోటీ పడింది తన వయసుకు కాస్త అటూ ఇటూగా ఉన్నవారితో కూడా కాదు ఏకంగా 30 ఏళ్లలోపు ఉన్న మహిళలతో పోటీపడింది. పోటీలో పాల్గొన్న మొత్తం 17 మంది ఇతర మహిళలతో పోటీ పడి ఆమె ఐదవ స్థానాన్ని దక్కించుకుంది, ఓపెన్ ఉమెన్స్ విభాగంలో 50 కిలోల బరువును డెడ్‌లిఫ్టింగ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.ఇంటి పనులే రాటు దేల్చాయి..తను ఇంటి రోజువారీ అవసరాల్లో భాగంగా చేసిన పనులే తనను వెయిట్ లిఫ్టర్‌గా మార్చాయి అంటున్నారు కిట్టమ్మాళ్. ప్రతిరోజూ 25 కిలోల బియ్యం సంచులను మోయడం డజన్ల కొద్దీ కుండల నీరు మోస్తూ తీసుకురావడం అలవాటు అయిందని అదే తనను రాటు దేల్చిందని వివరించారు. తద్వారా బలశిక్షణ తనకు సహజంగానే సాధ్యమైందని చెప్పారు. తన శక్తిని గుర్తించిన తన మనవళ్లు రోహిత్, రితిక్లచే మార్గదర్శకత్వంతో తాను ఇంటి బరువుల నుంచి జిమ్ శిక్షణకు మారానని తెలిపారు. గత నెల రోజులుగా డెడ్‌లిఫ్టింగ్ పద్ధతులను నేర్చుకుంంటూ వచ్చానన్నారు. దీనితో పాటే తన స్టామినాకు తన జీవితకాలపు ఆహారపు అలవాట్లు కూడా కారణమయ్యేయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యార్ధులైన ఆధునికులు అందరూ జపిస్తున్న మిల్లెట్ మంత్రాన్ని ఆమె ఎప్పటి నుంచో ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆమె (రాగులతో చేసిన జావ సజ్జలతో గంజి... గుడ్లు, మునక్కాయ సూప్, వంటివి తీసుకుంటూ అపరిమిత శక్తి సామర్ధ్యాలను స్వంతం చేసుకున్నారు.ఆమె గురించి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే...82ఏళ్ల వయసులో ఒక మహిళ బరువులు లిఫ్ట్ చేయడం మాత్రమే కాదు మనలోని స్పిరిట్‌ని లిఫ్ట్ చేస్తోంది. ఉత్సాహంగా జీవించడానికి, ధైర్యంగా కలలు కనడానికి మీ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ ఆలస్యం అనేది లేనే లేదని గుర్తు చేస్తుంది. వయస్సు లేదా సాంప్రదాయ జ్ఞానం పరిమితులను నిర్ణయించదు. మీ సంకల్ప శక్తి మాత్రమే నిర్ణయిస్తుంది.At 82, a woman is lifting not just weights but our spirits., winning powerlifting championships and defying every cliché about age.She’s a reminder that it’s never too late (or too early) to live with vigour, to dream boldly, and to pursue your goals.Age or conventional… pic.twitter.com/fCLQO1PoDJ— anand mahindra (@anandmahindra) September 1, 2025(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
తమిళ పాకానికి అమెరికా వణక్కం!
తల్లి చేతి వంట రుచి, ఊరి వీథుల్లోని మిఠాయిల తియ్యదనం– ఇవన్నీ ఇప్పుడు న్యూయార్క్ వేదికపై ప్రపంచానికి కమ్మగా వడ్డిస్తున్నాయి. ఫుడ్ ప్రపంచంలో ఆస్కార్గా పరిగణించే ‘జేమ్స్ బీర్డ్ అవార్డు’ను ఒక భారతీయుడు సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. మదురై వీథుల్లో తిరిగిన చిన్నోడు, ఈరోజు న్యూయార్క్ బిలియనీర్ల సరసన నిలిచాడు. కారణం ఒక్కటే, అతని చేతి వంట! మదురైలోని నాథం గ్రామంలో పుట్టిన విజయ్ ఇంజినీర్ కావాలని కలలు కన్నాడు. కాని, ఫీజులు కట్టలేక వంట స్కూల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇది అతని జీవితానికి మలుపు అయినప్పటికీ, వంట మీద ఉన్న చిన్ననాటి ప్యాషన్ అతన్ని ముందుకు నడిపింది. ‘ప్రతి వంటకం వెనుక ఒక కథ, ఒక కళ ఉంటుంది’ అని నమ్మాడు. చెన్నైలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి, ‘తాజ్ కనెమారా హోటల్’లో మొదటిసారి షెఫ్‌గా మారాడు. తర్వాత అమెరికా ప్రయాణం అతని ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ‘దోసా’, ‘రాసా’లాంటి రెస్టరెంట్లలో పనిచేస్తూ వంటలో మరింత ప్రావీణ్యం సాధించాడు. కాని, ఆ మార్గం అంత సులభం కాలేదు. క్రూజ్ షిప్‌లలో వంట చేస్తూ సముద్రాలను దాటాడు, అమెరికాలో జాతి వివక్ష చేదును కూడా రుచి చూశాడు. అయినా, అతని మనసు ఎప్పుడూ ఒకటే చెప్పేది ‘వంట చేయి, నీలా చేయి, నిజంగా చేయి.’ అదే సమయానికే రోనీ, చింతన్ అనే ఇద్దరు ఫుడ్ రెబల్స్ అతని కథలోకి వచ్చారు. వారి ప్రోత్సాహంతో విజయ్ తెరిచిన ‘సెమ్మా’ కేవలం ఒక రెస్టరెంట్ మాత్రమే కాదు, అది తమిళ పాకకళకే ప్రపంచ వేదిక అయ్యింది. ఒకప్పుడు ‘ఫస్ట్ ర్యాంక్ తెచ్చి కుక్ అవుతావా?’ అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు అతని రెస్టరెంట్లో టేబుల్ బుకింగ్ కోసం ఏటా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ట్రఫుల్ ఆయిల్, కేవియర్ తినే వాళ్లు కూడా ఇక్కడ చేతులతో దోసె ముక్కలు సాంబార్లో ముంచి తింటూ ఆశ్చర్యపోతున్నారు. మొదట స్పైసీగా అనిపించినా, చివరికి ఆ రుచులే వారిని మళ్లీ మళ్లీ రప్పిస్తున్నాయి. సెమ్మా ప్రారంభమైన ఏడాదికే ‘మిషెలిన్ స్టార్’ దక్కించుకుంది. 2023లో న్యూయార్క్ టైమ్స్ ‘నంబర్ వన్ రెస్టరెంట్’గా గుర్తింపు పొందింది. ఇప్పుడు 2025లో ఫుడ్ ప్రపంచంలో ఆస్కార్గా భావించే ‘జేమ్స్ బీర్డ్’ అవార్డు కూడా విజయ్‌కుమార్ సొంతమైంది. స్టేజ్ మీద నిలబడి అతను అన్న మాటలు మరింత మనసును హత్తుకున్నాయి. ‘నల్ల చర్మం కలిగిన ఒక తమిళుడు ఇంత పెద్ద వేదికపై నిలబడతాడని ఎవరూ అనుకోలేదు. ఇది నా విజయం మాత్రమే కాదు, మా అమ్మ వేసే దోసెది, నా అమ్మమ్మ మట్టి పాత్రలో వండిన చేపల పులుసుదీ, మొత్తం భారతీయ వంటల రుచిదీ.’ అంటూ అవార్డును దేశ వంటల గొప్పతనానికి అంకితం చేశాడు. కుటుంబం కూడా! ఈ విజయానికి వెనుక అతని కుటుంబమే అండగా నిలబడి ఉంది. తల్లి, అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న వంటల జ్ఞానం, వారి వంటల్లోని బంధమే ఈరోజు విజయ్‌కుమార్‌ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. లగ్జరీ ఇన్‌గ్రీడియంట్స్ కంటే నిజమైన కరివేపాకు వాసన, కొబ్బరి రుచి, మసాలాలే నిజమైన లగ్జరీ అని వాళ్లే నేర్పారు. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
వేళచ్చేరి పోలీస్‌స్టేషన్ ముట్టడి
అన్నానగర్: చైన్నెలోని తరమణి లా కాలేజీ విద్యార్థులు వేళచ్చేరి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి, నిరసన తెలిపారు. చైన్నెలోని వేళచ్చేరి తరమణి రోడ్డులోని ఒక టీ దుకాణం వద్ద 27వ తేదీ అర్ధరాత్రి కొంతమంది లా కాలేజీ విద్యా ర్థులు గుమిగూడారు. ఆ సమయంలో, పెట్రోలింగ్‌లో ఉన్న వేలచ్చేరి పోలీస్‌స్టేషన్‌కు చెందిన సంపత్ అనే పోలీసు అధికారి, మీరు ఇక్కడ ఎందుకు గుమిగూడారని వారిని అడిగాడు. దీంతో కరికల్వన్ అనే లా కాలేజీ విద్యార్థికి, పోలీసు అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో, వారు ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం ప్రారంభించి గొడవకు దిగారని తెలిసింది. ఈ పరిస్థితిలో గురువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో తరమణి లా కాలేజీ విద్యార్థులు వేళచ్చేరి పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. హెడ్ కానిస్టేబుల్ సంపత్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తరువాత, సీనియర్ పోలీసు అధికారులు నిరసన తెలుపుతున్న విద్యార్థులను పిలిచి చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు శాంతి చర్చల తర్వాత లా కాలేజీ విద్యార్థులు నిరసనను విరమించారు.267 కిలోల బంగారం ఎక్కడ?కొరుక్కుపేట: 2024 జూన్‌న్‌లో బంగారం అక్రమ రవాణా సంఘటన జరిగింది. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో రూ.167 కోట్ల విలువైన 267 కిలోల బంగారాన్ని దుబాయ్ సహా విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేశారని తేలింది. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, కస్టమ్స్ విభాగం ఇంకా ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేదు. నిందితుడు విదేశాల్లో పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. ఈకేసులో ఒక్క గ్రాము బంగారం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఏడాది అవుతున్నా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది.బీజేపీ నిర్వాహకుడి హత్యతిరువొత్తియూరు: శివగంగైలో గురువారం రాత్రి మద్యం తాగుతున్న సమయంలో జరిగిన గొడవలో బీజేపీ నిర్వాహకుడిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శివగంగైలోని మజిత్రోడ్ ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ (51) బీజేపీ వ్యాపార విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన శివగంగైలోని వారపు సంతలో ద్విచక్ర వాహనాల మెకానిక్ షాపు నడుపుతున్నారు. ఈ క్రమంలో, గురువారం రాత్రి మెకానిక్ షాపులోని విడిభాగాల గోదాములో సతీష్ కుమార్, షాపు ఉద్యోగి మణిభారతి పక్కగదిలో నివసిస్తున్న మరో ఐదుగురు కలిసి మద్యం సేవించారు. అప్పుడు సతీష్ కుమార్ ఆ ఐదుగురి మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం జరిగి, ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఐదుగురు కలిసి సతీష్ కుమార్‌పై దాడి చేయగా, ఆయన కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో మణిభారతి కూడా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు సతీష్ కుమార్, మణిభారతిని చికిత్స నిమిత్తం శివగంగై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సతీష్ కుమార్‌ను పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే మరణించినట్లు తెలిపారు. గాయపడిన మణిభారతి చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.ఆమ్ని బస్సు ఆలస్యం – ప్రయాణికుల ఆందోళనతిరువొత్తియూరు: కన్యాకుమారికి వెళ్లేందుకు ఒక సంస్థకు చెందిన రెండు ప్రైవేట్ బస్సుల్లో ఆన్‌న్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వంద మందికి పైగా ప్రయాణికులు గురువారం రాత్రి కోయంబేడు ఆమ్ని బస్టాండ్‌కు వచ్చారు. అయితే, నిర్ణీత సమయానికి రావలసిన రెండు బస్సులు రాలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేశారు. బస్సు కంపెనీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీని గురించి ప్రయాణికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వగా, వానగరం పోలీసులు వచ్చి ప్రయాణికులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.శ్రీవారి దర్శనానికి 10 గంటలుతిరుమల: శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 63,843 మంది స్వామివారిని దర్శించుకోగా 21,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
మినీ బస్సు బోల్తా 12 మందికి తీవ్రగాయాలు
తిరుత్తణి: మినీ బస్సు బోల్తాపడిన ఘటనలో ప్రయివేటు కర్మాగారానికి చెందిన 12 మందికి గాయాలయ్యాయి. శ్రీపెరంబదూరులోని ప్రయివేటుకు చెందిన మద్యం కంపెనీలో తిరువలంగాడు యూనియన్‌లోని అడిక్కల్పట్టు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు పనిచేస్తున్నారు. కర్మాగారానికి చెందిన మినీబస్సులో రాకపోకలు సాగిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం యథావిధిగా అడిక్కల్పట్టు గ్రామానికి చెందిన 8 మంది మహిళలు సహా 12 మంది ప్రయాణిస్తున్నారు. అరుంగుళం వద్ద రోడ్డు పనుల కోసం వుంచిన చిప్స్ పక్కగా బస్సు వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు అదుపుతప్పి సమీపంలోని కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడి బస్సులో చిక్కుకున్న కార్మికులను స్థానిక గ్రామస్తులు బయటకు తీసి తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఇందులో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.విద్యుత్ సంక్షోభ నివారణకు కొత్త ప్రణాళికకొరుక్కుపేట: వచ్చే ఏడాది వేసవిలో తమిళనాడులో పెరుగుతున్న విద్యుత్ సమస్య పరిష్కారానికి తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పరిరక్షణ సంస్థ ఏటా ఖర్చు చేసే రూ.2 వేల కోట్లకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో వార్షిక వేసవి విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రైవేట్ కంపెనీల నుంచి రూ.2 వేల కోట్లతో 6 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది తమిళనాడు విద్యుత్ బోర్డు ఆర్థిక స్థితిని ప్రభావితం చేసింది. ఈ సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయి ఏప్రిల్ 2025లో 20,830 మెగావాట్లు. ఇది 2026 వేసవి నాటికి 23 వేల మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. వేసవిలో 7500 మెగావాట్ల లోటు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, విద్యుత్ బోర్డు విద్యుత్ ప్రసార వ్యవస్థ ద్వారా మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఉత్తరాది రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుని, తమిళనాడులో పవన విద్యుత్ ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తిరిగి ఇస్తుందన్నారు. అందువల్ల, తమిళనాడు ప్రభుత్వం వేసవిలో సాధారణంగా జరిగే రూ. 2 వేల కోట్ల ప్రైవేట్ కంపెనీ సేకరణకు బదులుగా విద్యుత్ ప్రసార వ్యవస్థ ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.ఘనంగా తెలుగు భాషా దినోత్సవంకొరుక్కుపేట: శ్రీ కన్యాకా పరమేశ్వరీ మహిళా కళాశాల ఐ క్యూ ఏసీ, సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం – గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష ప్రాముఖ్యత అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ కేపీడీ మాజీ ట్రస్టీ ఊరా ఆంజనేయులు విచ్చేశారు. కళాశాల కరస్పాండెంట్ వూటకూరు శరత్‌కుమార్, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ పీబీ వనీత, వైస్ ప్రిన్సిపల్ ఎన్వీ నప్పినై , ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ పి.భరణి కుమారి, తెలుగు విభాగాధిపతి మైథిలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి ఊరా ఆంజనేయులు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి త్యాగస్ఫూర్తి, మహత్తర కృషి ఎనలేనిదన్నారు. తెలుగు భాషను గ్రాంధికం నుంచి సాధారణ ప్రజలకూ అర్థమయ్యే వ్యవహారిక భాషగా మార్చిన ఘనత గిడుగుకే దక్కిందన్నారు.విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి.. గణేష్ చతుర్థి వేడుకలో అపశృతిఅన్నానగర్: గణేష్ చతుర్థి వేడుకలో విద్యుత్ షాక్‌కు గురై ప్లస్–2 విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని కట్టుకుడలూర్కు చెందిన ఇరుసప్పన్, లత దంపతులకు నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రామ జయం (17) ప్లస్–2 చదువుతున్నాడు. గురువారం సాయంత్రం గ్రామంలోని బాల మురుగన్ ఆలయంలో గణేశ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు. వేడుకల్లో రామజయం లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. పోలీసులు కేసు నమేదు చేసి విచారణ జరుపుతున్నారు. -
పుష్ప స్టైల్ వినాయకులు.. దర్శనానికి పోటెత్తిన మహిళా అభిమానులు!
పుష్ప క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మేనరిజానికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. పుష్పరాజ్‌కు ఉన్న క్రేజ్‌తో తాజాగా వినాయక చవితికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని హోసూరుకు చెందిన ఫ్యాన్స్ పుష్ప మూవీ సెట్ తరహాలో ఏర్పాటు చేశారు. ఎర్రచందనం దుంగల సెటప్‌తో అచ్చం పుష్ప స్టైల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఈ పుష్ప స్టైల్లో ఉన్న వినాయక విగ్రహాలను చూసేందుకు అభిమానులే కాదు.. భక్తులు కూడా పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ వినాయక చవితి రోజున పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశారు. ఫైనల్‌గా దర్శనం పూర్తయిందని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహాలను దర్శించుకునేందుకు వచ్చినవారిలో మహిళ అభిమానులు, భక్తులు కూడా ఉన్నారు. ఇది చూసిన పుష్పరాజ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.గతేడాది డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.Finally Darshanam Completed 👍 pic.twitter.com/QYYjb9PpKM— Chennai Murug🅰️🅰️n (@ChennaiMurugAAn) August 28, 2025 -
పుష్ప స్టైల్లో వినాయకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ఈ మూవీతో పాన్ వరల్డ్ హీరోగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక పుష్పరాజ్ మేనరిజంకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.తాజాగా వినాయక చవితి వేడుకల్లో పుష్పరాజ్ స్టైల్లో గణేశున్ని అలంకరించారు. ఎర్రచందనం దుంగల తరహాలో గణేశుని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీ అభిమానం సల్లగుండా అంటూ ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పుష్ప స్టైల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి తమిళనాడులోని హోసురుకు చెందిన ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ దట్ ఈజ్ పుష్ప క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. బన్నీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_) -
తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే..
వినాయకుడు.. అనగానే ఎవరికైనా ముందుగా పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్ర ఆకృతి గుర్తుకు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా మానవముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? వినాయక చవితి వేళ ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు.తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ గణపతి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆది వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. విఘ్నేశ్వరునికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకునిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం కనిపిస్తుంది.గ్రానైట్ తో నరముఖ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ గణపతి.. గొడ్డలిని చేతితో పట్టుకుని దర్శనమిస్తాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారని నమ్ముతారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు గణేషుశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది.కొంత సేపటికి శివుడు గృహానికి రాగా, ఆ ప్రాంగణంలోకి వచ్చేందుకు శివుణ్ణి.. వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తల నరుకుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి.. శివునిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై, మానవముఖానికి బదులుగా పార్వతి తనయునికి ఏనుగు తలను పెట్టి బతికిస్తారు. -
విజయ్ టీవీకే సభలో తొక్కిసలాట.. పలువురి పరిస్థితి విషమం!
సాక్షి,చెన్నై: కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన బారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. మధురైలో గురువారం సాయంత్రం జరుగుతున్న ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరుకాగా.. తొక్కిసలాటతో 400మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కగళం(టీవీకే) గురువారం మధురైలో నాలుగు లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధురై జిల్లాలోని మధురై-తూత్తుకుడి హైవేలో పరపతిలో టీవీకే రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరుగుతోంది. 501 ఎకరాల్లో సచివాలయం ఆకారంలో ఈ సభను ఏర్పాటు చేసింది.ఈ భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనసంద్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని ఇళయదళపతి హీరో విజయ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ, డీఏంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని పేర్కొంది. -
‘రాధాకృష్ణన్‌తో లాభం లేదు.. ఇండియాకు మనం గట్టి అభ్యర్థిని నిలబెడదాం’
సాక్షి, చెన్నై: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. కూటమి తరఫున ఎవరిని బరిలో నిలపాలి అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని డీఎంకే సీనియర్ నాయకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సదరు నేత అంతటితో ఆగకుండా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌తో తమిళనాడుకు ప్రయోజనం లేదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం సమావేశమయ్యారు. కూటమి పార్లమెంటరీ పక్ష నేతలు.. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నాయకులు ఇళంగోవన్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది భారత ఉప రాష్ట్రపతి పదవి. రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థి.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదు. దీన్ని భాష ద్వారా మాత్రమే కాకుండా రాజకీయంగా చూడాలి.#WATCH | Chennai, Tamil Nadu: On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, DMK Leader TKS Elangovan says, "He is an RSS man. He is a BJP candidate. You should view this politically, not as per language...I don't know why the poor man… pic.twitter.com/I1IxxxH2Ij— ANI (@ANI) August 18, 2025బీజేపీ నేతృత్వంలోని బీజేపీ.. ఇప్పటికే పలుమార్లు తమిళులను అవమానించింది. బీజేపీ.. తమిళుల కోసం పనిచేయలేదు. కేంద్రంలోని పెద్దలు.. తమిళనాడు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే నుంచే అభ్యర్థి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే రాధాకృష్ణకు పోటీగా తమిళనాడు నుంచే.. అది కూడా డీఎంకే నుంచి అభ్యర్థి ఎంపిక చేయాలని కోరుతున్నాను అని అన్నారు. చివరగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇండియా కూటమిలో కొంత మంది నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.కూటమి మల్లగుల్లాలు..కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, సిద్ధాంతపరమైన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్..
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులను కలవరపెట్టింది. విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని, అదృష్టం కొద్దీ బతికిపోయామని ఆయన సోమవారం తెలిపారు. ‘ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 2455లో బయల్దేరాం. నాతో పాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులున్నారు. విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్‌ను చెన్నై ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నట్లు కెపె్టన్ ప్రకటించారు. అందరిలోనూ భయం నెలకొంది. అక్కడా ల్యాండింగ్‌కు వెంటనే అనుమతి లభించకపోవడందో విమానం రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. అందరం ఊపిరి పీల్చుకున్నాం’అని కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కెపె్టన్ ముందు చూపువల్ల తాము బతికి బయటపడ్డామని, అదృష్టవంతులమని చ్పెఆరు. అయితే.. విమానంలో భద్రత అదృష్టం మీద ఆధారపడి ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీసీఏ, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే వేణుగోపాల్ ప్రకటనపై ఎయిరిండియా స్పందించింది. ఆదివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే.. రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల విమానంగాల్లో చక్కర్లు కొట్టలేదని, చెన్నై ఏటీసీ సూచన మేరకే అలా చేయాల్సి వచి్చందని తెలిపింది. ‘ప్రియమైన వేణుగోపాల్‌గారు అనుమానిత సాంకేతిక సమస్య, అననుకూల వాతావరణం వల్ల చెన్నైకి మళ్లింపు జరిగింది. అయితే ల్యాండింగ్ ప్రయత్నంలో ఏటీసీ ఒక రౌండ్–అరౌండ్ సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా నిర్వహించేందుకు మా పైలట్లు బాగా శిక్షణ పొందారు. వారు ప్రామాణిక విధానాలను అనుసరించారు. అలాంటి అనుభవం కలవరపెడుతుందని మాకు అర్థమైంది. మళ్లింపు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. భద్రత ఎల్లప్పుడూ మా ప్రాధాన్యత. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’అని పేర్కొంది. కాగా, ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం 8:17 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరింది. 10:35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున 1:40 గంటలకు బయలుదేరి 3:58 గంటలకు ఢిల్లీ చేరుకుంది. -
విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త
చెన్నై: కాంచీపురం జిల్లాలోని సుంగువార్ చత్రం సోగండికి చెందిన మదన్ (42). తాగునీటి డబ్బాలు పంపిణీ చేసే వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. ఇతని భార్య లైలా కుమారి (36). వీరిద్దరూ 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దంపతుల మధ్య విభేదాల కారణంగా, వారు విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మదన్ 2 సంవత్సరాల క్రితం సుకన్యను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత, మదన్ తన విడాకులు తీసుకున్న మొదటి భార్య లైలాతో తిరిగి కలిశాడు. ఈ విషయం సుకన్య కు తెలిసింది. ఇద్దరికీ కుటుంబ సమస్య ఏర్పడింది. దీని కారణంగా, మదన్ తన రెండవ భార్య ప్రోద్బలంతో తన మొదటి భార్య లైలా కుమారిని చంపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలో లైలా తల్లి వసంత సుంగువారిచత్రం పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో మొదటి భార్య లైలా కుమారిని హత్య చేసినట్లు మదన్ శుక్రవారం సుంగువారి చత్రం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన మొదటి భార్య లైలా కుమారిని సోగండిగాయ్కు తీసుకువచ్చి, ఆమెను హత్య చేసి తిరువళ్లూరు జిల్లాలోని తిరుపాండియూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ తోటలో పాతిపెట్టాడని కూడా వెల్లడైంది. హత్య చేసి పాతిపెట్టిన లైలా మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పోలీసులు శనివారం మదన్ ను తిరు పాండియూర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. తరువాత లైలా కుమారి మృతదేహాన్ని తిరువళ్లూరు ఆర్టీఓ సమక్షంలో బయటకు తీసి, అక్కడ శవపరీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మహిళా సైనికురాలు.. కారణం ఏంటంటే?
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.ఆ వీడియో వైరల్‌గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించామని పోలీసులు తెలిపారు.అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year. What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025 -
బస్సు నంబర్ 70 కనిపించడం లేదు
చెన్నై: బస్సు నంబర్ 70 కనిపించడం లేదు. గంటల తరబడి వేచి ఉన్నా ఏక్కడా కనిపించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని ఆవడి నుంచి వండలూరుకు సిటీ బస్సు రూట్ నంబర్ 70 నడుస్తోంది. ఈ బస్సు 1982 సంవత్సరం నుండి నడుస్తోంది. అప్పటి నుండి ప్రతిరోజూ 35కి పైగా సర్వీసులు నడపబడుతున్నాయి. ఆ తర్వాత ఈ మార్గంలో 70వ నంబర్ బస్సులను అకస్మాత్తుగా నిలిపివేశారు. ఈ బస్సులను అకస్మాత్తుగా ఆపడానికి ఎటువంటి కారణం చెప్పలేదు. దీని తరువాత ప్రయాణికులు 70వ నంబర్ బస్సులను నడపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ఈ బస్సులు మళ్లీ ఆవడి–వండలూరు మధ్య నడపబడ్డాయి. కానీ బస్సుల సంఖ్యను 35 నుండి 15కి తగ్గించారు. ప్రస్తుతం ఆ 15 సర్వీసులు కూడా నడపడం లేదు. రోజురోజుకూ బస్సుల సంఖ్య తగ్గుతోంది. బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో రోడ్లపై బస్సులు కనిపించడం లేదు. దీని కారణంగా అంబత్తూరు ప్రాంత ప్రజలు బస్సు నంబర్ 70 కోసం వెతుకుతున్నారు. అది కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై అంబత్తూరు ప్రాంత ప్రజలు మాట్లాడుతూ ఆవడి–వండలూరు మధ్య సిటీ బస్సు రూట్ నంబర్ 70ను పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉపయోగించేవారు. అయితే సంఖ్య తగ్గించబడింది. ప్రయాణికుల అవసరం దృష్ట్యా అదనపు బస్సులను నడపాలని అధికారులను అభ్యర్థించామన్నారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ బస్సులను తక్కువగా నడుపుతున్నామని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. అలాగే పాడి ప్రాంతంలో నివశించే చాలా మంది బస్సు నంబర్ 70పై ఆధారపడుతున్నారు. వారు ఈ బస్సులో తాంబరంతో సహా ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. దక్షిణ రైల్వే ప్రస్తుతం తాంబరం నుండి దక్షిణ జిల్లాలకు అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. దీని కారణంగా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టుకోవడానికి వెళ్లేవారు. తాంబరం వెళ్లడానికి వారు బస్సు నంబర్ 70 బస్సులను ఉపయోగిస్తున్నారు. అందుకే బస్సు నంబర్ 70 అదనపు బస్సులను నడపాలి అని కోరుతున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తధ్యమని తమిళ ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ ఎన్నికల శంకరావం పూరించారు. పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా మైటీవీకే పేరుతో యాప్‌ను లాంచ్ చేశారు. బుధవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం పనయూర్‌లో బూత్ లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో విజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మేం భారీ విజయం సాధిస్తాం. టీవీకే తరహా కొత్త పార్టీలు 1967,1977 జరిగిన నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. ఆ రెండు దఫాల ఎన్నికల్లో అప్పటికే రాష్ట్రంలో బలమైన పార్టీలను.. ఈ కొత్త పార్టీలు ఓటమిని రుచిచూపించాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కంజీవరం నటరాజన్ అన్నాదురై సిద్ధాంతాల్ని ప్రస్తావించారు. అన్నాదురై తరహాలో ప్రజల్ని కలవబోతున్నాం. ప్రజల్లో ఉండటం, వారితో ప్రణాళికలు రచిచడం, ప్రజల కోసం జీవించడం. ఈ పనిలు సరిగ్గా చేస్తే ఎన్నికల్లో విజయం ఖాయం. దీంతో పాటు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో గెలవగలం. అందుకే మై టీవీకే పేరుతో యాప్ లాంచ్ చేసినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రజల్లోకి పార్టీ చొచ్చుకుని పోయేలా కార్యకలాపాలు నిర్వహించనున్నాం’ అని తెలిపారు -
తమిళనాడులో గబ్బిలాల చిల్లి చికెన్
-
రిషబ్ పంత్ స్ధానంలో 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. ఎవరీ జగదీశన్?
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరగనున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్‌లో టెస్టులో బంతి బలంగా తాకడంతో కుడి కాలి బొటనవేలి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది."మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సిరీస్‌లోని ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని" ఆశిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా ఇది నిజంగా భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్‌తో సెలక్టర్లతో భర్తీ చేశారు.జట్టులో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికి, బ్యాకప్ వికెట్ కీపర్‌గా జగదీశన్‌ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరీ జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ జగదీశన్..?తమిళనాడుకు చెందిన టాలెంటడ్ వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్.. దేశవాళీ క్రికెట్లో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నారాయణ్.. 47.50 సగటుతో 3,373 పరుగులు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్లో జగదీశన్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లతో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు అతడి పేరిట ఉన్నాయి.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్ -
రాహుకేతు పూజలు : తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం
జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు దోష పూజలు చేయించుకోవడం తెలుగువారి మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది.అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఉత్తర శ్రీకాళహస్తిగా పేరు పొందిన ఈ క్షేత్రం తమిళులకు అత్యంత పవిత్రమైనది. తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని ఒక్కటిగా కలిగి ఉన్న పవిత్ర స్థలమే తిరుప్పాంపురం. సాక్షాత్తూ సర్పాలే తమకు కలిగిన దోషాన్ని ఇక్కడకు వచ్చి తొలగించుకున్న గాథలు ఉన్నాయి. తిరుప్పాంపురం ఆలయంలో ఉన్న దైవం పేరు శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్య తీర్థం ఆదిశేష తీర్థం. ఈ ఆలయ విశిష్టతను తమిళ వాల్మీకిగా కొనియాడబడిన తిరునావుక్కరుసు వంటివారు కొనియాడారు. స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు రాహుకేతువులు తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయి తల్లడిల్లాయి. అవి తమ తప్పును తెలుసుకుని తమకు శాపవిమోచనం కల్పించవలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. దాంతో బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రి రోజున తిరు΄్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి ఆ ఏడాది మహాశివరాత్రిరోజు తెల్లవారు ఝామునే తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తీర్థానికే ఆదిశేష తీర్థమని పేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణ గాథలున్నాయి. ఇదీ చదవండి: అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజి చక్రవర్తిపాలనలో ఈ ఆలయానికి వసంతమండ΄ాన్ని, తూర్పుదిక్కుగా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగానే ఆదిశేష తీర్థం ఉంది. ఇక్కడ ఉన్న వినాయక విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంభారాలు ఇక్కడే లభిస్తాయి. సర్పదోష నివృత్తి కోసం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేయించుకుంటూ కనిపిస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. చదవండి: అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చఎలా వెళ్లాలంటే..?తమిళనాడులోని కుంభకోణం నుంచి కారైక్కాల్ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి కుంభకోణానికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుప్పాంపురం వరకు వెళ్లడానికి మినీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసు బస్సులు ఉన్నాయి. చూడదగ్గ ఇతర ప్రదేశాలు: సాధారణంగా తమిళనాడులోని నవగ్రహాలయానికి వెళ్లే వారు ఇక్కడికి వస్తుంటారు లేదంటే ఇక్కడికి వచ్చినవారు నవ గ్రహాలయానికి వెళ్తారు. అలాగే కుంభకోణంలోని ఐరావతీశ్వరన్ ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం, ఆదికుంభేశ్వరన్ ఆలయం, సారంగపాణి ఆలయం, ఆరుల్మిగు స్వామినాథన్ ఆలయం, సూర్యనాయర్ కోయిల్, పట్టీశ్వరం ఆలయం తదితరాలున్నాయి.– డి.వి.ఆర్. భాస్కర్ -
ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం
-
జెమ్ జెన్సీ
కొన్ని విజయాలు వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు. ఎంతోమందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చే విజయాలు. ‘జీవితం అంటే నిత్య నరకం’ అనుకున్న నిరాశామయ, నిస్సహాయ స్థితిలోనూ ‘విద్య’ అనే ఆయుధాన్ని నమ్ముకుంది ఎన్.జెన్సీ. ఆ ఆయుధం తనకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. దేశంలో ఆంగ్లభాషా విభాగంలో డాక్టరేట్ అందుకున్న, అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా నియామకం అయిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా అరుదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది...బాల్యం ఎవరికైనా వరం. స్వర్గం. ఒక దశ వరకు ఆ అబ్బాయి స్వర్గంలోనే ఉన్నాడు. క్రమంగా ఆ అబ్బాయి మాటతీరు, నడక తీరులో మార్పులు కనిపించాయి. అవి కొని తెచ్చుకున్న మార్పులు కాదు. అయినప్పటికీ ఆ బాలుడి తల్లిదండ్రులకు బొత్తిగా నచ్చలేదు. ‘అలా మాట్లాడుతున్నవేమిటి?’ ‘అలా నడుస్తున్నావేమిటి!’... ఇలా రకరకాలుగా తిట్టేవాళ్లు. ఇక స్కూల్లో నిత్యనరకం.తోటి పిల్లల నుంచి ఉ పాధ్యాయుల వరకు ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేసి ఏడిపిస్తూనే ఉండేవారు. ఒకానొక సమయంలో బడికి వెళ్లాంటే భయపడే పరిస్థితి వచ్చింది. ‘బడికి వెళ్లేది పాఠాలు వినడానికా! అవమానాల పాలు కావడానికా!’ అని మనసు ప్రశ్నించింది. అంతా చీకట్లోనూ ఒక ఆశాకిరణం కనిపించింది. ఆ వెలుగు పేరు... చదువు. ఆ వెలుగు దారిలో ఆ బాలుడి నడక ప్రారంభమైంది. అప్పటి ఆ బాలుడే... నేటి జెన్సీ.తమిళనాడులోని తిరుత్తణికి చెందిన జెన్సీ చెన్నైలోని అంబేద్కర్ ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ., ఎం.ఫిల్.లో గోల్డ్‌మెడల్ సాధించింది. ఆ బంగారు పతకాలు తన ఆత్మవిశ్వాసాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. ఇంకా ఏదో సాధించాలి అనే తపనను పెంచాయి. చెన్నై లయోలా కాలేజీలో ఆంగ్ల భాషా విభాగంలో డాక్టరేట్ అందుకొని, అదే కాలేజిలో అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా నియామకం అయ్యింది. ‘ఇది నా విజయం కాదు. మా ట్రాన్స్ కమ్యూనిటీ విజయం. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాను. ఎన్నో కష్టాలూ అనుభవించాను. అయితే... చదువు మనుషుల వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుతుంది. ధైర్యాన్ని ఇచ్చి విజయాలు సాధించేలా చేస్తుంది’ అంటుంది జెన్సీ.ఎందుకు ఆమోదించడం లేదు?ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూడకూడదు. అవమానాలు తట్టుకోలేక ఇంటినుంచి పారి పోయేలా చేయకూడదు. వారిని చదువుకు దగ్గర చేస్తే తమను తాము నిరూపించుకోగలరు. అందుకు నేనే సాక్ష్యం. యూజీ, ఎం.ఏ.లో నేను గోల్డ్‌మెడలిస్ట్. మొదట్లో ఎలా ఉన్నా నేను ఈ స్థితికి రావడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. ప్రకృతిని అందరూ ఆమోదిస్తున్నప్పుడు ఆ ప్రకృతిలో భాగమైన మమ్మల్ని మాత్రం ఎందుకు ఆమోదించడం లేదు? – జెన్సీ -
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఆర్ డి ప్రణవ్ రాఘవేంద్ర తనకు మాత్రమే సాధ్యపడుతున్న అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ టోర్నీలో గంటకు 147.3 కిమీ వేగంతో బంతిని సంధించి వార్తల్లో నిలిచాడు. భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. గత కొంతకాలంగా ప్రణవ్ ఇంచుమించు ఇదే స్పీడ్‌ను మెయిన్టైన్ చేస్తున్నాడు. ప్రణవ్ ఇదే కొనసాగిస్తే త్వరలో గంటకు 150 కిమీ స్పీడ్‌ను కూడా అందుకునే అవకాశం ఉంది. భారత ఫాస్ట్ బౌలింగ్‌కు సంబంధించి గంటకు 150 కిమీ స్పీడ్ అనేది చాలా అరుదైన మైలురాయి.భారత ఫాస్ట్ బౌలర్లు ఈ స్పీడ్‌ను అంత ఈజీగా అందుకోలేరు. ఇప్పటివరకు మనం చూసిన వారిలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ వంటి వారు ఈ స్పీడ్ పరిసరాల్లోకి చేరారు. ఈ స్పీడ్‌ను చేరుకోవడం ఓ ఎత్తైతే, దీన్ని నిలకడగా ప్రదర్శించడం మరో ఎత్తు. దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. స్పీడ్‌ను సాధించే క్రమంలో తీవ్రమైన గాయాలవుతుంటాయి. ఒక్కోసారి కెరీర్లే అర్దంతరంగా ముగిసిపోతుంటాయి.తాజాగా ఈ స్పీడ్‌ను అందుకొని, మెయింటైన్ చేయగల సామర్థ్యమున్న ఫాస్ట్ బౌలర్‌గా ప్రణవ్ కనిపిస్తున్నాడు. 150 కిమీ వేగాన్ని అందుకున్న వారిలో ప్రణవ్ అతి పిన్న వయస్కుడు. రెండేళ్లలో ప్రణవ్ 130 నుంచి 147 కిమీ వరకు వేగాన్ని పెంచుకోగలిగాడు. ఇదే అతనిపై అంచనాలను పెంచుతుంది. త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించబోయే భారత అండర్-19 జట్టుకు ఎంపికైన ప్రణవ్.. అదే పర్యటనలో గంటకు 150 కిమీ వేగాన్ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అతని చూసిన వారంటున్నారు. ఈ చెన్నై స్పీడ్ గన్ ఇంగ్లండ్ పర్యటనలో రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు ఆడనున్నాడు. ఈ సిరీస్‌లు జూన్ 27 నుంచి మొదలుకానున్నాయి.ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణలో ఉన్న ప్రణవ్ తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. నాకు వేగంగా బౌలింగ్ చేయడమంటే చాలా ఇష్టం. రాకాసి బౌన్సర్లతో బ్యాటర్లను భయపెట్టడాన్ని చాలా ఇష్టపడతాను. విపరీతమైన వేగంతో బ్యాటర్ల గ్లోవ్స్‌ను టార్గెట్ చేస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ స్పీడ్‌ను కొనసాగించేందుకు ఖచ్చితత్వంతో సహా చాలా అంశాలపై పని చేయాలి. టీమిండియాకు ఆడటమే నా లక్ష్యమని అన్నాడు. కొసమెరుపు ఏంటంటే.. ప్రణవ్‌కు ఫాస్ట్ బౌలింగ్ మొదటి ప్రేమ కాదు. చిన్నతనంలో అతను స్ప్రింటర్ కావాలని అనుకున్నాడు. టీనేజ్‌లోకి అడుగుపెట్టకముందే 100 మీటర్ల రేసును 13.76 సెకెన్లలో పూర్తి చేశాడు. -
దక్షిణాదిన ఈ జలపాతాలు చూశారా?
-
బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్‌కి వెళ్లాలా? పచ్చని కొండలు.. అదిరిపోయే రిసార్ట్స్
సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలోని వేగం, ఒత్తిడి, కాలుష్యం వగైరాలకు దూరంగా వెళ్లి ఓ నాలుగు రోజులు సేదితీరి రావాలని ఎవరికి ఉండదు? కానీ ఆ డెస్టినేషనన్ను ఎలా ఎంచుకోవడం? మానసిక ప్రశాంతతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ముఖ్యమే కదా!ఆ రెండింటికీ గమ్యం పూంబారై! హిమాలయాల సరిహద్దుల్లోని హిల్స్ స్టేషన్లలో యుద్ధభయం ఇంకా వీడకపోగా, దక్షిణాన ఉన్న నీలగిరితో పాటు ఇతర అన్ని హిల్ స్టేషన్స్ జనాలతో కిటకిటలాడుతూ పట్టణ, నగర వాతావర ణాన్ని తలపిస్తున్నాయి. అందుకే సిమ్లా, కులూ, మనాలి నుంచి ఊటీ, కొడైకెనాల్ వరకు దేన్ని చూసినా అమ్మో.. వాటికన్నా ఇల్లే నయమనిపించేలా చేస్తున్నాయి. కానీ పూంబారై అలా కాదు. కొడైకెనాలికి 25 కిలోమీటర్ల పైన పచ్చటి కొండల ఒడిలో.. జలజల పారే జలపాతాల మధ్య.. మూడు కాలాలకూ సూటయ్యే ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరి ఉందీ ఊరు! మిగిలిన హిల్ స్టేషన్లలో ఉన్నట్లు కిక్కిరిసిన హోటళ్లు.. జన సందోహంతో నిండిన రిసార్ట్స్ లేవు. ప్రకృతి వీక్షణ, ఆస్వాదనకు వీలుగా కొండవాళ్లలో ప్రైవసీ ప్రాధాన్యంగా డోమ్స్ నిర్మాణాలుంటాయి. ఇంత దూరం వచ్చి మళ్లీ సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్ మునిగిపోకుండా ఉండటానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్‌ను దృ ష్టిలో పెట్టుకుని వైఫై కనెక్టివిటీ ఇవ్వలేదు ఈ డోమ్స్కు శారీరక, మానసిక రిలాక్సేషన్ కోసంజకూజీ, స్విమ్మింగ్ పూల్, ఆవిరి స్నానాల పెట్టె, ఆరుబయట షవర్ వంటి సౌకర్యాలన్నింటితో క్యాంపింగ్ తరహా బసలివి. అదే లక్స్ గ్లాంప్ ఎకో రిసార్ట్స్! దీంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి పర్యాటకులు పూంబారై బాట పడుతున్నారు. ఈ రిసార్ట్స్ నిర్మాణానికి పూర్వం పూంబారైలో సరైన రోడ్డు, రవాణా సదుపాయాలు అంతగా ఉండేవి కావు. వీటి నిర్మాణంతో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవ లప్ అయింది. అంతేకాదు స్థానిక యువత, మహిళలకు ఈ రిసార్ట్స్ ఉపాధినీ కల్పిస్తున్నాయి. స్థానికం గా పండే పంటలు, కూరగాయలను ఇక్కడి రెస్టా రెంట్స్ కొనుగోలు చేస్తున్నాయి. మూడుకాలాలు పూర్తి ఆక్యుపెన్సీతో ఉండే ఈ రిసార్ట్స్ వల్ల స్థానిక యువత నుంచి రైతుల వరకు అందరికీ ఏదోరకం గా ఉపాధి అందుతోంది. అంతేకాదు దీనివల్ల రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో స్థానికుల చదువు, వ్యాపార వాణిజ్యాలూ ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయి. దీంతో పూంబారై ఆర్థిక చిత్రం మారిపోయింది.లగ్జరీ, క్యాంపింగ్ కలిసేలా.. లక్స్ క్యాంప్ ఈ డోమ్ తరహా రిసార్ట్స్‌ను ఇదే లక్స్ గ్లాంప్ సంస్థ మున్నార్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మంచి ఫలితాలను ఇవ్వడంతో పూంబారైలోనూ నిర్మించింది. ఆ సంస్థ యజమాని కేరళ త్రిస్సూర్‌కు చెందిన ఆంటోనీ థామస్. బిజినెస్ డెవలపర్. వృత్తి రీత్యా దుబాయ్ లో ఉంటున్నారు. ఈ రోజుల్లో కాలుష్యం లేని ప్రకృతిలో గడిపే అవకాశం రావడం నిజంగానే లగ్జరీనే. అలాంటి లగ్జరీ.. క్యాంపిం డూ కలిసేలా ఈ రిసార్ట్స్‌కు లక్స్ గ్లాంప్ అని పేరు పెట్టామని చెబుతారాయన. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని అడిగితే.. 'నాకు చిన్నప్పటి నుంచీ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి సంస్కృతీ సంప్ర దాయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. నాతో పాటే ఆ ఆసక్తీ పెరుగుతూ వచ్చింది. లక్కీగా మా ఆవిడ ఎలీనా థామస్‌కు పర్యటనలంటే ఇష్టం ఉండటంతో ఏ కాస్త టైమ్ దొరికినా ఇద్దరం ప్రపం చ దేశాలను సందర్శిస్తూంటాం. దీనివల్ల పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం దొరకడమే కాదు. మా బిజినెస్ డెవలప్మెంట్ కి కొత్త ఐడియాలూ వస్తుంటాయి. అలా ఒకసారి యూరప్ వెళ్లినప్పుడు అక్కడ చాలా చోట్ల గ్లాస్ క్యాబిన్ల నుంచి ఆలైప్ లాడ్జెస్, డోమ్స్, బబుల్ రిట్రీట్స్ చాలా కనిపిం చాయి. వాటిల్లో బస చేశాం. వండర్ఫుల్ ఎక్స్ప రియెన్స్ అలాంటిది మన దగ్గర కనిపించలేదు. క్యాంపింగ్‌కి కనీస వసతులు కూడా లేని గుడారాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కుటుంబంతో కలిసి క్యాంపింగ్ చేయాలంటే భద్రత, సౌకర్యాలు ప్రధా నమవుతాయి కదా! వీటన్నింటిని దృష్టిలో పెట్టు కుంటే మేము యూరప్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేసిన గ్లాస్ క్యాబిన్, డోమ్స్ పర్ఫెక్ట్ అనిపించాయి. వాటిని దక్షిణ భారతంలో ప్రవేశపెట్టాలనుకుని ముందు పైలట్ ప్రాజెక్ట్ 2018లో మున్నార్ స్టార్ట్ చేశాం. పూంబారైలో మా లక్స్ గ్లాంప్ ఎకో రిసార్ట్స్ ప్రారంభంతో ప్రారంభంతోనే ఆ ఊరి ముఖచిత్రమే మారిపోయింది. ఇన్ఫ్రాన్ఫ్రాస్ట్రక్చర్ సహా చాలా వస తులు ఏర్పడి ఈ ఊరికి ఓ కొత్త కళ వచ్చింది. భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ ఈ తరహా కట్టడాలతో పర్యాటక ప్రియులకు సౌకర్యవంతమైన, పర్యావరణప్రియ బసను అం దించాలనుకుంటున్నాం' అని ఆంటోనీ థామస్ తెలి పారు. -
Coronavirus: ముంబైలో కేసుల పెరుగుదల.. అదే బాటలో తమిళనాడు, గుజరాత్
ముంబై: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌తో సహా ఆసియాలోని కొన్ని దేశాలలో కోవిడ్-19(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదువుతున్నాయి. ఈ వివరాలను ఆయా రాష్ట్రాల అధికారులు మీడియాకు వెల్లడించాయి.మునుపటి వేవ్‌లతో పోలిస్తే మొత్తం కేసులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని ముంబై, చెన్నై, అహ్మదాబాద్(Ahmedabad)తో పాటు పలు నగరాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత మే నెలలో ముంబైలో ఇప్పటివరకూ కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి చూసుకుంటే మహారాష్ట్రలో మొత్తంగా 106 కేసులు నమోదయ్యాయి. ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 16 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాపించకుంగా ఉండేందుకు బాధితులను కెమ్ ఆస్పత్రి నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్టులో వెల్లడించింది.మరోవైపు ముంబై మహా నగరంలో ఇన్ఫ్లుఎంజా(Influenza), శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ముందు జాగ్రత్త చర్యగా పూణేకు చెందిన వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నాయుడు ఆసుపత్రిలో 50 పడకలను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనావైరస్ యాక్టివ్ కేసులు లేవు. ఇటీవల 87 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ వచ్చిందని, అయితే అతను వైద్య చికిత్సతో కోలుకున్నాడని పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి నీనా బోరాడే తెలిపారు. ఆస్పత్రులలో ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదని, కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నట్లు నీనా తెలిపారు.తాజాగా తమిళనాడు, గుజరాత్, కేరళలో కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఇన్ఫ్లుఎంజాకు కారణమైన జ్వరాలు పెరుగుతున్నాయి. ఇవి కరోనా ఇన్ఫెక్షన్ అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులను నిర్ధారించగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు వీరి నుంచి శాంపిల్స్‌ను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.ఇది కూడా చదవండి: సెమికోలన్ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది? -
మాయమైపోతున్న మనిషి కోసం.. శాలిని
కళ్లెదుటే తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది సాగయా ఏంజిలిన్ శాలిని. తండ్రితో కలిసి హాస్టల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సహాయం కోసం ఎంతోమందిని వేడుకుంది. సహాయం చేసే బదులు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి దారిలో వారు వెళుతున్నారు.కొందరైతే తన విషాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోలు తీస్తున్నారు!‘సాటి మనిషి బాధను పంచుకునే టైమ్, దయ మానవులలో ఎందుకు మాయం అవుతుంది?’ అనే కోణంలో ఆలోచించింది. ఆ విషాద సంఘటన శాలినిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసింది. రెండు నెలల పాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ‘జీవితంలో విషాదం ఒక భాగం అని అర్థం చేసుకునే పరిణతి నాలో ఆ సమయంలో లేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది శాలిని. తన దుఃఖాన్ని ఇతరులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధనే కాదు ఇతరుల బాధను కూడా పంచుకుంటుంది. యాక్సిడెంట్ సంఘటన తరువాత తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఒక కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసింది.ఇదీ చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్! View this post on Instagram A post shared by Shalini (@shalini_robert_) బాధితులకు తమ వంతు సహాయపడడానికి కమ్యూనిటీ ఏర్పాటైంది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ కమ్యూనిటీలో వందలాది సభ్యులు ఉన్నారు. బాధితులకు నైతికస్థైర్యం ఇవ్వడం నుంచి ఆర్థిక సహాయం అందించడం వరకు ఈ కమ్యూనిటీ పనిచేస్తోంది. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది శాలిని. తమ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లడం, అక్కడి పిల్లలతో గడపడం శాలిని కటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయమే శాలినిని సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన శాలిని ΄ార్ట్ టైమ్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలకు సహాయపడేది. తరచుగా అనాథాశ్రమాలకు వెళుతూ పిల్లల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటుంది. ‘నేను మీకు సహాయం చేస్తాను’ అని హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ‘నిలబెట్టుకోలేని హామీని ఇచ్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు’ అంటుంది శాలిని. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం నుంచి ఎవరైన చిన్న షాప్ పెట్టుకోవడం వరకు తనవంతుగా సహాయం చేస్తుంటుంది. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన‘ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రేమ పంచుకోవడం, ఎమోషనల్ సపోర్ట్‌తో ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చు’ అంటుంది శాలిని. ‘నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఎప్పుడూ బాధలో ఉండేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఆ సమయంలో శాలిని అక్క నాలో ధైర్యం నింపింది. ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను తిరిగి చదువుకునేలా చేసింది. ఆమె నా వెనకాల ఉంది అనే భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది తెన్కాశీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల ఆశ్మీ. శాలినిని అభిమానించే వాళ్లలో ఆశ్మీలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి అభిమానమే తన బలం.రోడ్డు ప్రమాదంలో తండ్రి... సహాయం కోసం అరుస్తూనే ఉంది శాలిని. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు కొందరు. కొందరైతే ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. ...తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది శాలిని. మాయమై΄ోతున్న మనిషి కోసం, మానవత్వం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం ఆన్లైన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో కీలక ΄ పాత్ర పోషించింది తమిళనాడుకు చెందిన శాలిని... అలా ఎప్పుడూ చేయలేదుఇతరుల బాధలను సొమ్ము చేసుకోవాలని, నేను చేసిన వీడియోలు వైరల్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను పోస్టు చేసిన 190 వీడియోలు నిజాయితీతో చేసినవి మాత్రమే. బాధితుల సమస్యలు నా దృష్టిలో కంటెంట్ కాదు. ఏదో విధంగా వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడం తేలికైన విషయం కావచ్చు. అయితే అలాంటి వారు వేగంగా నమ్మకంగా కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదు. – శాలిని -
డయాబెటిస్‌ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?
భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం?. ఎక్కడ కొలువై ఉంది?..ఇదంతా నిజమేనా..? వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం..!.తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. మీ. అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని(నందివర్ధనం చెట్టు) చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు.మధుమేహం ఎలా నయం అవుతుందంటే..ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్లనాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. నిజమేనా అంటే..?ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక, విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతుంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితమవ్వడంతో ఇదేలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి..మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. దానినే మేము ఇక్కడ వార్తగా ఇచ్చాము. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
అప్పుల్లో టాప్ రాష్ట్రం ఇదే..
దేశంలోని రాష్ట్రాల్లో ఏటికేడు అప్పులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో తమకు ఉపయోగపడేలా స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు అప్పులను వాడుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికోసం వీటిని వినియోగిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య మొత్తం తమిళనాడు రుణాలు రూ.1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.బలమైన ఆర్థిక వ్యూహం, వృద్ధి ఆధారిత పెట్టుబడుల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తూ తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులను సమీకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అప్పుల్లో తమిళనాడు నిలకడగా ముందంజలో ఉంది. సంవత్సరాలవారీగా అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరంలో రూ.87,977 కోట్లు2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో రూ.87,000 కోట్లు2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు రూ.1.01 లక్షల కోట్లుతమిళనాడు తర్వాత 2025 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర రూ.99,000 కోట్ల అప్పుతో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..అప్పులకు వెనుక కారణాలు2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయంలో 22% పెరుగుదలను రాష్ట్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 28.7% లోపు దాని డెట్-జీఎస్డీపీ నిష్పత్తి 26.43%గా ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వం, సుస్థిరతను నిర్ధారిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమిళనాడు రూ.20,000 కోట్ల రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. దాంతో మొత్తం రుణాలు రూ.1.62 లక్షల కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. -
తమిళనాడులో నిర్వహించిన డీఎంకే పార్టీ సభలో అపశ్రుతి
-
Waste into Energy : కిచెన్ వేస్ట్ నుంచి బయోగ్యాస్
అసాధారణ జ్ఞానం నుంచి మాత్రమే కాదు అవసరాల నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి అని చెప్పడానికి హరిణి ఒక ఉదాహరణ. వంటగది వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను తయారుచేసే ఆలోచన చేసి విజయవంతం అయింది. ఆ ఆలోచన తనను ఎంట్రప్రెన్యూర్‌ని చేసింది.తమిళనాడులోని సేలంకు చెందిన హరిణి రవికుమార్ ‘గ్రీన్ కనెక్ట్’ వ్యవస్థాపకురాలు. ‘గ్రీన్ కనెక్ట్’ దేశవ్యాప్తంగా వెయ్యి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ΄్లాంట్లు సేంద్రియ వ్యర్థాలను విలువైన ఇంధన శక్తిగా మారుస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటాయి. (స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!)హౌజ్‌హోల్డ్ కార్బన్ ఫుట్‌ప్రింట్స్‌ను తగ్గించడానికి ఆచరణాత్మక, శక్తిమంతమైన మార్గాలను ‘గ్రీన్ కనెక్ట్’ అందిస్తుంది. సహజమైన ప్రక్రియ ద్వారా వంటగది వ్యర్థాలను వంట ఇంధనంగా మార్చడానికి రూ పొందించిన ఈ యూనిట్‌ను బాల్కనీలు, టెర్రస్లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది వ్యర్థాలతో బయోగ్యాస్, సేంద్రియ ఎరువుతో పాటు పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగ పడుతుంది. (వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!)ఇలా....చెత్తను సేకరించిన తరువాత నాన్–ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఆర్గానిక్ వేస్ట్‌ను వేరు చేయాలి.ఆర్గానిక్ వేస్ట్‌ను ఎయిర్‌టైట్ కంటెయినర్ లేదా డైజెస్టర్‌లో వేయాలి.టైట్ చాంబర్లో బయోగ్యాస్‌ను స్టోర్ చేయాలి.స్టోర్ చేసిన బయోగ్యాస్‌ను వంట గ్యాస్‌గా ఉపయోగిస్తారు. -
పట్టాల బోల్టులను తొలగించిన దుండగులు.. తప్పిన పెను రైలు ప్రమాదం
సాక్షి,చెన్నై: అరకోణం సమీపంలో పెను రైల్వే ప్రమాదం తప్పింది. దుండగులు రైల్వే పట్టాల బోల్ట్లను తొలగించారు. పట్టాల బోల్టుల తొలగింపుపై రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్‌షా భేటీలో ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు సమాచారం. అన్నాడీఎంకే షరతు మేరు అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేలా కమలం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
రాష్ట్రపతికీ మూడు నెలలే
న్యూఢిల్లీ: గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మూణ్నెల్లు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రా ష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల విషయంలో 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమేమీ కాదు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు’’అని కూడా పేర్కొనడం విశేషం! బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్థీవాలా, జస్టిస్ ఎం.మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ మూడు నెలల్లోపు నిర్ణ యం తీసుకోవాలి. రెండోసారీ పంపితే నెలలోపు వి« దిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం’’అని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్‌కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై మూడు నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆ తీర్పు తాలూకు 415 పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా పెండింగ్‌లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువూ నిర్దేశించలేదు. అంతమాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రపతి తన వద్దకొచి్చన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే (షల్ డిక్లేర్) అని ఆర్టికల్ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో, పెండింగ్‌లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు. అదీగాక ఏ అధికారన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి. చట్టపరంగా కూడా అదే సరైనది. ఈ సాధారణ న్యాయసూత్రానికి 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు’’అని పేర్కొంది. ‘‘ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలివ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి’’అని స్పష్టం చేసింది.కోర్టుల పాత్ర పోషించొద్దు చట్టసభలు రూపొందించే బిల్లుల రాజ్యాంగబద్ధత విషయంలో కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆ కారణంగా బిల్లులను పెండింగ్‌లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. కనుక ఆర్టికల్ 143 ప్రకారం ఈ అంశాన్ని విధిగా సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’’అని స్పష్టం చేసింది. అంతే తప్ప వాటిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని కోర్టుల పాత్ర పోషించడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘ఫక్తు న్యాయపరమైన అంశాలివి. ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి మేం ఎంతమాత్రమూ సంశయించడం లేదు. ఎందుకంటే బిల్లుల రాజ్యాంగబద్ధతపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలను సిఫార్సు చేసే అధికారం కేవలం రాజ్యాంగ ధర్మాసనాలది మాత్రమే’’అని వివరించింది. -
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Suryan FM (@suryanfm) ఈ టీచర్ ఇన్‌స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదీ చదవండి: నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్. దీని ఒరిజినల్ ట్రాక్‌ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది. -
ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా
న్యూఢిల్లీ: ఇప్పుడు బీజేపీ దృష్టి బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులపైనే ఉంది. ఈ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను పటిష్టం చేయడానికి, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి, స్థానిక నాయకులతో సమన్వయం కుదుర్చుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతి నెలా రెండు రోజుల పాటు ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమై, ఎన్నికలు ముగిసే వరకు కొనసాగనున్నాయి. పటిష్ట వ్యూహం (Strong strategy)తో బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.బీహార్‌లో బీజేపీ వ్యూహంబీహార్లో అసెంబ్లీ ఎన్నికలు 2025 (Assembly elections in Bihar) అక్టోబర్-నవంబర్‌లో జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో కీలక భాగస్వామిగా ఉంది. ఇందులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్), చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. అమిత్ షా ఏప్రిల్ 30,మే 1 తేదీల్లో బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన పట్నా, గయ,భాగల్పూర్ తదితర నగరాల్లో సమావేశాలు నిర్వహించి, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అయిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ ఈ పర్యటనలను చేపడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు గెలుచుకున్నప్పటికీ, ఈసారి సీట్ల సంఖ్యను 100కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షా ఈ పర్యటనల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కేంద్ర పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటివాటిని హైలైట్ చేయనున్నారు.టీఎంసీకి సవాలు విసిరేందుకు..పశ్చిమ బెంగాల్లో 2026 మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అమిత్ షా ఏప్రిల్ 14-15 తేదీలలో కోల్‌కతా, హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో తన ఓటు శాతాన్ని 40 శాతం నుంచి 50శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో అమిత్‌షా స్థానిక నేతలతో ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.తమిళనాడులో కొత్త ఒరవడితమిళనాడులో 2026 మార్చి-ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో బీజేపీ గతంలో ఎన్నడూ గణనీయమైన విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు అధికార డీఎంకే-ఇండియా కూటమి(ruling DMK-India alliance)ని ఎదుర్కొనేందుకు ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా ఏప్రిల్ 10-11 తేదీల్లో చెన్నై, కోయంబత్తూర్, మధురైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామితో సమావేశమై, కూటమి ఒప్పందంపై చర్చలు జరపనున్నారని సమాచారం. 2021 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి 66 సీట్లు గెలిచినప్పటికీ, తర్వాత విడిపోయాయి. ఈసారి బీజేపీ తమిళనాడులో కనీసం 50 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షా పర్యటనల్లో రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో హిందుత్వ ఎజెండాను ప్రచారం చేయడంతో పాటు, డీఎంకే ద్రవిడ రాజకీయాల ఆధిపత్యంపై విమర్శించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రాజెక్టులైన పంబన్ వంతెన, రైల్వే ఆధునీకరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు -
వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ను ప్రారంభించిన పీఎం మోదీ
-
తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(liquor scandal) వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) సారధ్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ, నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్న తరుణంలో అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టీఏఎస్‌ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు.Many Tamil Nadu BJP leaders have been arrested by Tamil Nadu Police for organizing a protest against TASMAC scam worth 1000 cr by DMK gang.This is the same scam they want to cover up by diverting attention to the language issue.This is what real dictatorship looks like!! pic.twitter.com/L14GjJE54f— Mr Sinha (@MrSinha_) March 17, 2025రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్’ పోస్ట్ లో ఆయన ఇలా రాశారు..‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏమి చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.Unlawful arrest by Dictator CM @mkstalin! You looted Tamil Nadu, and now you want to silence BJP. We will not back down!We have been arrested along with Sr Leader Thiru @PonnaarrBJP anna.DMK Liquor Scam 😡 1000 Crores Corruption. @annamalai_k @blsanthosh pic.twitter.com/INhAFM5Vsh— Amar Prasad Reddy (@amarprasadreddy) March 17, 2025ఇది కూడా చదవండి: పాక్‌లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం -
ఇస్రోకు మరో రెండు లాంచ్ ప్యాడ్లు
న్యూఢిల్లీ: వినూత్నమైన అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు నూతన లాంచ్ప్యాడ్లను సమకూర్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్నంలో వీటిని నిర్మిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ధ్రువీకరించారు. వీటిని రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిద్వారా అత్యాధునిక రాకెట్లను నింగిలోకి పంపనున్నారు. కొత్త లాంచ్పాడ్లతో ఇస్రో రాకెట్ ప్రయోగ సామర్థ్యం మరింత ఇనుమడించనుందని చైర్మన్ అన్నారు. చంద్రయాన్–4కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2028లో ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–3 ఉపగ్రహం మొత్తం బరువు 4,000 కిలోలు కాగా చంద్రయాన్–4 9,200 కిలోలుంటుందని వెల్లడించారు. చందమామపైకి చేరుకొని, అక్కడి నమూనాలను సేకరించి విజయవంతంగా రావడం చంద్రయాన్–4 మిషన్ లక్ష్యం. చంద్రుడిపై మన ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుందని చెబుతున్నారు. మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు నారాయణన్ పేర్కొన్నారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్ ప్రయోగాల్లో మహిళలది కీలక పాత్ర అని ప్రశంసించారు. అమెరికా, భారత్ ఉమ్మడిగా ‘నిసార్’ శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. దాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జి–20 శాటిలైట్ రూపకల్పనలో ఇస్రో నిమగ్నమైంది. ఇందులో 40 శాతం పేలోడ్లు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషం. భారత తయారీ రాకెట్లతో ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించినట్టు వి.నారాయణన్ వెల్లడించారు. ఇందులో 90 శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరిగాయన్నారు. -
ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్
చెన్నై: తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోబీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, రాష్ట్రంలో త్రి భాష విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అలాగే డీఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.నిన్నటి (బుధవారం) నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. కాగా, డీఎంకే నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన కోర్‌కమిటీ.. రానున్న రోజులలో తమిళ ప్రజల సంక్షేమార్థం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏపీకి చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో వారి బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని విడిపించారు. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ సాధించింది.అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి రిపీట్ అయింది. తమిళనాడుకు చెందిన కొందరు మత్స్యకారులు పొరపాటున సరిహద్దు రేఖ దాటారు. వీరి గుర్తించిన శ్రీలంక నావికాదళం దాదాపు 27 మందిని అరెస్ట్ చేసింది. దీంతో తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన దాదాపు 700 మంది జాలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. వారి ఆందోళనలతో దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో వారిని విడిపించారు. దీంతో మరోసారి తండేల్ సినిమా రిపీట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ తమిళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. -
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్ షా తమిళనాడులోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అమిత్ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.అన్నీ అవాస్తవాలేతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్ షా అన్నారు.కూటమిదే అధికారం..వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు. జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
పోలీసులకు తల్లి ఫిర్యాదు
తిరువళ్లూరు: తన కొడుకు మృతిపై అనుమానం ఉందని ఆరోపిస్తూ తల్లి కడంబత్తూరు పోలీసులకు పిర్యాదు చేసింది. తన కొడుకును భార్య ఆమె బంధువులే చంపేశారని ఆరోపించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాట్టాన్కొలత్తూరు గ్రామానికి చెందిన పాల్‌రాజ్ కుమారుడు ప్రేమ్‌రాజ్(38). ఇతనికి చిట్రంబాక్కం గ్రామానికి చెందిన దీప అనే మహిళతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.ఈ క్రమంలో భార్యభర్త మధ్య తరచూ మనస్పర్థలు రావడంతో దీప పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల పంచాయితీతో ఇటీవల కాట్టాన్కొలత్తూరులోని ఇంటిని విక్రయించిన ప్రేమ్‌రాజ్ తన భార్య వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడే భార్యభర్త కలిసి నివాసం వుంటున్న క్రమంలో అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి జ్యోతి కడంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు మృతిలో అనుమానం వుందని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది. -
జయలలిత ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
-
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
చెన్నై:తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేసింది.మొత్తం రూ.4 వేల కోట్ల ఆస్తుల్లో ఇళ్లు,1525ఎకరాల భూమి డాక్యుమెంట్లతో పాటు 1100 కేజీల వెండి,వెయ్యి కిలోలకుపైగా బంగారం,వజ్రాలు ఉన్నాయి.అక్రమాస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను చివరిగా తమిళనాడు ప్రభుత్వానికి అందించారు.అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికల దోషిగా తేలిన విషయం తెలిసిందే. అయితే శిక్ష పడేలోపే జయలలిత మరణించారు.శశికల మాత్రం ఈ కేసులో శిక్ష అనుభవించారు.తమిళనాడు ప్రభుత్వానికి అందిన వాటిలో జయలలితకు చెందిన బంగారు కిరీటమిది..జయలలిత బంగారు ఒడ్డానం..దీనిలో వజ్రాలను నెమలి ఆకారంలో పొదగడం విశేషం.ఇది జయలలితకు బహుకరించిన బంగారు కత్తి..ఇది జయలలిత రూపంతో ఉన్న బంగారు బొమ్మ.. -
విమానంలో సీటు వివాదం.. డీఎంకే ఎంపీVsఅన్నామలై
చెన్నై:తమిళనాడులో ఎయిర్ఇండియా విమానంలో సీటుపై రాజకీయం వేడెక్కింది. విమాన సీటు విషయంలో డీఎంకే,బీజేపీ మధ్య విమర్శల బాణాలు దూసుకెళ్లాయి. డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా వారు ఆమె బిజినెస్ క్లాసు సీటును రద్దు చేసి ఎకానమి సీటు కేటాయించారు. ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఒక ఎంపీకే విమానంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన విమాన టికెట్ తరగతిని ఎలా తగ్గిస్తారని ట్వీట్లో నిలదీశారు. దీనికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పందించారు. ఎంపీ తంగపాండియన్‌కు అలా జరగాల్సింది కాదని అంటూనే ఆమెపై విమర్శలు గుప్పించారు.Absolutely unacceptable from @airindia! I had booked a Business Class seat on an Air India flight from Delhi to Chennai (A1540- 9.20pm) this evening (13.02.2025). Without any prior notice or explanation, the seat was downgraded. This is not just about me—if a MP can be treated… pic.twitter.com/wAqNkwwBBp— தமிழச்சி (@ThamizhachiTh) February 13, 2025 కేవలం విమానంలో టికెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు..డీఎంకే పాలనలో ప్రజల స్థాయి తగ్గిపోయిందని గుర్తుచేశారు. ఒక ఎంపీని నా పరిస్థితే ఇలా ఉంటే అని మాట్లాడడం మీ అధికార దర్పాన్ని, సంపన్న వర్గాల మనస్తత్వాన్ని సూచిస్తోందని మరో ‘ఎక్స్’ పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.Though this shouldn’t have happened, it comes at the right time to tell people in power in TN what it means to be downgraded. The entitlement that makes one say “if an MP can be treated this way” shows the loftiness of a person who is a product of dynasty politics. With the… https://t.co/o4Y9UlIyY4— K.Annamalai (@annamalai_k) February 14, 2025 -
కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ!
చెన్నై : మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైనట్లే తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం కమలహాసన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం కమల్ హాసన్ నివాసానికి రాష్ట్రమంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లారు. ఆ భేటీని ఎంఎన్ఎం పార్టీ ఎక్స్ వేదికగా ప్రస్తావించింది. దీంతో రాజ్యసభకు కమల్ హాసన్ ప్రచారం జోరందుకుంది. மக்கள் நீதி மய்யம் கட்சியின் தலைவர் திரு. @ikamalhaasan அவர்களை, இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் திரு. @PKSekarbabu அவர்கள் மரியாதை நிமித்தமாகச் சந்தித்து உரையாடினார். தலைவரின் அலுவலகத்தில் நடந்த இந்தச் சந்திப்பின்போது, கட்சியின் பொதுச்செயலாளர் திரு. @Arunachalam_Adv அவர்கள்… pic.twitter.com/ni4Ne3hqFb— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) February 12, 2025 ఈ తరుణంలో కమల్ హాసన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమల్‌తో భేటీ అనంతరం, ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మేం ఈరోజు మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాం. మమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతించినందుకు, రాజకీయాలు, సినిమాతో పాటు వివిధ రంగాలపై అభిప్రాయాలను పంచుకున్నందుకు నా కృతజ్ఞతలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. மக்கள் நீதி மய்யத்தின் தலைவர் - கலைஞானி @ikamalhaasan சாரை இன்று அவருடைய இல்லத்தில் மரியாதை நிமித்தமாக சந்தித்தோம். அன்போடு வரவேற்று அரசியல், கலை என பல்வேறு துறைகள் சார்ந்து கருத்துக்களை பரிமாறிக்கொண்ட கமல் சாருக்கு என் அன்பும், நன்றியும்.@maiamofficial pic.twitter.com/YdLqu4KZs4— Udhay (@Udhaystalin) February 13, 2025 2024లో తమ ఎన్నికల ఒప్పందంలో భాగంగా హాసన్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు సమాచారం. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చింది. గతేడాది మార్చిలో కమల్ హాసన్ డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంను సందర్శించారు. అక్కడ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఒప్పందంపై సంతకం చేశారు.డీఎంకే నేతృత్వంలోని కూటమితో పొత్తు పెట్టుకోవాలనే తన నిర్ణయం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగిందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. కానీ ఈ ఇండియా కూటమికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పదవి కోసం కాదు, దేశం కోసం’అని ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం, తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి తరపున లోక్‌సభ ఎన్నికలకు కమల్ హాసన్ ప్రచారం చేశారు. ప్రతిగా 2025లో డీఎంకే కోటా నుండి రాజ్యసభ నామినేట్ చేయనుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే సభ్యులతో సహా కనీసం ఆరుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం జూన్ 2025 నాటికి ముగియనుంది. అందుకే డీఎంకే పార్టీ ఇప్పుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సిద్ధమైంది. -
ఈ రోడ్లో డీఎంకే ముందంజ
ఈ రోడ్: తమిళనాడులోని ఈ రోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ముందంజలో ఉన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 51 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ స్థానం 20028లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఏడుపార్లు ఎన్నికలు జరిగాయి, వాటిలో మూడు లోక్‌సభ ఎన్నికలు కాగా 2023 ఫిబ్రవరిలో ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలన్నింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబర్లో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్నాడీఎంకే పరాజయాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇక డీఎంకే విషయానికొస్తే, ఆ పార్టీ 2011, 2016లో రెండుసార్లు ఆ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి వీసీ చంద్రకుమార్ 2011లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఈరోడ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్ మీదగా వెళుతోంది. ఆ సమయంలో ఓ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు. ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్‌లో డీఎంకే జెండా ఉన్న ఎస్యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. .Safety of women in TN has become a luxury many can’t afford . DMK flag is the icing on the cake . #ShameOnYouStalin pic.twitter.com/SYGC4aCMPp— karthik gopinath (@karthikgnath) January 29, 2025బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది. ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
పిల్లలూ.. స్కూల్లో బాంబులు పెట్టారంట పారిపోండి
ఢిల్లీ : ముంబైలో (mumbai) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముంబైకి చెందిన పలు స్కూళ్లలో బాంబులు (bomb threat) పెట్టామంటూ అగంతకులు బెదిరింపులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్వ్కాడ్స్ స్కూల్స్‌లో తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని బాంబు స్వ్కాడ్ నిర్ధారించాయి.గురువారం ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతానికి చెందిన ది ర్యాన్ గ్లోబల్ స్కూల్లో 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి పాల్పడ్డ అప్జల్ గురు అనుచరులు బాంబు పెట్టినట్లు అగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్‌లో పేర్కొన్నారు.మరోవైపు, బుధవారంతమిళనాడులో ఏరోడ్ జిల్లాలో సుమారు ఏడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. ఏరోడ్ జిల్లాకు చెందిన భారతి విద్యాభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్‌లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ-మెయిల్స్ పంపారు.దీంతో అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థుల్ని అలెర్ట్ చేసింది. వెంటనే స్కూల్ వదిలి పారిపోవాలంటూ సూచించారు. అనంతరం, స్కూల్ తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు సమాచారం అందించింది.యాజమాన్యం ఫిర్యాదుతో స్కూల్స్‌కు పోలీసులు,బాంబు స్వ్కాడ్, స్నైపర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. స్కూల్స్‌లో అణువణువూ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో బాంబులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమల కొండపై అపచారం
-
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్’ ముప్పు..!
తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్కాయిస్’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Incois) హెచ్చరించింది.ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.కల్లక్కడల్ అంటే ఏంటి..?కల్లక్కడల్ అనేది మళయాలం పదం. కల్లక్కడల్ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు. -
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్‌లో జగదీశన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
చెన్నై:తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శనివారం(జనవరి4) భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సత్తూర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి -
డీఎంకే ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. శుక్రవారం(జనవరి3) ఉదయం వెల్లూరు జిల్లాలోని కదిర్ ఆనంద్ ఇంట్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితులు,బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో గతంలో ఆనంద్ దగ్గరి బంధువుల ఇళ్లలో రూ.11.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచిపెట్టేందుకే దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019లో ఆనంద్‌తో పాటు అతని బంధువులపై క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ కేసు నమోదైంది.ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ కుమారుడే కదిర్ ఆనంద్.ఇదీ చదవండి: దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
భార్యపై కోపం.. రెండు బస్తాల నాణేలతో కోర్టుకు భర్త.. తర్వాత ఏమైందంటే..
సాక్షి, చైన్నె: తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు మొత్తాన్ని చిల్లరగా 20 బస్తాలలో కోర్టుకు ఓ భర్త గురువారం తీసుకొచ్చాడు. ఈ చిలర్ల చూసి షాక్‌కు గురైన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ చిల్లర మొత్తాన్ని నోట్లుగా మార్చి సమర్పించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన దంపతులు గతంలో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, తనకు భరణం ఇప్పించాలని ఆ భార్య కోర్టుకు విన్నవించారు. దీంతో, న్యాయమూర్తి ఆ భర్తకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 2 లక్షలు భరణం అందజేయాలని సూచించారు. దీనిని ముందే గ్రహించిన ఆ భర్త వినూత్న ప్రయోగం చేసి కంగు తిన్నాడు. తన భార్య మీదున్న కోపంతో కోర్టు నుంచి బయటకు వెళ్లి తన కారులో ఉన్న బస్తాలు ఒకొక్కటిగా తీసుకొచ్చి పెట్టారు. అనంతరం, 20 బస్తాలను కోర్టులో ఉంచి, ఇదిగోండి రూ. 2 లక్షలు అంటూ సూచించాడు. న్యాయమూర్తి ప్రశ్నించగా, రూ. 80 వేలకు ఒక్క రూపాయి నాణెలు, మిగిలిన మొత్తం రూ. 5 ,రూ. 10, రూ. 20 నాణేలు అంటూ వివరించాడు. దీనిని విన్న అక్కడున్న వారంతా అవ్వాక్కయారు. ఇతడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జడ్జి మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈచిల్లరను నోట్లుగా మార్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ భర్త చిల్లర బస్తాలను కోర్టు నుంచి మళ్లీ తన కారు వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కోయంబత్తూరుకోర్టు ఆవరణలో సర్వత్రా హాస్యాన్ని పంచినట్లయ్యింది. విచారణ వాయిదా పడడంతో చిల్లర బస్తాలతో ఆ భర్త తాను వచ్చిన కారులోనే వెళ్లియాడు. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
అల్పపీడన ప్రభావం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నెల్లూరు,తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.18వ తేదీన ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తమిళనాడులోని దిండిగల్ లో ఘోర అగ్ని ప్రమాదం


