ఐఏఎస్‌.. కొడుకు.. డ్రైవర్‌.. | police suspect that immoral relations leads to IAS's driver murder | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌.. కొడుకు.. డ్రైవర్‌..

Published Tue, Mar 21 2017 2:02 AM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

పోలీసుల అదుపులో ఐఏస్‌ అధికారి వెంకటేశ్వర్లు, సక్రు(ఫైల్‌) - Sakshi

పోలీసుల అదుపులో ఐఏస్‌ అధికారి వెంకటేశ్వర్లు, సక్రు(ఫైల్‌)

- వీడుతున్న జూబ్లీహిల్స్‌ హత్య కేసు మిస్టరీ
- డ్రైవర్‌ నాగు–సుక్రుల మధ్య ‘అనైతిక’ బంధమే హత్యకు కారణం?
- ఇతర అక్రమ సంబంధాల కోణంలోనూ పోలీసుల ఆరా
- ఆవేశంలోనే నాగుపై దాడి చేశానంటున్న నిందితుడు
- హత్య చేసి పరారీ.. తిరిగొచ్చి మృతదేహాన్ని మాయం చేసే యత్నం
- తండ్రి, ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్లుతో సంప్రదింపులు
- వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
- హత్యకు దారితీసిన కారణాలపై లోతుగా ఆరా
- ఇంకా దొరకని హతుడి సెల్‌ఫోన్‌
- ఎంతటి వారున్నా వదలం: వెస్ట్‌జోన్‌ డీసీపీ  


ఇద్దరూ యువకులు.. ఒకరు ఓ ఐఏఎస్‌ అధికారి కుమారుడు, మరొకరు వారి డ్రైవర్‌.. కలసి తాగడంతో పాటు మరిన్ని వ్యసనాలకూ బానిసయ్యారు.. ‘అనైతిక’ సంబంధానికీ దిగారు.. తాగిన మత్తులో మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. మద్యం సీసాతో తలపై కొట్టడంతో డ్రైవర్‌ మరణించాడు.. అది చూసి పరారైన ఐఏఎస్‌ అధికారి కుమారుడు మళ్లీ వచ్చి శవాన్ని మాయం చేయాలని చూశాడు. అందుకు తండ్రి సహకారాన్ని తీసుకున్నాడు! కానీ అడ్డంగా దొరికిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లో జరిగిన హత్య కేసు తీరిది. అంతేకాదు అసలు ఈ ఘటన వెనుక అక్రమ సంబంధాల కోణం కూడా ఉందనీ పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లో జరిగిన కారు డ్రైవర్‌ బూక్యా నాగు హత్య కేసు మిస్టరీ వీడుతోంది. ప్రధానంగా ‘అనైతిక’ సంబంధాలే ఈ హత్యకు కారణమని భావిస్తు న్న పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు దారావత్‌ వెంకట్‌ సుక్రును ఇప్పటికే అదుపులోకి తీసు కోగా.. సోమవారం అతడి తండ్రి, వ్యవసాయ శాఖలో సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి డి.వెంకటేశ్వర్లును ప్రశ్నించా రు. సుక్రు.. హత్య విషయాన్ని తండ్రికి చెప్పి ఉంటాడనే అనుమానంతో ఆరా తీస్తున్నారు.

వాచ్‌మన్‌ హతుడి స్నేహితుడే...
వెంకటేశ్వర్లు, ఆయన భార్య అనిత మధ్య మన స్పర్థలు రావడంతో కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉం టున్నారు. వారి పెద్ద కుమారుడు సుక్రు (19) ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదు వుతున్నాడు. అతను తన తల్లితో కలసి మధు రానగర్‌లో ఉంటున్నాడు. వారి వద్ద బుక్యా నాగు(28) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితు ల్లా మెలిగే  సుక్రు, నాగు వ్యసనాలకు బానిసయ్యారు. యూసఫ్‌గూడలోని సాయి కల్యాణ్‌ రెసిడె న్సీ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్, నాగు ఒకే గ్రామానికి చెందిన వారు. దీంతో నాగు,  సుక్రు కలసి ఆ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై పార్టీలు చేసుకునేవారు.

మాటామాటా పెరిగి దాడి...
ఎప్పటిలాగే సుక్రు, నాగు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సాయి కల్యాణ్‌ రెసిడెన్సీ టెర్రస్‌పైకి వెళ్లారు. నాగు సాయంత్రం 6 గంట లకు తన భార్యకు ఫోన్‌ చేసి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. ఆమె రాత్రి 8.30 గంటలకు నాగుకు ఫోన్‌ చేసింది. రావడానికి మరికాస్త ఆలస్యం అవుతుందన్నాడు. అయితే మద్యం తాగుతున్న  సుక్రు, నాగు గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన  సుక్రు మద్యం సీసాతో నాగు తలపై కొట్టాడు. ముఖం, తలపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో నాగు అక్కడికక్కడే కుప్పకూలాడు.  సుక్రు.. అక్కడి నుంచి పరారయ్యాడు. అర్ధ రాత్రి 2 గంటల సమయంలో మరోసారి అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి, చలనం లేకుండా ఉన్న నాగును చూసి వెళ్లిపోయాడు.

తండ్రితో ఫోన్‌లో సంప్రదింపులు
సుక్రు శనివారం సాయంత్రం మళ్లీ అపార్ట్‌ మెంట్‌ టెర్రస్‌పైకి వెళ్లి, నాగు మృతదేహాన్ని మూట కట్టుకుని, పక్కనే ఉన్న జానకమ్మ తోటలో పడేయాలని చూశాడు. మూటని కిందికి తీసుకెళుతుండగా అపార్ట్‌మెంట్‌వాసు లు గమనించడంతో విషయం బయటపడింది. నాగును హత్య తర్వాత నుంచి శవాన్ని మాయం చేసే యత్నానికి మధ్య సుక్రు తన తండ్రితో ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపిన ట్లు పోలీసులు గుర్తించారు. నాగు మృతదేహా న్ని తరలించడానికి వెంకటేశ్వర్లుకు చెందిన కారును వినియోగించాలని చూసినట్లు ఆధారా లు సేకరించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం వెంకటేశ్వర్లును అదు పులోకి తీసుకుని విచారిస్తున్నారు.

‘సంబంధాల’ కోణంలో దర్యాప్తు!
తాను నాగును కావాలని హత్య చేయలేదని  సుక్రు పోలీసులకు వెల్లడించాడు. అనుకోకుం డా జరిగిన గొడవలో తాను దాడి చేయడంతో చనిపోయాడని తెలిపాడు. అయితే సుక్రు– నాగు మధ్య అనైతిక సంబంధం ఉందనే సమాచారంతో పోలీసులు నిందితుడిని ఆ కోణంలో ప్రశ్నించగా మౌనమే సమాధానంగా వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ హత్య వెనుక అక్రమ సంబంధాల కోణాన్నీ పోలీసు లు పరిశీలిస్తున్నారు. ఇక తన డ్రైవర్‌ నాగు తప్పిపోయాడని వెతుక్కుంటూనే..  సుక్రు ఆ అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లాడని ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్లు పోలీసు విచారణలో పేర్కొన్నట్లు సమాచారం. కానీ పలు అనుమానాల నేపథ్యం లో.. పోలీసులు వెంకటేశ్వర్లును సైతం వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ, ‘సంబంధాల’పై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

రోదిస్తున్న మృతుడి భార్య జమున (ఇన్ సెట్ లో మృతుడు నాగరాజు)
నాగు సెల్‌ఫోన్‌ మాయం!
హత్య అనంతరం అపార్ట్‌మెంట్‌ నుంచి కిందికి వచ్చిన  సుక్రు.. నాగు సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లి అపార్ట్‌మెంట్‌ సమీపంలోని మెట్రోరైల్‌ పిల్లర్‌ వద్ద పడేసి వెళ్లినట్లు తెలిసింది. అది ఓ మహిళకు దొరికినట్లు భావిస్తున్నారు. పోలీసులు, హతుడి భార్య ఆ ఫోన్‌కు కాల్‌ చేస్తుండగా.. ఆ మహిళ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తూ, వెంటనే కట్‌ చేస్తోంది. దీంతో సాంకేతికంగా ఆరా తీస్తున్న పోలీసులు.. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా.. దారావత్‌ వెంకటేశ్వర్లు 1991లో పోలీసు శాఖలో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆపై గ్రూప్‌–1 ద్వారా 1994లో ఆర్డీవో పోస్టు పొందారు. 2007లో ఆయనకు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా వచ్చింది. వ్యవసాయ శాఖలోకి రావడానికి ముందు ఆయన నిజామాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

సుక్రు తండ్రి పాత్రపై అనుమానాలున్నాయి
నాగు హత్య కేసులో  సుక్రు పాత్రపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరించాం. మృత దేహాన్ని మాయం చేయడానికి సహకరిం చారనే అనుమానంతో ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. హత్యకు కారణాలను విశ్లే షిస్తున్నాం. వెంకటేశ్వర్లు తన భార్యకు విడాకులిచ్చి కొంత కాలంగా వేరుగా ఉం టున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టం.
– ఎ.వెంకటేశ్వరరావు, వెస్ట్‌జోన్‌ డీసీపీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement