బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ ను ఎత్తివేశారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. కాలుష్యం తగ్గించేందుకు రైలు బోగీల్లో బయో టాయ్‌లెట్స్ పెట్టనున్నారు.
- 2017-18 రైల్వే బడ్జెట్ రూ.1,31,000 కోట్లు
- ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో రైల్వే భద్రత నిధి ఏర్పాటు
- వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు
- ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు
- రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు
- రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు
- 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్
- 7 వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్ పవర్ ఏర్పాటు
- కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు
- 2020 నాటికి మానవ రహిత రైల్వే క్రాసింగులు
- కొత్తగా 3500 కిలోమీటర్ల రైల్వే లైన్ల ఏర్పాటు
- ఆధ్యాత్మిక, పర్యాటకానికి ప్రత్యేకంగా రైళ్లు
- కొత్తగా మెట్రో రైలు పాలసీ ప్రకటించనున్న కేంద్రం
- ఐఆర్ సీఓఎన్, ఐఆర్ సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు
- ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ కు రూ. 2.41 కోట్ల కేటాయింపు
- భారత్ నెట్ ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్ల నిధులు