సుప్రీం తీర్పుతో శశికళ ఆశలు ఆవిరి..
అమ్మ తర్వాత అమ్మగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, తమిళనాడలో చక్రం తిప్పాలనుకున్న శశికళకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
అమ్మ తర్వాత అమ్మగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, తమిళనాడలో చక్రం తిప్పాలనుకున్న శశికళకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్పెషల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. దీంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడును ఏలాలనుకున్న శశికళ ఆశలు ఆవిరయ్యాయి. పదేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతికంగా దోషిగా నిర్ధారైన వారు ఆరేళ్లే రాజకీయ జీవితానికి దూరంగా ఉండాల్సి ఉన్నా.. ఆమె జైలు శిక్షను పరిగణలోకి తీసుకుని మొత్తం పదేళ్లు ఆమె ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి వీలులేదు.
దీంతో శశికళను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఆమె వర్గానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అంతకముందు కూడా శశికళ, జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించారు. కానీ అక్కడి ప్రజలు శశికళను వ్యతిరేకించారు. అమ్మ మరణించిన తర్వాత పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన శశికళ, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి తమిళనాడు రాష్ట్రాన్ని ఏలాలని నిర్ణయించారు. నేటి సుప్రీం తీర్పుతో ఆమె కలలు కల్లలయ్యాయి.
శశికళ కేసు.. మరిన్ని కథనాలు