Published
Sun, Jan 5 2014 10:05 PM
| Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
శృతి హాసన్ కు అస్వస్థత, అపోలోకు తరలింపు
శృతి హాసన్ కు స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రేసు గుర్రం షూటింగ్ పూర్తి చేసుకుని 8 గంటల తర్వాత ఎవడు చిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవడు కార్యక్రమంలో పాల్గొన్న శృతి హాసన్ కడుపు నొప్పి రావడంతో ఫిల్మ్ నగర్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
శృతి హాసన్ కు వెంటనే పరీక్షలు జరిపి చికిత్సనందిస్తున్నారు. అయితే పూర్తిగా పరీక్షలు పూర్తయ్యాక వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అపెండిసైటిస్ అని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శృతి హసన్, రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రం జూన్ 12 తేదిన విడుదలకు సిద్దమవుతోంది.