Published
Mon, Feb 13 2017 12:50 PM
| Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ!
తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. బద్ధశత్రువులైన డీఎంకే - అన్నాడీఎంకే నేతలు సమావేశమవుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పన్నీర్ సెల్వం.. ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారు.
డీఎంకేను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రిగా పనిచేసి, అమ్మకు అత్యంత విధేయుడిగా పేరొందిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ కావడం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. అవసరమైతే పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని కూడా ఒక సందర్భంలో స్టాలిన్ అన్నట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి భేటీ నేపథ్యంలో నిజంగానే మద్దతు గురించి చర్చిస్తారా లేక వేరే ఏమైనా చర్చలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.