శశికళకు భారీ ఊరట! | supreme court not deliver verdict in sasikala da case this week | Sakshi
Sakshi News home page

శశికళకు భారీ ఊరట!

Published Fri, Feb 10 2017 8:21 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

శశికళకు భారీ ఊరట! - Sakshi

శశికళకు భారీ ఊరట!

తమిళ సీఎం పీఠం ఆశిస్తూ.. ఏ క్షణంలో ఏం జరుగుతుంతో అర్థం కాక సతమతం అవుతున్న చిన్నమ్మ శశికళకు అనుకోకుండా  భారీ ఊరట లభించింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెం.2గా ఉన్న శశికళ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఈ వారంలోనే తీర్పు వస్తుందని భావించినా, ఇప్పుడు మాత్రం అది మరికొంత ఆలస్యం కాక తప్పదని చెబుతున్నారు. 2016 జూన్ నెలలోనే విచారణ పూర్తి కాగా అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఒకేవేళ ఈ కేసులో శశికళను దోషిగా నిర్ణయిస్తే ఆమె సీఎం పదవి కోల్పోవడమే కాదు.. కొంత కాలం పాటు ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా వీలు లేకుండా నిషేధం పడుతుంది. 1996లో జయలలితపై బీజేపీ నాయకుడు సుప్రబమణ్యం స్వామి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దాఖలు చేశారు. దాంతో ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 
 
2015 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు జయలలిత తదితరులపై ఉన్న కేసును కొట్టేయడంతో.. అందరూ విడుదలయ్యారు. కానీ, అదే సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలుచేసింది. అంతకుముందు బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. దాంతో తాత్కాలికంగా ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. మళ్లీ హైకోర్టు తీర్పు అనంతరం 2016 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్.. ఈ నలుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు 2016 జూన్ 7వ తేదీన వాయిదా వేసింది.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement