పళనిస్వామిని ఓడించండి: రాహుల్ | Tamilnadu congress mlas have to vote against trust motion, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పళనిస్వామిని ఓడించండి: రాహుల్

Published Sat, Feb 18 2017 8:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పళనిస్వామిని ఓడించండి: రాహుల్ - Sakshi

పళనిస్వామిని ఓడించండి: రాహుల్

తమిళనాడు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో ఎటువైపు ఉండాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సందిగ్ధతకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెరదించారు. అక్కడున్న ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, పళనిని ఓడించాలని తెలిపారు. దాంతో ఇప్పటివరకు ఏం చేద్దామంటూ అటూ ఇటూ ఊగిసలాటలో ఉన్న తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు ఓ స్పష్టత వచ్చినట్లయింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఎస్ తిరునావుక్కరసర్‌కు శుక్రవారం రాత్రి దాటిన తర్వాత అధికారికంగా తెలియజేశారు. 
 
అంతకుముందు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో టీఎన్‌సీసీ చీఫ్ తిరునావుక్కరసర్ సమావేశమయ్యారు. బలపరీక్ష విషయంలో ఏం చేయాలన్న దానిపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఎమ్మెల్యేలకు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు తాము మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అప్పుడు చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటూ తాను ట్వీట్ చేసినట్లుగా వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. చివరకు అధికారికంగా ఢిల్లీ నుంచి కబురు రావడంతో అదే పని చేయాల్సి వస్తోంది.

మరిన్ని తమిళనాడు విశేషాలు..

భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు

పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్‌

మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!

బలపరీక్షకు కరుణానిధి దూరం!

ఎవరీ సైనైడ్ మల్లిక!

అమ్మకు ఓటేయండి

నన్ను చూసి నవ్వొద్దు

‘మ్యాజిక్‌’ చేసేదెవరు?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement