లాలు కుమారుడి స్టైలే వేరు!
పట్నా: బిహార్ రాజకీయాల్లో లాలు ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. ప్రస్తుతం అధికార పదవులకు దూరంగా లాలు తన ఇద్దరు కొడుకులను మంత్రులను చేశారు. ఒకరు బిహార్ ఉప ముఖ్యమంత్రి కాగా, మరొకరు ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి.
లాలు పుత్రరత్నం, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆదివారం నూతన సంవత్సర వేడుకలను వెరైటీగా జరుపుకొన్నారు. కృష్ణుడిలా డ్రెస్ వేసుకుని, ఫ్లూట్ వాయించారు. శ్రీకృష్ణుడి భక్తుడు ఒకరు తనకు కానుకగా ఈ దుస్తులు, ఫ్లూట్ ఇచ్చారని తేజ్ ప్రతాప్ చెప్పారు. ఈ దుస్తులు వేసుకుని, ఫ్లూట్ వాయిస్తూ నూతన సంవత్సర వేడుకలను చేసుకున్నానని తెలిపారు.