జెరూసలెంలో జగన్ కోసం ప్రార్థనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ఇక్కడే కాదు.. క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువాళ్లు జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఇక్కడినుంచి వెళ్లిన జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా వెళ్లి.. జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి బెయిల్ మంజూరు కావడంతో మరోసారి వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.