కీచక వినోదం: ప్రాంక్‌ పేరిట పబ్లిగ్గా ముద్దు.. | YouTuber who kissed women without consent | Sakshi
Sakshi News home page

కీచక వినోదం: ప్రాంక్‌ పేరిట పబ్లిగ్గా ముద్దు..

Published Sat, Jan 7 2017 7:26 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

కీచక వినోదం: ప్రాంక్‌ పేరిట పబ్లిగ్గా ముద్దు..

కీచక వినోదం: ప్రాంక్‌ పేరిట పబ్లిగ్గా ముద్దు..

నూతన సంవత్సరం సందర్భంగా బెంగళూరులో నిస్సిగ్గుగా సాగిన కీచక పర్వాన్ని మరువకముందే ఢిల్లీలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ యువకుడు ఒకడు 'ప్రాంక్‌' పేరిట కీచక చర్యకు పాల్పడ్డాడు. యువతుల అనుమతి తీసుకోకుండానే బహిరంగంగా వారిని ముద్దుపెట్టుకొని.. ఆ వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. 'క్రేజీ సుమిత్‌' పేరిట యూట్యూబ్‌ చానెల్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలపై బెంగళూరు ఘటనల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ కీచక చర్యలపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవ్వడంతో సదరు ప్రాంక్‌స్టర్‌ యూట్యూబ్‌ నుంచి ఆ వీడియోలు తొలగించాడు. తాను సరదాకు చేశానని, దీనిపై ఇంత ఆగ్రహం వస్తుందని అనుకోలేదని క్షమాపణ చెప్తూ ఓ వీడియో పెట్టాడు. యూట్యూబ్‌లో ఆదాయం కోసం నికృష్టమైన వీడియోలు పెట్టిన అతను.. తన క్షమాపణ వీడియోకు కూడా మంచి క్లిక్కులు వస్తుండటంతో దానినీ క్యాష్‌ చేసుకుంటున్నాడు. కాగా, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతని తీరుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని, బాధితులు ముందుకొచ్చి వివరాలు తెలుపాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement