
ముంబై మహానగరంపై ముష్కరమూక సాగించిన మారణకాండ(26/11 దాడి)కు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. నాటి నరమేధానికి 166 మంది బలైపోగా, 300 మంది గాయపడ్డారు. ఆరేళ్లు గడిచినా మారణహోమం తాలుకు భయాలు జాతిని వెంటాడుతూనే ఉన్నాయి.

నరమేధానికి నిలువెత్తు ప్రతిరూపాలు ఈ ఉగ్రవాదులు. ఓ హోటల్ లో సీసీ కెమెరాకు చిక్కిన నరరూప రాక్షసులు.

సీఎస్ టీ: ఉగ్రవాదుల కాల్పుల తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ లో బీతావాహ దృశ్యం.

ఉగ్రవాదుల చేతిలో దాడికి గురై మౌనసాక్ష్యంగా నిలిచి గేట్ వే ఆఫ్ ఇండియా

ముష్కరమూకతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన హేమంత్ కర్కరే అంత్యక్రియలు.

సజీవంగా పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత అతడిని ఉరితీశారు.

ప్రతీకారేచ్ఛతో ముంబై మహానగరంలో ఉగ్రవాదులు పారించిన రుధిర ధారాలు

ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులు

ఉగ్రవాదులు సాగించిన విధ్వంసానికి ఇదో సజీవ సాక్ష్యం.

బల్లలు కింద దాక్కున్నా ప్రాణాలు కాపాడుకోలేకపోయిన అభాగ్యులు. తీవ్రవాదుల తూటాలకు హోటల్ లో నేలకొరిగిన అతిథులు.

26/11 ముట్టడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, పౌరులు

విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు తీసుకొచ్చిన ఆర్డీఎక్స్

ఉగ్రవాదుల దాడితో మంటల్లో చిక్కుకున్న హోటల్ తాజ్మహల్ ప్యాలెస్

భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఉగ్రవాదులు